Young Man Died After jumping Into The Pond :ఈ రోజుల్లో స్నేహితులు ఏదైనా ప్రమాదాల్లో ఉంటే ప్రాణాలకు తెగించి కాపాడే సన్నివేశాలను చూశాం. కానీ నీటిలో మునిగిపోతున్న స్నేహితుడిని రక్షించే అవకాశం ఉన్నా తోటి మిత్రులు చూస్తూ ఉండిపోయారు. దర్గాకెళ్లి తిరిగొస్తుండగా మద్యం మత్తులో తూలుతున్న యువకుడు బ్యారేజీలోకి దూకి నీటమునిగి మరణించాడు. ఈ దుర్ఘటన ఈ నెల 19న కర్ణాటక రాష్ట్రం, కమలాపూర్ తాలూకా, పటవాడ గ్రామం సమీపంలో జరిగింది. మృతుడు పాతబస్తీ బండ్లగూడ ఠాణా పరిధిలోని జహంగీరాబాద్ వాసిగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : జహంగీరాబాద్ బస్తీకి చెందిన సయ్యద్ వాజీద్ అలియాస్ వాజీద్ గోటి(27), మహ్మద్ అఫ్రోజ్ అలియాస్ అఫ్ఫు కోమా(28), తాజుద్దీన్ అలియాస్ తాజు(26), సయ్యద్ సమీర్(25), మహ్మద్ సాజిద్(27)లు ఈనెల 18న రాత్రి ఆటోలో కర్ణాటక రాష్ట్రం కమలాపూర్, చెడుగుప్ప, చెంగటలోని మస్తానా ఖాద్రీ దర్గాలో ప్రార్థనలకు వెళ్లారు.
19న తిరుగు ప్రయాణంలో కమలాపూర్ తాలూకా, పటవాడ గ్రామం సమీపంలోని బ్రిడ్జికో, మిడ్‌వే సెయిల్ బ్యారేజీ వద్దకు వచ్చారు. అంతకు ముందే వీరంతా గంజాయి, మద్యం తాగి మత్తులో ఉన్నారు. బ్యారేజీలో దిగిన తాజుద్దీన్, అఫ్రోజ్‌లు ఈత కొడుతున్నారు. గట్టునే ఉన్న మహ్మద్ సాజిద్ మత్తులో కాలు నిలపలేని స్థితిలో ఈత కొడతాను అన్నాడు. తోటి స్నేహితుడు ఈత వస్తేనే నీటిలోకి దిగు లేకపోతే వద్దు అని వారించాడు. అయినా వినకుండా సాజిద్ నీటిలోకి దూకేందుకు సిద్ధమయ్యాడు.