A Man Behaves Strangely at Machilipatnam Government Hospital :తాగినప్పుడు కొంతమంది అస్సలు కంట్రోల్ లో ఉండరు. వారు ఏం చేస్తున్నారో కూడా వారికే తెలియదు. ఎవరి మీదకి పడితే వారి మీదకు గొడవకు వెళుతూ ఉంటారు. ఏది పడితే అది మాట్లాడుతుంటారు. వారు చెప్పిందే నిజం, ఇతరులు ఎంత మెుత్తుకొని చెప్పిన వినరు. ఆ పరిస్థితుల్లో వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇంలాంటి ఘటనలు చూసేందుకు సరదాగా ఉంటాయి. మత్తులో ఉన్న వారి విచిత్ర ప్రవర్తనను చూసి నవ్వుకున్న వారెెందరో.
విధి వెక్కిరించినా ఆత్మస్థైర్యంతో ముందుకు దూసుకెళ్తున్న యువకుడు - handicapped person successful story
ఫుల్లుగా మద్యం కొట్టి వింత వాగుడు వారే వారిని తిట్టలేెం, కొట్టాలేెం. ఎందుకంటే ఈ రెండు చేసినంత మాత్రాన వారి హంగామా మాత్రం తగ్గదు. తాగిన మత్తు పూర్తిగా వదిలిన తరువాతకానీ చేసిన తప్పు బోధపడదూ! మహాను భావులకూ.. ఇలాంటి సంఘటనలు మన చూట్టూ పక్కల తరచూ చూస్తునే ఉంటాం. తాజాగా అచ్చం ఇలాంటి ఘటనే కృష్ణ జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. ఓ మందుబాబు చేసిన హల్చల్ అంత ఇంతా కాదు. అతడి వీరంగానికి ఆసుపత్రి సిబ్బందే హడలెత్తిపోయారు.
అసలేం జరిగిందంటే?
మద్యం మత్తులో ఓ వ్యక్తి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. తన వెంట తీసుకువచ్చిన కుక్క పిల్లను చూపించి నా పిల్లికి వైద్యం చేయ్యాలంటూ అక్కడి ఆసుపత్రిలోని క్యాజువాలిటీ వార్డు వద్ద హంగామా చేశాడు. అది పిల్లి కాదు మహాప్రభో.. అది కుక్క అని సిబ్బంది ఎంత మొత్తుకున్నా సదరు తాగుబోతు, ఇక్కడ వైద్యం చేయాల్సిందే అంటూ పట్టబట్టాడు. ఇక్కడ మనుష్యులకు మాత్రమే వైద్యం చేస్తారని, నీవు అంటున్న ఆ పిల్లిని వెంటనే పశు వైద్యాశాలకు తీసుకువెళ్లాలని సిబ్బంది సూచించారు. వారి మాటలను లెక్క చేయ్యాని మందుబాబు, తాగింది మీర లేక నేనా చెబితే వినరా? అంటూ వారితోనే వాగ్వాదానికి దిగాడు. వెంటనే నా పిల్లికి వైద్యం చేయ్యాలంటూ పట్టుపట్టాడు. ఎంత చెప్పిన వినకుండా ఆసుపత్రి వద్ద హల్చల్ చేశాడు.
అంతేగాక చూడండి నా చేతిలో ఉన్నాది పిల్లి అంటూ అందరికి చూపించాడు. ఆసుపత్రి సిబ్బందితో పాటు అక్కడ ఉన్నవారు సైతం అది కుక్క అని ఎంత వాదిస్తున్నా అతను మాత్రం ఒప్పుకోలేదు. ఆ మద్యం మత్తులో అతను విచిత్ర ప్రవర్తనని చూసి అక్కడి వారు సరదాగా నవ్వుకున్నారు. అతడితో వాగ్వాదం చేస్తున్న వ్యక్తికి మాత్రం కోపం కట్టెలు తెచ్చుకుంది. అయినా సదరు మందుబాబు మాత్రం పంతం విడువలేదు. చివరికి చేసేదేమి లేక ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతడికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. ప్రస్తుతం ఈ సంఘటన నెట్టింట వైరల్ అవుతుంది.
అబ్బురపరిచిన శిలంబం పోటీలు - దేశం నలుమూలల నుంచి పాల్గొన్న ఔత్సాహికులు - Ancient Martial Art Silambam
జీఎంఆర్ ఐటీ వేదికగా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పోటీలు - ఆధునిక సాంకేతికతను రూపొందించిన విద్యార్థులు
తాగిన మత్తులో ఓ వ్యక్తి హల్చల్ - కుక్కను తెచ్చి పిల్లికి వైద్యం చేయాలంటూ ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదం, చివరికి ఏమైందంటే? (ETV Bharat)