A Gang of Robbers Chased and Caught by Villagers :ఓ గ్రామంలో దొంగతనం చేయాలనుకున్నముఠా ముందుగా వేసుకున్న పథకం ప్రకారం రెక్కీ నిర్వహించింది. ద్విచక్ర వాహనాలపై చేతిలో ఇనుప రాడ్లను పట్టుకొని ఆ గ్రామంలో హల్ చల్ చేశారు. వారిపై అనుమానం కలిగిన గ్రామస్థులకు ఆ ముఠాను పట్టుకోవాలనుకున్నారు. అచ్చం సినీఫక్కీని తలపించే విధంగా వెంబడించి, మాటు వేసి పట్టుకునే ప్రయత్నం చేశారు. చివరికి పోలీసుల రంగ ప్రవేశంతో కథ మలుపు తిరిగింది. అసలేం జరింగిందో పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం?
వివరాల్లోకి వెెళ్తే, శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలం కొట్టంవారిపల్లిలో దొంగతనం చేయ్యడానికి ఓ ముఠా రెక్కీ నిర్వహించింది. కొట్టంవారి పల్లిలో రెండు ద్విచక్ర వాహనాలపై నలుగురు వ్యక్తులు చేతిలో ఇనుప రాడ్లు పట్టుకొని తిరుగుతూ హల్ చల్ చేశారు. వారి ప్రవర్తనపై గ్రామస్థులకు అనుమానం కలిగింది. వారిని పట్టుకుని సంగతేంటో టేంతో? తేల్చుకొవాలని నిశ్చయించుకున్నారు. అనుకున్నట్లుగానే వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన దొంగలు రెండు ద్విచక్ర వాహనాలపై ఒక ముఠా రాయచోటివైపు మరో ముఠా కదిరి వైపు వెళ్లారు.
సమీపంలోనే మాటు వేసి :ఎలాగైనా వారిని పట్టుకునేందుకు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కదిరివైపు వెళ్లిన వారిని బైక్పై వెంబడించారు. గ్రామస్థులు వెంబడిస్తున్నారని తెలుసుకున్న దొంగలు ద్విచక్ర వాహనాన్ని గాండ్లపెంట మండలం చామాలగొంది వద్ద వదిలి పారిపోయారు. వెళ్లిన దొంగలు కచ్చితంగా బైక్ కోసం వస్తారని తెలిసి కొట్టంవారి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అక్కడి సమీపంలోనే మాటు వేశారు. అనుకున్నట్లుగానే ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్లేందుకు స్కార్పియో వాహనంలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిని పట్టుకుంనేందుకు అప్పటికే మాటు వేసిన యువకులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. వెంటనే తెరుకున్న దుండగులు కారును తిమ్మమ్మ మర్రిమాను వైపు మళ్లీంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు.