ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రంగారెడ్డి జిల్లా గ్లాస్​ పరిశ్రమలో గ్యాస్​ కంప్రెషర్​ పేలుడు- ఐదుగురు మృతి - Blast in South Glass Factory

Blast in South Glass Factory Shadnagar : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని సౌత్ గ్లాస్‌ అనే పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోని కంప్రెషర్ గ్యాస్ బ్లాస్ట్ జరిగి ఐదుగురు మంది మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది.

blast_in_south_glass_factory
blast_in_south_glass_factory (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 6:41 PM IST

Updated : Jun 28, 2024, 9:14 PM IST

Blast in South Glass Factory in Shadnagar : గ్యాస్​ కంప్రెషర్​ పేలి ఐదుగురు దుర్మరణం చెందిన ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో చోటుచేసుకుంది. షాద్​నగర్​లోని సౌత్​ గ్లాస్​ పరిశ్రమలో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఐదుగురు మృతిచెందగా, 15 మంది కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు.

కంప్రెషర్​ పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పేలుడుతో పరిశ్రమలో భీతావహ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. శంషాబాద్ డీసీపీ రాజేశ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ దుర్ఘటన ఎలా జరిగిందనే దానిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మృతులను బిహార్‌, యూపీ, ఒడిశా వాసులుగా గుర్తించారు. తీవ్ర గాయాలైనవారిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. పేలుడు ధాటికి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గతంలో ఇక్కడ ఇలాంటి ఘటన జరిగినప్పుడే కార్మికుల భద్రత దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని ఇచ్చిన సూచనల్ని ఏ మేరకు పాటించారనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

కోల్​కతా Vs అనంత ఫ్యాషన్ డిజైనర్లు - పోలీస్​స్టేషన్​కు చేరిన పంచాయితీ - Clash Between Fashion Designers

ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించాలని కలెక్టర్​కు ఆదేశాలు జారీచేశారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాప‌క శాఖ‌, కార్మిక‌, పరిశ్రమల శాఖలు, వైద్య బృందాలు ఘ‌ట‌నా స్థలిలోనే ఉండి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం స్పష్టం చేశారు.

కేటీఆర్ సంతాపం.. షాద్ నగర్ ప్రమాదంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సౌత్ గ్లాస్ లిమిటెడ్​లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భవిష్యత్ లో ప్రమాదాలు జరగకుండా రాష్ట్రప్రభుత్వం పారిశ్రామిక ప్రాంతాల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని, విపత్తు నిర్వహణ ప్రణాళికలు సమేక్షించాలని పేర్కొన్నారు.

సౌత్ గ్లాస్ పరిశ్రమలో గ్యాస్ కంప్రెషర్ పేలుడు ఘటనపై రంగారెడ్డి జిల్లా కార్మిక సంఘాల నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలో పీవీబీ ఆటోక్లేవ్ అనే గ్యాస్ కంప్రెషర్ పేలుడుతో ప్రమాదం చోటుచేసుకుందని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించారని, గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. సంబంధింత కంపెనీ యాజమాన్యం బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్‌ రాజీనామా - AU VC and Registrar Resigned

అజిత్​సింగ్​ నగర్​ మదర్సాలో విద్యార్థిని మృతి - అసలేం జరిగింది ? - Student Death Mystery in madarsa

Last Updated : Jun 28, 2024, 9:14 PM IST

ABOUT THE AUTHOR

...view details