80 Kgs Jackfruit in Konaseema : అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో ఓ చెట్టుకు కాసిన పనస పండు అబ్బుర పరుస్తోంది. 80 కిలోల బరువుతో భారీ పొడవున ఉన్న ఈ బాహుబలి పనస పండు అందరిని ఆకట్టుకుంటోంది. పి.గన్నవరం లంకలలో ఉండే పనస చెట్లనుంచి పనస పండు తెచ్చామని పళ్ల వ్యాపారి చెబుతున్నారు. సాధారణంగా పనసపండు 25 నుంచి 30 కేజీల బరువు మాత్రమే ఉంటుందని ఇది, ఏకంగా 80 నుంచి 90 కేజీల బరువు ఉందని చెబుతున్నారు.
తాము 30 ఏళ్లుగా పండ్ల వ్యాపారం చేస్తున్నామని కానీ ఇంత పెద్ద పనస పండు ఎప్పుడు చూడలేదు అంటున్నారు వ్యాపారులు. అయితే ఒక పనసపండును ఏకంగా ముగ్గురు మోసుకు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. పనస పండులో సుమారు 800 నుంచి 900 పనస తొనలు ఉంటాయని వ్యాపారి ప్రభు చెబుతున్నాడు.
Jackfruit: విరగ కాసిన పనస.. వామ్మో చెట్టుకు ఎన్ని కాయలో..!
ఈ పనసపండును తిలకించేందుకు పలువురు ఆసక్తి కనబరిచారు. దీంతో దుకాణ యజమాని కూడా ఈ పనసపండును తమ దుకాణం ముందు ప్రదర్శనకు ఉంచారు. అంబాజీపేట కేంద్రంగా పనస పండ్ల వ్యాపారం జోరుగా జరుగుతుంది. ఈ ప్రాంతం నుంచి ఇతర జిల్లాలకు వ్యాపారులు రైతులు పనసపండ్లను ఎగుమతి చేస్తుంటారు.