Rohit Sharma On BCCI New Rules :2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. జట్టు ప్రకటనకు ముందు బీసీసీఐ ముంబయిలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొన్నాడు. అయితే టీమ్ఇండియా రీసెంట్ ప్రదర్శనను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ కొత్తగా 10 రూల్స్ తీసుకురానుందంటూ ప్రచారం సాగుతోంది.
ఈ నిబంధనలపై తాజా సమావేశంలో రోహిత్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. దానికి కెప్టెన్ తనదైన రీతిలో సమాధానం ఇచ్చాడు. 'ఈ నిబంధనల గురించి మీకు ఎవరు చెప్పారు? ఇదేమైనా బీసీసీఐ అఫీషియల్ హ్యాండిల్ నుంచి వచ్చిందా? ముందు అధికారికంగా రానివ్వండి, ఆ తర్వాత మాట్లాడుదాం' అని రిప్లై ఇచ్చాడు.
ఇవే ఆ నిబంధనలు
ఇటీవల ముగిసిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భారత్ ఓడడం వల్ల బీసీసీఐ ఆటగాళ్ల పట్ల క్రమశిక్షణ చర్యలు తీసుకోనుందని ప్రచారం సాగింది. ప్రచారంలో ఉన్న కొన్ని నిబంధనలు ఇవే!
- ఆటగాళ్లు పర్యటనలు, ప్రాక్టీస్, మ్యాచ్‌ల కోసం అందరూ కలిసే ప్రయాణించాలి
- 45 రోజుల పాటు కొనసాగే పర్యటనల్లో, ప్లేయర్లతో వారి కుటుంబ సభ్యులు రెండు వారాలకు మించి ఉండకూడదు
- వ్యక్తిగత సిబ్బందితో ఏ ఆటగాడు ప్రయాణించకూడదు
- జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే డొమెస్టిక్ క్రికెట్ తప్పనిసరి
- ఈ నిబంధనలు పాటించకపోతే ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఈ రూల్స్‌ను బీసీసీఐ త్వరలోనే అమలు చేయనుందని వార్తలు వచ్చాయి. వీటిపైనే ప్రశ్నించగా, రోహిత్ ఈ విధంగా జవాబిచ్చాడు.