Rohit Sharma T20 World Cup 2024 :టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ సారధ్యంలో టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను రోహిత్‌కు డిప్యూటీగా నియమించారు. అయితే, పాండ్యను తుది జట్టులోకి తీసుకున్న విషయం కెప్టెన్ రోహిత్‌తో పాటు, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు ఇష్టం లేదంటూ ఓ వార్త నెట్టింట ట్రెండ్ అవుతోంది.
ఐపీఎల్లో హార్దిక్ పెర్ఫామెన్సే ఇందుకు కారణమని అందులో రాసుంది. అంతేకాకుండా ఒత్తిడిలోనే పాండ్యను సెలెక్ట్ చేసినట్లు ఆ వార్తలో పేర్కొంది. ఇదిలా ఉండగా, ఈ టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ పలికే అవకాశాలు ఉన్నట్లు కూడా ఆ కథనంలో రాసుంది. అయితే ఈ విషయంపై అటు బీసీసీఐ కానీ ఇటు ప్లేయర్లు కానీ ఇంతవరకు స్పందించలేదు.
మరోవైవు టీ20 ప్రపంచకప్‌నకు తుది జట్టు ప్రకటించిన సమయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హార్దిక్ ఎంపికపై స్పందించాడు. ఐపీఎల్లో పేలవ ఫామ్ కనబరిచినప్పటికీ అతడ్ని జట్టులోకి ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్నకు ఆయన ఆ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు. హార్దిక్‌కు ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లనే అతడ్ని జట్టులోకి తీసుకున్నట్లు వివరించారు.
టీమ్ ఇండియా పూర్తి జట్టు ఇదే : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, సిరాజ్.