KL Rahul Injury :టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్! రీసెంట్గా గాయపడిన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, మళ్లీ బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టు కోసం ప్రాక్టీస్‌లో భాగంగా టీమ్ఇండియా ప్లేయర్లు ఇంట్రాస్క్వాడ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో రాహుల్ మోచేతికి గాయమైంది. దీంతో రాహుల్ మైదానం వీడాడు. ఆ తర్వాత రోజు కూడా మైదానంలో దిగలేదు. అందువల్ల రాహుల్ గాయంపై అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
తాజాగా రాహుల్ మళ్లీ ప్రాక్టీస్‌లో దిగినట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి. దీంతో రాహుల్ తొలి టెస్టుకు ఆందుబాటులో ఉండడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. దీనిపై టీమ్ఇండియా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించే ఛాన్స్ ఉంది.
గాయాల గోల
ప్రతిష్ఠాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ముంగిట ప్లేయర్ల గాయాలు అభిమానులను కలవర పెడుతున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలుత రాహుల్ గాయం బారిన పడితే, తర్వాత యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఏకంగా గిల్ బొటన వేలికి క్రాక్ వచ్చినట్లు తెలిసింది. శనివారం జట్టులోని ఆటగాళ్లతో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా గిల్ వేలికి బంతి బలంగా తాకింది. నొప్పితో బాధపడుతూ వెంటనే మైదానాన్ని వీడాడు. అయితే స్కానింగ్‌లో అతడి వేలిలో చీలిక వచ్చినట్లు తేలిందని సమాచారం.