IPL 2024 CSK VS RCB Playoffs :ప్లే ఆఫ్స్‌కు ఇప్పటికే మూడు జట్లు బెర్త్‌లను కన్ఫామ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది. దాని కోసం సీఎస్కే - ఆర్సీబీ పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దైతే సీఎస్కే నేరుగా ప్లే ఆఫ్స్‌కు వెళ్లిపోతుంది. అదే మ్యాచ్ జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
సీఎస్కే ప్రస్తుతం ఏడు మ్యాచుల్లో విజయం సాధించి 14 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఆర్సీబీ ఆరు విజయాలు 12 పాయింట్ల ఆరో స్థానంలో ఉంది.
వర్షం పడి మ్యాచ్ రద్దైతే సీఎస్కే ఖాతాలోకి 15 పాయింట్లు వస్తాయి. కాబట్టి ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది. ఆర్సీబీ.13 పాయింట్లతో ఇంటికి వెళ్తుంది. ఇక ఇప్పటికే దిల్లీ క్యాపిటల్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కూడా టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే.
అదే మ్యాచ్ జరిగి సీఎస్కే గెలిస్తే ఇతర గణాంకాలతో సంబంధం లేకుండానే ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ఓడినా చెన్నై జట్టుకు ఛాన్స్ ఉంది. అయితే ఆ ఓటమి 18 పరుగుల లోపలే ఉండాలి. లేదంటే ఆర్సీబీ గెలిచి ఇరు జట్ల పాయింట్లు సమంగా నిలిస్తే మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్నవారే ప్లే ఆఫ్స్ వెళ్తారు. అంటే ఈ లెక్కన కూడా చెన్నైకే ఛాన్స్ ఉంది.
ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేస్తే
- మ్యాచ్ 20 లేదా 19 ఓవర్లు జరిగితే సీఎస్కే ముందు 200 పరుగుల లక్ష్యం ఉంచాలి. ఆ జట్టును 182కే క్లోజ్ చేయాలి.
- మ్యాచ్ 18 ఓవర్ల పాటు జరిగితే చెన్నై ముందు 190 పరుగులు సాథించాలి. అప్పుడు సీఎస్కేను 172కే కట్టడి చేయాలి.
- అదే 17 ఓవర్లలో 180 పరుగులు సాధిస్తే చెన్నైను 162 పరుగులకే పరిమితం చేయాలి.
- 16 లేదా 15 ఓవర్లు జరిగితే 170 రన్స్ చేయాలి. చెన్నైను 152కు పరిమితం చేయాలి.
- కనీసం 5 ఓవర్ల గేమ్ జరిగి 80 పరుగులు సాధిస్తే సీఎస్కేను 62కే కట్టడి చేయాలి.
అదే బెంగళూరు సెకండ్ బ్యాటింగ్ చేస్తే
- 20 ఓవర్ల గేమ్ జరిగి ఆర్సీబీ తొలుత బౌలింగ్ చేస్తే సమీకరణాలు ఇలా ఉన్నాయి.
- 20 ఓవర్లు ఆడి చెన్నై 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే 18.1 ఓవర్లలోనే దానిని పూర్తి చేయాలి.
- 19 ఓవర్లు ఆడి లక్ష్యాన్ని నిర్దేశిస్తే 17.1 ఓవర్లలోనే 201 పరుగులను ఛేదించాలి.
- 18 ఓవర్లు మ్యాచ్ అయి ఉండి 191 పరుగుల లక్ష్యమైతే 16.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఆర్సీబీ పూర్తి చేయాలి.
- 17 ఓవర్ల మ్యాచ్ అయితే 181 పరుగుల లక్ష్యాన్ని 15.1 ఓవర్లలోనే ముగించాలి.
- 16 లేదా 15 ఓవర్ల మ్యాచ్ అయి లక్ష్యం 171 పరుగులైతే 11 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ గెలుపొందాలి.
- వర్షం వల్ల మ్యాచ్ కనీసం 5 ఓవర్లు జరిగితే అప్పుడు 81 పరుగుల లక్ష్యాన్ని 3.1 ఓవర్లలోనే పూర్తి చేయాలి.
'నా రక్తంలోనే అది ఉంది - కోహ్లీ ఎంతో ప్రత్యేకం' - Usain Bolt Kohli
గుజరాత్‌తో మ్యాచ్ రద్దు - ప్లేఆఫ్స్‌కు హైదరాబాద్ - IPL 2024 GT VS SRH