తెలంగాణ

telangana

ETV Bharat / sports

జిమ్నాస్టిక్స్‌ రారాణి దీపా కర్మాకర్‌ సంచలన నిర్ణయం

Dipa Karmakar Announces Retirement : దేశంలో జిమ్నాస్టిక్స్‌ రారాణిగా పేరు పొందిన దీపా కర్మాకర్​ షాకింగ్​ డెసిషన్​.

By ETV Bharat Sports Team

Published : 5 hours ago

Updated : 4 hours ago

source ANI
Dipa Karmakar (source ANI)

Indian gymnast queen Dipa Karmakar Announces Retirement : దేశంలో జిమ్నాస్టిక్స్‌ రారాణి అంటే టక్కున వినిపించే పేరు దీపా కర్మాకర్‌ పేరే! ఆ రంగంలో ఆమె అంతలా తనదైన ముద్ర వేసింది. తాజాగా ఆమె సంచలన నిర్ణయం నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చింది.

కాగా, 2011 నేషనల్‌ గేమ్స్‌లో నాలుగు ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించడంతో దేశవ్యాప్తంగా దీపా కర్మాకర్‌ పేరు మార్మోగింది. ఇంకా చెప్పాలంటే వాస్తవానికి దేశంలో అమ్మాయిలను జిమ్నాస్టిక్స్‌ వైపుగా నడిచేలా స్ఫూర్తి నింపింది కూడా ఆమెనే. ఆసియన్‌ గేమ్స్‌లోనూ బంగారు పతకం గెలిచి, అది సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గానూ నిలిచింది. వరల్డ్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌, ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా రికార్డుకెక్కింది. ఇంకా దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో 77 పతకాలను తన ఖాతాలో వేసుకుంది.

కష్టాలకు ఎదురొడ్డి విజయతీరాలకు - దీపా కర్మాకర్ జీవితంలో చాలా కష్టాలను ఎదురొడ్డి జిమ్నాస్టిక్స్​లో ఎవరికి అందనంత ఎత్తుకు చేరింది. చిన్నప్పటి నుంచి ఆమెకు జిమ్నాస్టిక్స్ అంటే ఎంత ఇష్టమో తెలిపేందుకు ఓ చిన్న ఊదాహరణ కూడా ఉంది. ఓసారి శిక్షణ గది బయట ఎదురు చూస్తున్నాడు దీప తండ్రి. గంటలు గడుస్తున్నాయి కానీ ఎంతసేపటికీ దీపా కర్మాకర్ బయటికి రాలేదు. ఇంట్లోనేమో బంధువులు ఎదురుచూస్తున్నారు. ఆరోజు దీప కర్మాకర్‌ బర్త్ డే. కేక్‌ కట్ చేయడానికి తండ్రి రమ్మంటే దీప ట్రైనింగ్‌ పూర్తవ్వాల్సిందేనని పట్టుబట్టింది. అప్పటికామెకు పదేళ్లు కూడా లేవు. అంతలా దీపకు జిమ్నాస్టిక్ అంటే ఇష్టం. ఇప్పటికీ దీప తీరు అదే విధంగా ఉంది. నిజానికి జిమ్నాస్టిక్స్‌ లోకి దీప అనుకోకుండా వచ్చింది. ఆరేళ్ల వయసులో ఆమె కోచ్‌ బిశ్వేశ్వర్‌ నంది దీపను ఎంపిక చేసి శిక్షణిచ్చారు.

రోజుకు 8గంటల సాధన - దీప కర్మాకర్ స్వస్థలం త్రిపురలోని అగర్తల. ఆమె తండ్రి నాన్న శాయ్‌లో వెయిట్‌ లిఫ్టింగ్‌ కోచ్‌గా ఉండేవారు. అయినా దీప ప్రయాణం అంత సులువగా ఏమీ సాగలేదు. అసలే ఎక్కడ పడిపోతానో, దెబ్బలు తగిలించుకుంటానో అని చిన్నప్పుడు భయపడేది దీప. దాన్ని దాటి నెమ్మదిగా ఇష్టం పెంచుకుంటోంటే జిమ్నాస్టిక్స్‌కు పనికి రాద’న్నారు. కారణం దీప పాదం పూర్తిగా నేలను తాకేది. అలా ఉన్నవారికి విన్యాసాలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయట. పాదాల్లో ఆ వంపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడింది దీప. రోజూ 8 గంటలు కష్టపడి ప్రాక్టీస్ చేసేది. మంచి స్కూళ్లయితే శిక్షణకు ఇబ్బందని, ఉత్తీర్ణతను పెద్దగా పట్టించుకోని పాఠశాలలో చదివింది.

అరకొర సదుపాయాలతో - దీపకు శిక్షణా కాలంలో నిధులు, సరైన సదుపాయాల్లేవు. జిమ్‌లో వాడే పరుపులు, పాత స్కూటర్‌ భాగాలనే శిక్షణా వస్తువులుగా చేసుకుంది. అయినా నిరూపించుకోవాలన్న కసి దీప మనసు నిండా ఉండేది. అదే దీపను ప్రపంచానికి పరిచయం చేసింది. పతకం కోసం ప్రాణం పోయినా పర్లేదని దీప అంటుందని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. అంతలా జిమ్నాస్టిక్స్ పై దీప మక్కువ పెంచుకుంది.

ప్రొడునోవా విన్యాసంలో దిట్ట - 'ప్రొడునోవా' గురించి మనవాళ్లకు పరిచయం చేసింది దీపా కర్మాకర్ నే. 'వాల్ట్‌ ఆఫ్‌ డెత్‌'గా పిలిచే ఈ విన్యాసాన్ని చేయడానికి మహామహులే భయపడతారు. పరుగెత్తుతూ వచ్చి, బల్ల సాయంతో గాల్లో రెండుసార్లు పల్టీలుకొట్టి, నేలపై నిలవాలి. ఈక్రమంలో ఏ పొరపాటు జరిగినా మెడ, వెన్ను విరగడమే కాదు, చావుదెబ్బ పడొచ్చు. దాన్ని అలవోకగా చేసి, పాయింట్లు అందుకోవడంలో దీప దిట్ట. కాబట్టే, ఒలింపిక్స్‌లో పతకం రాకపోయినా, నాలుగోస్థానంలో నిలిచి, ప్రపంచ క్రీడాభిమానుల మనసులను గెలుచుకుంది.

బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్​గా ఇచ్చిన సచిన్ - క్రికెట్ మాజీ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ బీఎండబ్ల్యూ కారును దీపకు బహుమతిగా ఇచ్చాడు. ఎందుకంటే ఆమె స్ఫూర్తిగా ఎంతోమంది అమ్మాయిలు జిమ్నాస్టిక్స్‌లో చేరారు. దీప జీవితకథ పుస్తకంగా వచ్చింది. ఇదంతా కోణానికి ఒకవైపే. మరోవైపు గాయాలు దీపని వేధించాయి. మోకాలికి సర్జరీ అయ్యింది. ఆ తరవాత ఒక ఛాంపియన్‌షిప్‌లో బంగారం గెలిచినా మళ్లీ గాయం తిరగబెట్టింది. అన్నీ దాటుకొని వస్తే నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకుందని 21 నెలలు ఆట నుంచి నిషేధించారు. దీంతో దీప తీవ్ర మనోవేదనకు గురైంది.

ఆ మధ్య ఆసియన్‌ గేమ్స్‌లో గోల్ట్ కొట్టి, అది సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా నిలిచింది. సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డప్పుడూ, గెలిచి అగ్రస్థానాన నిలిచినప్పుడూ దీపది ఒకటే తీరు. అదే సంయమనంతో ఉండడం. ఈ తీరే ఆమెను ఎంతోమంది ఆదర్శంగా తీసుకునేలా చేస్తోంది.

'అప్పుడు చాలా భయపడ్డా - అలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు'

భారత్ సెమీస్ ఛాన్సెస్- ఆటతోపాటు అదృష్టమూ కావాలి! - India Semis Scenario T20 World Cup

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details