Ambati Rayudu On Rcb:2024 ఐపీఎల్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిష్క్రమించింది. రాజస్థాన్‌తో బుధవారం జరిగిన కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడింది. దీంతో తొలిసారి టైటిల్ సాధించాలన్న నెరవేరలేదు. కప్పు కోసం ఆర్సీబీ ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడు చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
'సంబరాలు చేసుకోవడం, దూకుడుగా ఆడడం వల్ల ఐపీఎల్ కప్పు గెలవలేం. ప్లేఆఫ్స్‌కు చేరగానే ట్రోఫీ రాదు. ఇక్కడ వరకు చేరడానికి ఎంత కష్టపడ్డారో ఫ్లేఆఫ్స్లోనూ అంతే కసిగా, ఒక ప్రణాళిక ప్రకారం ఆడాలి. కేవలం చెన్నైపై నెగ్గినంత మాత్రాన ఐపీఎల్ టైటిల్ రాదు. వచ్చే సీజన్లో మళ్లీ ప్రయత్నించండి' అని రాయుడు అన్నాడు. అయితే రీసెంట్గా ఆర్సీబీ, లీగ్ దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నైపై విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు చేరింది. మ్యాచ్ అనంతరం చెన్నై ప్లేయర్లతో ఫ్రెండ్లీ షేక్‌హ్యాండ్‌కు రాకుండా ఆర్సీబీ ప్లేయర్లు సంబరాల్లో మునిగిపోయారు. దీంతో రీసెంట్గా జరిగిన చెన్నైతో మ్యాచ్‌ను ఉద్దేశించే రాయుడు ఈ కామెంట్స్ చేశాడని ఆర్సీబీ ఫ్యాన్స్ అంటున్నారు. కానీ, ఈ విషయంలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే, రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. ఆర్సీబీ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో ఛేదించింది. యశస్వీ జైస్వాల్ (45 పరుగులు), రియాన్ పరాగ్ (36 పరుగులు) రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లకు 172-8 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ (34 పరుగులు), విరాట్ కోహ్లీ (33 పరుగులు) ఇద్దరే ఫర్వాలేదనిపించారు.