తెలంగాణ

telangana

157కిమీ స్పీడ్​తో బౌలింగ్​ - అంతర్జాతీయ టెస్టుల్లో డేవిడ్​ కెరీర్​ ఎలా సాగిందంటే? - Davi Johnson Cricket Career

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 8:24 PM IST

David Johnson Cricket Career : 1990లో భారతదేశం డొమెస్టిక్‌ క్రికెట్లో డేవిడ్‌ జాన్సన్‌ ఓ సంచలనం. అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం మ్యాచ్‌లోనే 157.8 కిమీ/గంతో వికెట్‌ పడగొట్టాడు. ఇంతకీ ఈ దివంగత క్రికెటర్ కెరీర్ ఎలా ప్రారంభమైందంటే?

David Johnson Cricket Career
David Johnson Cricket Career (Getty Images)

David Johnson Cricket Career :భారత మాజీ క్రికెటర్ డేవిడ్‌ జాన్సన్ ఇటీవలె అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. బెంగళూరులోని తన ఇంటి బాల్కనీ నుంచి కిందపడటం వల్ల తీవ్రంగా గాయపడ్డారు. ఆయన మృతి పట్ల క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే డేవిడ్ క్రికెట్​ కెరీర్ ఎలా మొదలైందంటే?

భారత్‌ తరఫున 1996లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు దివంగత క్రికెటర్ డేవిడ్ జాన్సన్. దిల్లీలో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆయన 157.8 కిమీ/గం వేగంతో ఓపెనర్ మైఖేల్ స్లేటర్‌ను డకౌట్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు ఓవర్లు వేసిన డేవిడ్‌ జాన్సన్‌ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో మొదటి ఓవర్‌లోనే స్లేటర్‌ను పెవిలియన్‌కి చేర్చాడు.

ఆఫ్-స్టంప్ అవుట్‌ సైడ్‌ వేసిన బాల్‌ని ఆడబోయిన స్లేటర్‌, ఫస్ట్‌ స్లిప్‌లో ఉన్న మహ్మద్‌ అజారుద్దీన్‌ చేతికి చిక్కాడు. భారత్‌కు 179 పరుగుల ఫస్ట్‌ ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో జాన్సన్ వికెట్ కోల్పోవడంతో, 234 పరుగులకే ఆలౌటైంది. భారత్ 56 పరుగులు చేయాల్సి వచ్చింది. చివరికి ఏడు వికెట్లు తేడాతో ఘన విజయం అందుకుంది.

రెండో ఇన్నింగ్స్‌లో డేవిడ్‌ జాన్సన్‌ 12 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి, ఒక వికెట్‌ పడొట్టాడు. ఇదే అతని భారత్ తరఫున ఆడిన చివరి హోమ్ టెస్ట్‌గా మారింది. కర్ణాటకలో జన్మించిన ఈ స్పీడ్‌స్టర్ తన కెరీర్‌లో ఆ సంవత్సరం చివరిలో దక్షిణాఫ్రికా పర్యటనలో ఒకే ఒక్క టెస్టు ఆడాడు.

డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో, చివరి టెస్టులో భారత్ 328 పరుగుల భారీ ఓటమిని ఎదుర్కొంది. ఇందులో మొదటి ఇన్నింగ్స్‌లో జాన్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే అతడి ప్రదర్శనలు, బౌలింగ్ స్పెల్స్‌లో కన్సిస్టెన్సీ లేకపోవడంతో తర్వాత అవకాశాలు రాలేదు. 1996 తర్వాత జాన్సన్‌ కెరీర్‌ తిరిగి ప్రారంభం కాలేదు. కెరీర్‌లో రెండు టెస్టుల్లో 47.66 యావరేజ్‌తో 3 వికెట్లు మాత్రమే తీశాడు.

1990ల మధ్యకాలంలో డేవిడ్‌ జాన్సన్‌పై చాలా అంచనాలు ఉన్నాయి. భారత్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తాడని భావించారు. డొమెస్టిక్‌ క్రికెట్‌లో అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. కర్ణాటక తరఫున 1995-96 రంజీ సీజన్‌లో కేరళతో జరిగిన మ్యాచ్‌లో 152 పరుగులిచ్చి 10 వికెట్లు తీశాడు. ఆ తర్వాత భారత జట్టుకు ఎంపికయ్యాడు. అంతర్జాతీయ కెరీర్‌ ముగిసినా జాన్సన్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అదరగొట్టాడు. 39 మ్యాచుల్లో 8 సార్లు ఐదు వికెట్లు సాధించాడు. 29 కంటే తక్కువ యావరేజ్‌తో 125 వికెట్లు పడగొట్టాడు. తన 33 మ్యాచ్‌ల లిస్ట్ ఎ కెరీర్‌లో 4.70 కంటే తక్కువ ఎకానమీతో 41 వికెట్లు తీసుకున్నాడు.

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మృతి- జైషా సంతాపం

Heath Streak Death : జింబాబ్వే లెజెండరీ క్రికెటర్ మృతి.. క్యాన్సర్​తో పోరాడుతూ..

ABOUT THE AUTHOR

...view details