YSRCP Leaders Violated Election Code:ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలని ఈసీ హెచ్చరిస్తున్నా వైఎస్సార్సీపీ నేతలు బేఖాతరు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులో ఇవాళ సాయంత్రం సీఎం జగన్ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో అనుమతులు లేకుండా సభా ప్రాంగణంలో వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు వెలిశాయి. మార్కెట్ యార్డ్, హెలిప్యాడ్ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ కోడ్ ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.
యథేచ్ఛగా వైఎస్సార్సీపీ కోడ్ ఉల్లంఘన - కందుకూరులో భారీగా జగన్ ఫ్లెక్సీలు - YSRCP Violated Election Code - YSRCP VIOLATED ELECTION CODE
YSRCP Leaders Violated Election Code: వైఎస్సార్సీపీ నేతలు యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఎన్నికల నియమావళిని బేఖాతరు చేస్తూ జగన్ పర్యటన నేపథ్యంలో కందుకూరులో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
![యథేచ్ఛగా వైఎస్సార్సీపీ కోడ్ ఉల్లంఘన - కందుకూరులో భారీగా జగన్ ఫ్లెక్సీలు - YSRCP Violated Election Code YSRCP_Leaders_Violated_Election_Code](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-04-2024/1200-675-21335432-thumbnail-16x9-ysrcp-leaders-violated-election-code.jpg)
YSRCP_Leaders_Violated_Election_Code
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 28, 2024, 1:40 PM IST
కర్నూలు నగరంలో సిద్ధం ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. గుత్తి రోడ్డులో పెట్రోల్ బంకు వద్ద జగన్ ఫోటో ఉన్న భారీ ఫ్లెక్సీలు వేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఇలాంటి ఫ్లెక్సీలు ప్రదర్శించరాదు. దీనిపై అధికారులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.