Tigers Census In Nallamala Forest: దేశవ్యాప్తంగా జంతు గణనకు అటవీ అధికారులు శ్రీకారం చుట్టారు. అందుకు అనుగుణంగా పల్నాడు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంచారం పెరిగినట్లు అటవీ అధికారులు తెలిపారు. గణన పక్కాగా చేపట్టేందుకు సాంకేతికతను వినియోగించనున్నారు. అటవీ ప్రాంతంలోని నీటి కుంట వద్దకు వచ్చిన పులుల దృశ్యాలు తాజాగా ట్రాప్ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈనెల 10వ తేదీకే పులుల గణన ముగిసిందనీ, అయితే గతేడాది కంటే వాటి సంఖ్య మరింత పెరిగిందని అధికారులు తెలిపారు. ట్రాప్ కెమెరాల్లో నమోదైన చిత్రాలు, పాదముద్రలు సేకరించామన్నారు. పశువుల కాపరులు అడవుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నల్లమల అడవుల్లో అండర్ గ్రౌండ్ టన్నెల్ - 27 కి.మీ. పొడవున నిర్మాణం
పులులు, అటవీ జంతువుల మధ్య ప్రయాణం - నల్లమల అడవిలో 13 కిలోమీటర్ల రైడ్ - Thummalabailu Jungle Safari