ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

గెలుపు కోసం వైసీపీ కుయుక్తులు- ఓట్లు తమకే వేయించాలని తాయిలాల ఎర - YSRCP Distribute Gifts to MEPMA RPs

YSRCP Leaders Distribute Gifts to MEPMA RPs: ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్నింటినీ వైసీపీ వాడుకుంటోంది. పట్టణ పొదుపు సంఘాల రిసోర్స్‌ పర్సన్లకు అధికార పార్టీ నేతలు ప్రలోభపెడుతున్నారు. మహిళల ఓట్లు తమకే వేయించాలని వారికి ప్యాకేజీలిస్తున్నారు. ఇప్పటికే విశాఖ, విజయవాడ, కాకినాడ, గుంటూరులో తాయిలాల పంపిణీ జరిగిపోయింది.

YSRCP_Leaders_Distribute_Gifts_to_MEPMA_RPs
YSRCP_Leaders_Distribute_Gifts_to_MEPMA_RPs

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 8:56 AM IST

Updated : Apr 11, 2024, 9:20 AM IST

గెలుపు కోసం వైసీపీ కుయుక్తులు- మెప్మా ఆర్పీలకు తాయిలాల ఎర

YSRCP Leaders Distribute Gifts to MEPMA RPs:పట్టణ పొదుపు సంఘాల నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరించే రిసోర్స్‌ పర్సన్లకు వైసీపీ నేతలు ఎరవేస్తున్నారు. అనేకచోట్ల ఆర్పీలు అంగీకరించడంతో వారికి భారీగా సొమ్ములు ఇస్తున్నారు. రిసోర్స్‌ పర్సన్లను నియంత్రించాల్సిన పుర, నగరపాలక సంస్థల అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అక్రమ ఆర్థిక వ్యవహారాలపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికల కమిషన్‌ చోద్యం చూస్తోంది.

గెలుపుకోసం అడ్డదారుల్లో వైసీపీ నేతలు:ఎన్నికల్లో గెలుపునకు వైసీపీ నేతలు అనేక అడ్డదార్లు తొక్కుతున్నారు. ఈ క్రమంలో పట్టణ మహిళలకు పొదుపు పట్ల అవగాహన కల్పిస్తూ, బ్యాంకు రుణాల సద్వినియోగాన్ని పర్యవేక్షించే ఆర్పీల ద్వారా మంత్రాంగం నడుపుతున్నారు. ఆర్పీలకు ప్రభుత్వం ప్రతినెలా 7 వేల రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తోంది. ఒక్కో ఆర్పీ పరిధిలో 25 సంఘాలు ఉండగా, ఒక్కో సంఘంలో పదిమంది సభ్యుల చొప్పున మొత్తం 250 మంది ఉంటారు. ఇలా ఒక్కో నియోజకవర్గంలో 30 నుంచి 40 వేల మంది సభ్యులు ఉంటారని అంచనా.

ఒక్కో ఆర్పీకి రూ.25 వేల నజరానా:విశాఖ నగరంలోని రెండు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఒక్కో ఆర్పీకి ఇప్పటికే 25 వేల రూపాయల చొప్పున నజరానాలు అందించారు. వీరు తమ పరిధిలోని మహిళా సభ్యులకు తాయిలాలు చేరవేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పొదుపు సంఘాలను సమన్వయం చేసే కొందరు కో-ఆర్డినేటర్లు అభ్యర్థులకు బాహాటంగానే సహకరిస్తున్నారు. కాకినాడ నగర పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఒకరు ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చే ముందే ఆర్పీలతో సమావేశమై మహిళల మద్దతు తనకే లభించేలా చూడాలని కోరారు.

తిరుపతిలో మళ్లీ దొంగ ఓట్ల అలజడి- 38,493 నకిలీ ఓట్లు ఉన్నట్లు గుర్తించిన ప్రతిపక్షాలు - Mistakes in Tirupathi Voter List

ఆర్పీలతో వైసీపీ అభ్యర్థి సమావేశాలు:ఇటీవలే కొందరు ఆర్పీలకు రూ.20 వేల చొప్పున నగదు పంచారు. వీరి ద్వారా కానుకలు సభ్యులకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ నగరంలోని ఓ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆర్పీలతో పాటు పొదుపు సంఘాల్లో చురుగ్గా ఉండే మహిళా సభ్యులతో ఇప్పటికే రెండుసార్లు సమావేశమయ్యారు. ఏం కావాలో, ఎంత కావాలో తీసుకెళ్లండి. సభ్యుల ఓట్లు తనకే పడాలని ఆఫర్‌ ఇచ్చారు. దీనికి అంగీకరించిన కొందరు ఇప్పటికే రంగంలో దిగారు.

పొదుపు సంఘాల మహిళలతో రహస్య సమావేశాలు:గుంటూరు జిల్లాలో ఓ అభ్యర్థిని ఆర్పీల ఆధ్వర్యంలో పొదుపు సంఘాల మహిళలతో డివిజన్ల వారీగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆమె అనుచరులూ వీటిలో పాల్గొంటున్నారు. సభ్యులకు చీరలు, ఇతర బహుమతులు అందిస్తూ ఎర వేస్తున్నారు. తిరుపతి జిల్లాలోని వైసీపీ అభ్యర్థి ఒకరు నాలుగు రోజుల క్రితం నగరానికి దూరంగా ఆర్పీలతో రహస్యంగా సమావేశమయ్యారు.

ప్రభుత్వానికి సమాంతరంగా సొంత సైన్యం- వైసీపీ ప్రచారంలో ఎమ్మెల్వోలు - YSRCP Politics IN AP

కోడ్‌ అమలుకు ముందే ఆర్పీలతో భేటీ:మహిళలకు తాయిలాలు అందించే బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఒక్కో ఆర్పీకి 25 వేల రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. కడప జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి కోడ్‌ అమల్లోకి వచ్చే ముందే ఆర్పీలతో భేటీ అయ్యి, ప్యాకేజీలు నిర్ణయించారు. పొదుపు సంఘాల సభ్యుల ఓట్లు తనకే పడాలని, ఇందుకు ఏం చేయడానికైనా సిద్ధమేనని ప్రకటించారు. ఆయన తరఫున మహిళలతో ఆర్పీలు మంత్రాంగం నడుపుతున్నారు.

పొదుపు సంఘాల మహిళల మద్దతు వైసీపీకే లభించేలా కొన్నిచోట్ల నగరపాలక సంస్థల అధికారులు బాహాటంగానే పని చేస్తున్నారు. మహిళా సంఘాల కార్యకలాపాల పర్యవేక్షణకు విశాఖ, విజయవాడ కార్పొరేషన్లలో ప్రత్యేకంగా పట్టణ సామాజికాభివృద్ధి విభాగాలు ఉన్నాయి. మిగతా నగరపాలక సంస్థల్లో ప్రాజెక్టు అధికారులు పని చేస్తున్నారు.

వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా అధికారులు:విశాఖలో ఓ అధికారి వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా పనిచేస్తున్నట్లు తీవ్ర విమర్శలున్నాయి. మహిళలు వైసీపీకి అండగా నిలిచేలా ఆర్పీలు, కో-ఆర్డినేటర్ల ద్వారా తెర వెనుక వ్యవహారాలు నడుపుతున్నారు. కాకినాడలో ఓ అధికారిపై ఇలాంటి ఫిర్యాదులు రాగా, ఇటీవల ఉన్నతాధికారులు ఆ బాధ్యతల నుంచి తప్పించారు. వైసీపీ నేతల ఒత్తిడి తట్టుకోలేక విజయవాడలోని యూసీడీ అధికారి ఒకరు బాధ్యతల నుంచి కొద్ది రోజుల క్రితం వైదొలిగారు.

రౌడీరాజ్యం పోయి రామరాజ్యం రావాలి - ధర్మం నిలబడాలి: పవన్‌ కల్యాణ్‌ - Pawan Kalyan Election Campaign

Last Updated : Apr 11, 2024, 9:20 AM IST

ABOUT THE AUTHOR

...view details