YSRCP Leaders Attacks on TDP Activists: వైఎస్సార్సీపీ నేతల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరిపోతున్నాయి. తెలుగుదేశం శ్రేణులపై విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండగా తాజాగా పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలు రెచ్చిపోయి టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం చేశారు. బైక్పై వెళ్తున్న టీడీపీ కార్యకర్త శ్రీనివాసరావును రొంపిచర్ల మండలంలోని తురిమెళ్లలో ఆటోతో ఢీకొట్టి ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు.
YCP Leaders Attacked on TDP: నెల్లూరులో రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ నేతలు.. టీడీపీ సానుభూతిపరులపై కత్తులు, రాడ్లతో దాడి..
ఈ ఘటనలో శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితుడిని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ చదలవాడ అరవిందబాబు పరామర్శించారు. టీడీపీ సానుభూతి పరుడిపై వైఎస్సార్సీపీ శ్రేణులు దాడికి పాల్పడటం దారుణమని మండిపడ్డారు. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలోనే టీడీపీ కార్యకర్తపై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు.
YSRCP anarchists: అరాచకాల అడ్డా.. నేరాల గడ్డ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఇన్ని దారుణాలా..!
నరసారావుపేటలో వైఎస్సార్సీపీ నేతల అరాచకాలు మితిమీరిపోతున్నాయని అరవిందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అధికారులు దీనిపై స్పందించి ఐదుగురు నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
దళితులను తిట్టడం, కొట్టడం, గుండు గీయించడం, చంపి డోర్ డెలివరీ చేయడం!
"కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే ఓ దళితుడిపై ఇలా విచక్షణారహితంగా దాడికి పాల్పడటం దారణం. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలోనే టీడీపీ సానుభూతిపరుడిపై దాడి జరిగింది. నరసారావుపేటలో వైఎస్సార్సీపీ నేతల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. ఈ ఘటనపై నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పూర్తి బాధ్యత వహించాలి. అధికారులు దీనిపై స్పందించి ఐదుగురు నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను." - చదలవాడ అరవిందబాబు, నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్
YCP leaders Attacks: వినుకొండకు పాకిన దాడుల సంస్కృతి.. రెచ్చగొట్టి మరీ వైసీపీ దాడులు