ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

YSRCP LEADERS : అరెస్టు భయం - కోర్టు తీర్పు రావడమే ఆలస్యం, అబ్‌స్కాండ్ అయ్యారా? స్టేట్ దాటి వెళ్లారా? - YSRCP LEADERS ARREST FEAR - YSRCP LEADERS ARREST FEAR

అన్నీ ఆ తాను ముక్కలే అన్నట్లు. నోటికి అడ్డూ అదుపు ఉండని వైఎస్సార్సీపీ నేతలు ఇప్పుడు ఒక్కొక్కరిగా జారుకుంటున్నారు. అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసాలపై దాడి కేసులు నిందితులు అజ్ఞాతం బాటపట్టారు. ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ కొట్టి వేసిన క్షణ్ణాల్లోనే ఆ కేసులో నిందితులంతా రహస్య ప్రదేశానికి చెక్కేశారు.

YSRCP LEADERS
YSRCP LEADERS (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2024, 11:20 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ను హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఆ వెంటనే పోలీసులు నిందితులను అరెస్టు చేసేందుకు చర్యలు చేపట్టడంతో ఇప్పుడు వారంత కనుమరుగయ్యారు. ఇదే కేసులో అమరావతి నుంచి తప్పించుకుని పారిపోయిన మాజీ ఎంపీ నందిగామ సురేష్‌ను పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. దీంతో మిగతా నిందితులు ఒక్కరూ అదుబాటులో లేకుండా పోయారు.

వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

చంద్రబాబు, తెలుగుదేశం పార్టీపై ఒంటికాలితో లేచే మాజీ మంత్రి జోగిరమేష్‌ సెల్‌ఫోన్స్‌ స్విచ్ఛ్‌ ఆఫ్‌ చేసి పరారయ్యారు. అదే కోవలలో దేవినేని అవినాష్ కూడా ఉన్నారు. వీరి ఆచూకీ కోసం పోలీసులు రంగంలో దిగారు. మఫ్టీలో ఉన్న పోలీసులు వారి నివాసాల వద్ద కాపుకాశారు. దీంతో పరిస్థితి అర్థమై వారంతా ఆంధ్రప్రదేశ్‌ వీడి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలో తలదాచుకునేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో నిందితుడైన విజయవాడ మాజీ మేయర్‌ శైలజ భర్త, వైసీపీ నేత అవుతు శ్రీనివాసరెడ్డి సైతం ఫోన్లు ఆపేసి విజయవాడ, గుంటూరుల్లో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. నిందితులందరీ ఎలాగైనా అరెస్టు చేయాలన్న లక్ష్యంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విమానాశ్రయాలతో పాటు పోర్టుల వద్ద కూడా నిఘా బృందాలు మాటువేసి ఉన్నాయి.

దేవినేని అవినాష్‌కు చుక్కెదురు - దుబాయ్ వెళ్లకుండా శంషాబాద్​లో అడ్డగింత

గతంలో ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు దేవినేని అవినాశ్‌ ఏకంగా విదేశాలకు వెళ్లేందుక యత్నించారు. విదేశాలకు వెళ్లేందుకు ఆయన చేసిన ప్రయత్నానికి శంషాబాద్‌ మిమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారు. అప్పుడు హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ఆయన యత్నించగా మంగళగిరి పోలీసులకు శంషాబాద్ విమానాశ్రయం అధికారులు సమాచారమిచ్చారు. అవినాష్‌పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు వారికి తేల్చి చెప్పారు. దీంతో అధికారులు అవినాష్‌కు అడ్డు చెప్పడంతో శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఆయన వెనక్కి వెళ్లిపోయారు. ఇప్పుడు కూడా అవినాశ్‌ చైన్నై గానీ, బెంగళూరు కానీ వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. అరెస్టు భయంతో దేవినేని అవినాష్‌, జోగి రమేష్‌ ఎక్కడికెళ్లారు. వీరికి ఎవరు అశ్రమం ఇచ్చారన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ నేతలు ఎక్కడున్న అరెస్టు చేయాలని మంగళగిరి పోలీసులకు ఉన్నతాధికారల ఆదేశాలు జారీ చేశారు.

వారికి ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దు - వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పారు: లూథ్రా

ABOUT THE AUTHOR

...view details