Yellandu Municipal Council No Confidence Motion Fails Today : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ ఛైర్మన్ డి.వెంకటేశ్వర్లుపై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానం పాస్‌కావడానికి కావాల్సిన కోరం(17 మంది) సభ్యులలో 16 మంది అనుకూలంగా ఓటు వేశారు. ఒకరు తక్కువగా ఉండటంతో అవిశ్వాసం వీగిపోయింది. మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్కు(BRS) చెందిన 19 మంది కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసులు జారీ చేశారు.
ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం - క్యాంపులో 15 మంది కౌన్సిలర్లు
ఇల్లందులో మొత్తం 24 మంది పాలకవర్గ సభ్యులు ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) ఎక్స్ అఫీషియో ఓటు హక్కుతో మొత్తం సభ్యుల సంఖ్య 25 ఉంది. మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాసం నెగ్గేందుకు 17 మంది సభ్యుల సంఖ్య బలం కావాల్సి ఉంది. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ జానీతో సహా మరో 17 మంది సభ్యులకు ఇవాళ పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. పార్టీ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ విప్ జారీ చేశారు.
Bhadradri Kothagudem Latest News : అవిశ్వాస సమావేశానికి అవసరమైన సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా కాంగ్రెస్(Congress) సభ్యులు పావులు కదిపారు. సీపీఐ కౌన్సిలర్ ఓటింగ్‌లో పాల్గొనకుండా సీపీఐ జిల్లా నాయకులు సాబీర్ పాషా, సారయ్య మున్సిపల్ కార్యాలయ ఆవరణలోనే ఉన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావును కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ వారిని నిలువరించి నాగేశ్వరరావుని ఓటింగ్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.