YCP Councillors Questioned to Avinash Reddy on Pending Bills : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీ కౌన్సిలర్ల నుంచి ఆ పార్టీకి తలనొప్పులు తప్పడం లేదు. ఇటీవలే మూడు రోజుల పాటు పులివెందులకు వచ్చిన జగన్‌ను నిలిచిపోయిన బిల్లులుపై కౌన్సిలర్లు నిలదీశారు. పాడా (PADA) కింద చేపట్టిన 250 కోట్ల రూపాయల పనులకు ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు కాలేదు. దీనిపై కౌన్సిలర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జగన్ కూడా సరైన సమాధానం చెప్పక పోవడంతో కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నారు. వీరి అసమ్మతిని చల్లార్చేందుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు పులివెందులలో మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా కౌన్సిలర్లు తమకు రావాల్సిన బిల్లులపై ప్రస్తావించారు.
సీఎం చంద్రబాబు కార్యసాధకుడు - రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తారు : సుమన్
"చాలామంది కౌన్సిలర్లు పులివెందులలో పనులు చేపట్టారు. ఒక్కో కౌన్సిలర్ కు 2 నుంచి 7 కోట్ల రూపాయల వరకు బిల్లులు మంజూరు కావాల్సి ఉంది. ప్రభుత్వం మారడంతో ఆ డబ్బులు రావనే ఆందోళన వెంటాడుతోంది. చివరి నిమిషంలో డబ్బులు చెల్లించకుండా నిలిపి వేస్తే తాము ఎలా బతకాలని"లని కౌన్సిలర్లు అవినాష్ రెడ్డిని నిలదీశారు. అందరూ ధైర్యంగా ఉండాలని రికార్డుల పరంగా ప్రభుత్వం బిల్లులు మంజూరు చేసే వరకు వేచి చూద్దామని, లేదంటే కోర్టును ఆశ్రయిద్దామని అవినాష్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. ఎవరూ పార్టీకి దూరం కావద్దని, జగనన్న అండగా ఉంటారని, ధైర్యంగా ఉండాలని కోరినట్లు తెలిసింది. మరికొందరు కౌన్సిలర్లు ఐదేళ్లలో తాము ఏమీ చేసుకోలేదని నిరుత్సాహ పడినట్లు సమాచారం. వారందరినీ అవినాష్ రెడ్డి సముదాయించే ప్రయత్నం చేసినా గత్యంతరం లేని పరిస్థితుల్లో మారుమాట్లాడకుండా కౌన్సిలర్లు వెనుదిరిగి వచ్చినట్లు తెలిసింది.