Alliance Corporators Demand for GVMC Mayor Resignation : విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ భేటీ రసాభాసగా మారింది. నగర పాలక సంస్థ మేయర్ రాజీనామా చేయాలంటూ కూటమి కార్పొరేటర్లు పట్టుపట్టడంతో కౌన్సిల్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందుగా కౌన్సిల్ సమావేశం మొదలైన వెంటనే జీవిఎంసీలో వెలుగుచూసిన అవినీతి ఆరోపణలపై కూటమి కార్పొరేటర్లు ప్రశ్నలు సంధించారు. యూసీడీ నిధులలో మేయర్ హరి వెంకట కుమారి, డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్, కట్ట మూరి సతీష్‌లు ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావులు అవినీతికి పాల్పడ్డరని విచారణ కోరుతూ డిమాండ్ చేశారు. పాలకవర్గం సమావేశం మొదలైన వెంటనే సీపీఎం నేత సీతారాం ఏచూరికి నివాళి అర్పించి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.
ఒక్కసారిగా గందరగోళం :అనంతరం జీరో అవర్ నడపాలని కార్పొరేటర్లు పట్టుపట్టారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. అదే సమయంలో రఘురామ కృష్ణంరాజు, పంతం నానాజీలపై చర్యలు తీసుకోవాలంటూ ప్లకార్డులు పట్టుకొని కౌన్సిల్‌లో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. ఎక్కడో జరిగిన సంఘటనలు పట్టుకొని ఈక్కడికి రావడంమెంటని జనసేన కార్పొరేటర్ల ఆకార్డులను తీసిపారేశారు. అనంతరం సీపీఎం కార్పొరేటర్ డాక్టర్ గంగారంతో సహా, వామపక్ష కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా తీర్మానం చేయాలంటూ నినాదాలు చేశారు. గతంలో చేసిన తీర్మానం ఏమైందని, దానిపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏం చేసిందంటూ తెలుగుదేశం కార్పొరేటర్లు ప్రతిగా మాటల దాడికి దిగారు.
జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి నేతలు విజయం - మరోసారి పరాజయమైన వైఎస్సార్సీపీ - NDA Win GVMC Elections