Suspense Continues Over TDP Contest in Anaparthi : బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో సీట్ల కేటాయింపు అంశం చాలా సున్నితంగా మారింది. బీజేపీతో పొత్తులకు ముందే అనపర్తి స్థానంలో టీడీపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించింది. అనంతర పరిణామాల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం అనపర్తి సీటుకు అభ్యర్థిని ఖాయం చేసింది. ఈ నేపథ్యంలో నల్లమిల్లి అనుచరులు, టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనపర్తిలో టీడీపీ పోటీ చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే నల్లమిల్లికి మద్దతుగా పార్టీ నాయకులంతా తమ పదవులను త్యాగం చేస్తున్నట్లు ప్రకటిస్తూ రాజీనామా (resignation) లకు సిద్ధపడ్డారు. ఓ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ట్విటర్ వేదికగా నల్లమిల్లి చేసిన కామెంట్స్ పోటీ ఖాయమనే విధంగా ఉన్నాయి.
'ఎందుకు? ఏమిటి? ఎలా?' టీడీపీ సీనియర్లలో టెన్షన్ - బాబు నివాసం వద్ద హైడ్రామా
నల్లమిల్లి ఏమంటున్నారంటే! ఐదేళ్ల పాటు నా ఆరోగ్యాన్ని, నా కుటుంబాన్ని ఫణంగా పెట్టాను. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని పోరాడాను. కానీ, ఎన్నికల్లో నాకు జరిగిన అన్యాయంపై కుటుంబ సమేతంగా ప్రజల దగ్గరకే వెళ్లి తేల్చుకుంటా. ఆ తర్వాతే భవిష్యత్ కార్యాచరణ (Future activity) ప్రకటిస్తా అని నల్లమిల్లి ట్వీట్ (Nallamilli tweet) చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు కార్యకర్తల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నామని, తమ కుటుంబాన్ని నమ్ముకుని 40 ఏళ్లుగా పోరాడుతున్న కార్యకర్తలను కాపాడుకోవడం కోసమే కఠిన నిర్ణయం తప్పదని నల్లమిల్లి స్పష్టం చేశారు.
చంద్రబాబు నివాసానికి టీడీపీ నేతలు క్యూ - రాజకీయ భవిష్యత్తుకు హామీ