ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌ కేసు - ఈ నెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు: హైకోర్టు - FORMULA E CAR RACE CASE UPDATES

కేటీఆర్​ను వారం రోజుల వరకు అరెస్టు చేయొద్దన్న తెలంగాణ హైకోర్టు

formula_e_car_race_case
formula_e_car_race_case (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2024, 5:19 PM IST

Updated : Dec 20, 2024, 5:41 PM IST

Formula E Car Race Case Updates : బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలని కేటీఆర్‌ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై విచారణ జరిగింది. ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే పూర్తయినందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు.

కేటీఆర్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సుందరం, ప్రభాకర్‌రావు, గండ్ర మోహన్‌రావు హైకోర్టులో వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని, ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ఈనెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. కేటీఆర్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 27కి వాయిదా వేసింది.

ఈ కార్ రేసు కేసు - హైకోర్టులో కేటీఆర్ క్వాష్‌ పిటిషన్‌ విచారణ

రంగంలోకి ఈడీ :మాజీ మంత్రి కేటీఆర్​పై తెలంగాణ ఏసీబీ నమోదు చేసిన ఫార్ములా ఈ-రేసు కేసులో ఈడీ (Enforcement Directorate) రంగంలోకి దిగింది. ఏసీబీ కేసులో ఎఫ్ఐఆర్, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఈడీ లేఖ రాసింది. వివరాలు రాగానే మనీ లాండరింగ్ నమోదు చేయనుంది. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో గురువారం కేసు నమోదు చేసిన ఏసీబీ నాటి పురపాలక శాఖ మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్‌ను ప్రధాన నిందితుడి (ఏ1)గా పేర్కొనడం తెలిసిందే.

ఫార్ములా ఈ కార్​ రేసింగ్​పై చర్చించే సత్తా ప్రభుత్వానికి లేదు: కేటీఆర్​

ఫార్ములా ఈ-కార్ల రేసింగ్​పై ఏసీబీ విచారణ? - ఏ అంశాలపై దర్యాప్తు జరగనుంది?

Last Updated : Dec 20, 2024, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details