Srikakulam constituency : శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం (Srikakulam Lok Sabha constituency) 1952లో ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ స్థానం జనరల్ కేటగిరిలో ఉంది.
లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు
- ఇచ్ఛాపురం
- పలాస
- టెక్కలి
- పాతపట్నం
- శ్రీకాకుళం
- ఆమదాలవలస
- నరసన్నపేట
2024 ఓటర్ల జాబితా ప్రకారం ఓటర్ల వివరాలు :
- మొత్తం ఓటర్లు 16.32 లక్షలు
- పురుషులు 8.14 లక్షలు
- మహిళలు 8.17 లక్షలు
- ట్రాన్స్‌జెండర్ 126
1990 నుంచి ఈ నియోజకవర్గం తెలుగుదేశం కంచుకోటగా మారింది. దివంగత ఎర్రన్నాయుడు ఇక్కడి నుంచి 5 సార్లు పోటీ చేసి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. 2009లో తొలిసారి ఓటమి పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎర్రన్నాయుడి కుమారుడు రామ్మోహన్‌నాయుడు ఈ స్థానం నుంచి గెలుపొందారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై.. టీడీపీ అభ్యర్థి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు 6,653 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. రామ్మోహన్ నాయుడు 47.23 శాతం ఓట్లు రాబట్టుకోగా.. దువ్వాడ శ్రీనివాస్‌కు 46.64శాతం ఓట్లు దక్కాయి.
ప్రస్తుత ఎన్నికల్లో కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున మరో సారి బరిలో నిలిచి హ్యాట్రిక్ విజయం పై దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్‌ను ఈసారి టెక్కలి శాసనసభ నియోజకవర్గం నుంచి బరిలో దించగా, అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పేరాడ తిలక్ శ్రీకాకుళం ఎంపీగా వైఎస్సార్సీపీ తరఫున బరిలో నిలిచారు.