Rajampet constituency : కడప జిల్లాలోని రాజంపేట లోక్‌సభ స్థానం (Rajampet Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. ఇది జనరల్ కేటగిరిలో ఉంది. ఈ నియోజకవర్గ పరిధి ఆధారంగా కొత్తగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేశారు. కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఈ లోక్‌సభ స్థానం ప్రత్యేకత కలిగి ఉంది. ఇంతకుముందు కడప జిల్లాలో నాలుగు సెగ్మెంట్లు, చిత్తూరు జిల్లాలో మూడు సెగ్మెంట్లు ఉండేవి. ఇక్కడి లక్కిరెడ్డిపల్లె రద్దవడంతో చిత్తూరు జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లు చేరాయి. 1952లోనే నియోజకవర్గం ఏర్పాటైనప్పటికీ 1957 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి.
రాజంపేట లోక్‌సభ పరిధిలో 7 శాసనసభా నియోజకవర్గాలున్నాయి
- రాజంపేట
- రైల్వేకోడూరు (ఎస్సీ),
- రాయచోటి
- మదనపల్లె
- తంబళ్లపల్లె
- పీలేరు
- పుంగనూరు
ఓటర్ల వివరాలు
- మొత్తం ఓటర్లు 16,42,282
- పురుషులు 8,07,588
- మహిళలు 8,34,550
- ట్రాన్స్ జెండర్లు 144
కాంగ్రెస్ ఆధిక్యం :రాజంపేటకు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధికసార్లు కాంగ్రెస్ విజయం సాధించగా, తెలుగుదేశం పార్టీ రెండు సార్లు జెండా ఎగరేసింది. స్వతంత్ర, వైఎస్సార్సీపీ అభ్యర్థి ఒక్కొక్కసారి ఇక్కడ గెలుపొందారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన మిథున్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి డి.ఎ. సత్యప్రభపై విజయం సాధించారు. 2024 ఎన్నికల్లోనూ వైసీపీ తరఫున మిథున్‌రెడ్డి బరిలో నిలిచారు. పొత్తులో భాగంగా ఈ స్థానం బీజేపీకి వెళ్లింది. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని బీజేపీ బరిలో నిలిపింది. పార్లమెంటు పరిధిలో అన్ని ప్రాంతాలకు కిరణ్‌కుమార్‌రెడ్డి పరిచయమున్నారు. రాజకీయంగా చిరకాల అనుభవం ఉన్న నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఈయన సోదరుడు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి రాజంపేట లోక్‌సభ పరిధిలోని పీలేరు శాసనసభా స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటం గమనార్హం.
ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు వీరే!
1957: టి.ఎన్.విశ్వనాథరెడ్డి (కాంగ్రెస్), 1962: సి.ఎల్.నరసింహా రెడ్డి (స్వతంత్ర), 1967: పి.పార్థసారథి (కాంగ్రెస్), 1971: పి.పార్థసారథి (కాంగ్రెస్), 1977: పి.పార్థసారథి (కాంగ్రెస్), 1980: పి.పార్థసారథి (కాంగ్రెస్), 1984: ఎస్.పాల కొండ్రాయుడు (టీడీపీ) విజయం సాధించారు.
గత ఎన్నికల్లో విజేతలు - సమీప ప్రత్యర్థులు
1989: అన్నయ్యగారి శ్రీప్రతాప్ (కాంగ్రెస్) - సి.రామచంద్రయ్య (టీడీపీ)