Pulivendula Jai Bhim Rao Bharat Party Candidate Dastagiri Fire on Jagan : జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా దళిత బిడ్డలపై దాడులు జరిగాయని పులివెందుల జై భీం రావు భారత్ పార్టీ అభ్యర్థి దస్తగిరి ఆరోపించారు. వారి తరఫున పూర్తి స్థాయిలో పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. జగన్ పాలన రాజుల పాలన పోయి రాక్షస పాలన వచ్చినట్టుగా ఉందని అన్నారు. వాళ్లు చేసిన అన్యాయాలు, అక్రమాలను మీడియా బయట పెడుతుందన్నారు. జగన్ పూర్తి స్థాయిలో అమాయక ప్రజలందరినీ మోసం చేసి మరోమారు గద్దె నెక్కాలని భావిస్తున్నారని అన్నారు.
సాక్ష్యాన్ని ఉపసంహరించుకుంటే రూ.20కోట్లు ఇస్తామన్నారు: దస్తగిరి
దళితులను కొట్టడం గొప్పతనమా అని దస్తగిరి నిలదీశారు. దళిత మహిళ (Dalit woman)ను రేప్ చేసి స్టేషన్ ముందు పడేసినా చర్యలు లేవని అన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి, జగన్ రాజ్యాంగం (Jagan Constitution) నడుస్తోందన్నారు. జగన్ మైనార్టీలకు తోఫా ఇస్తా అని చెప్పి ఇవ్వలేదని అన్నారు. దళిత నాయకుడి భూమిని వైఎస్సార్సీపీ వాళ్లు లాక్కుంటే తాను వెళ్తే ఆ విషయాన్ని దాచేసి తాను బెదిరింపులకు పాల్పడినట్లు పుకారు పుట్టించారని దస్తగిరి మండిపడ్డారు.
అవినాష్‌రెడ్డి బెయిల్‌పై బయట ఉండటం వల్లే దాడులు పెరిగాయి : దస్తగిరి