కార్యకర్తల కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటాం - నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి Nara Bhuvaneshwari Yatra : 'నిజం గెలవాలి' యాత్రలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుతో మృతిచెందిన వారి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. శ్రీరంగరాజపురం మండలం గంగమ్మ గుడి వాసి కరణం ఆంజనేయులు నాయుడు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. మృతుడు చిత్రపటానికి అంజలి ఘటించిన భువనేశ్వరి... నాయుడు కుటుంబ సభ్యులకు 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయంగా చెక్కును అందజేశారు. బాధిత కుటుంబాలకు తెలుగుదేశం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం ముఖ్యనేతలు పాల్గొన్నారు.
కుప్పంలో మీ ఓటు చంద్రబాబుకా? - భువనేశ్వరికా?
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు (Chandrababu Naidu illegal arrest) నేపథ్యంలో జైలులో ఉన్న సమయంలో హఠాన్మరణానికి గురైన ప్రతి కార్యకర్త కుటుంబాన్ని పార్టీ తరఫున ఆదుకుంటామని, వారి కుటుంబాలకు భరోసా ఇవ్వడమే ధ్యేయంగా నిజం గెలవాలి పేరిట యాత్రను చేపట్టినట్లు నారా భువనేశ్వరి వెల్లడించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న నిజం గెలవాలి యాత్ర చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీ రంగరాజపురం మండలం గంగమ్మ గుడి (Gangamma Temple) గ్రామంలో కొనసాగింది.
కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన - 3 అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి సిద్ధం
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలం గంగమ్మ గుడి గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరికి నియోజకవర్గ తెలుగుదేశం ఇంచార్జ్ థామస్, మండల పార్టీ అధ్యక్షుడు జయశంకర్ నాయుడుల నేతృత్వంలో పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో జైలులో ఉన్న సమయంలో మృతి చెందిన శ్రీరంగరాజపురం మండలం గంగమ్మ గుడి కి గ్రామవాసి కరణం ఆంజనేయులు నాయుడు కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. ఆంజనేయులు నాయుడు చిత్రపటానికి నివాళులర్పించిన భువనేశ్వరి మృతుడి కుటుంబ సభ్యులకు 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
భువనేశ్వరికి గుండెనొప్పి వచ్చేలా చంద్రబాబు చేసిన పని ఏంటీ?
తెలుగుదేశాన్ని ఆదరించాలని, నిజం గెలవాలని కోరుతూ ప్రజలను ఉద్దేశించి భువనేశ్వరి అభివాదం చేశారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్, తిరుపతి నియోజకవర్గ పరిశీలకులు చిట్టిబాబు నాయుడు, ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడు నాని, నగరి నియోజకవర్గ బాధ్యులు భాను ప్రకాష్ తదితరులు వెంటరాగా ఆమె పర్యటన ముగించుకొని కార్వేటినగరం మీదుగా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని నారాయణవరం మండలం చేరుకున్నారు. మార్గమధ్యంలోని కార్వేటినగరం వేణుగోపాల స్వామి ఆలయ స్వాగత ద్వార సమీపంలో స్థానిక పార్టీ కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు వాహనం నుంచి దిగి పలువురి పలకరిస్తూ అభివాదం చేశారు.
ఐదేళ్ల జగన్ పాలనలో అన్ని వర్గాలకు ఇబ్బందులే: నారా భువనేశ్వరి