Nandamuri Balakrishna Election Campaign in Satyasai District : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ప్రచారం జోరును పెంచారు. 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర' పేరుతో శ్రీ సత్యసాయి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో రోజు లేపాక్షి మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనపై మహిళలు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. హిందూపురం టీడీపీ అభిమానులు, మహిళలు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపితూ హూషారుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర'- కదిరి నుంచి ఎన్నికల ప్రచారం షురూ - Nandamuri Balakrishna
Balakrishna Election Campaign in Lepakshi :ఎన్నికల ప్రచారంలో భాగంగా లేపాక్షి మండలంలోని కొండూరు, కల్లూరు, నాయనపల్లి గ్రామాల్లో బాలకృష్ణ పర్యటించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బాలయ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా డప్పుకొట్టి ప్రజల్లో ఫుల్ జోష్‌ను నింపారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అభిమానులు జై బాలయ్య అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఓ చిన్నారిని ఎత్తుకొని ఆప్యాయంగా మద్దాడి ' అఖండ' ప్రేమ చూపారు.