Murders and Rapes of SC STs During YSRCP Govt:ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఎస్సీ, ఎస్టీలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిన ఘటనలే ఇందుకు నిలువెత్తు సాక్ష్యాలు. ఈ అకృత్యాలపై వైఎస్సార్సీపీ హయాంలోనే సాంఘిక సంక్షేమశాఖ 2023 జులైలో కేంద్రానికి ఇచ్చిన నివేదిక తాజాగా వెలుగుచూసింది. ఒక్క 2022లోనే ఎస్సీ-ఎస్టీ మహిళలపై 198 అత్యాచారాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.
59 మంది దళిత, గిరిజనులు హత్యకు గురయ్యారు. మొత్తంగా ఆ ఏడాది ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు, అఘాయిత్యాలు, దాడులకు సంబంధించి 2 వేల 893 కేసులు నమోదయ్యాయి. 2021లో 40 మంది ఎస్సీ, ఎస్టీలు హత్యకు గురైతే 2022లో ఆ సంఖ్య 59కి పెరిగింది. 2021లో సగటున రోజుకు 7 దాడులు, అఘాయిత్యాలు జరిగితే తర్వాత ఏడాదికి అది 8కి చేరింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం దళిత, గిరిజనులపై దాడులను అరికట్టేందుకు ఏ మాత్రం చర్యలు తీసుకోలేదనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.
దళితులు, గిరిజనులపై పెరుగుతున్న దాడులు - ఎక్కువశాతం నిందితులు వైసీపీ నేతలే