ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేలా బడ్జెట్‌ - ఎమ్మెల్యేల ప్రశంసలు

శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌పై చర్చించిన ఎమ్మెల్యేలు -పెట్టుబడిదారుల్లోనూ విశ్వాసం పెరుగుతోందని అభిప్రాయం

mlas_discussion_on_budget
mlas_discussion_on_budget (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2024, 8:57 PM IST

MLAs Debate in Assembly on 2024-25 Budget:వైఎస్సార్​సీపీ ప్రభుత్వం హయాంలో ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేలా కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్​ను రూపొందించిందని ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేశారు. 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్​పై శాసనసభలో విస్తృతంగా చర్చించారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ బడ్జెట్​పై చర్చను ప్రారంభించారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వనరులను ధ్వంసం చేసిందని, భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి కోలుకోలేనట్టుగా దెబ్బతీసిందని ఆక్షేపించారు. 2047 స్వర్ణాంధ్ర విజయ డాక్యుమెంట్ లక్ష్యాలను సాధించేలా ఈ బడ్జెట్ రూపొందించారని స్పష్టం చేశారు.

ఈ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కలయికలతో బడ్జెట్​ను రూపొందించిందని వ్యాఖ్యానించారు. రూ.2 లక్షల 94 వేల కోట్లను అత్యధికంగా పేద ప్రజల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా జరిగేలా కేటాయింపులు చేయడం సంతోషదాయకమని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు జయమంగళ నాగేశ్వర్ రెడ్డి, తెనాలి శ్రావణ్ కుమార్, బీజేపీ సభ్యుడు పార్ధసారధి, ఏలూరు సాంబశివరావు, చదలవాడ అరవింద్ బాబు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసరావు తదితరులు ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్థిక అరాచకం - బయటపెట్టిన కాగ్

సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ దాదాపు 73 వేల కోట్ల రూపాయలను బడ్జెట్​లో కేటాయించారని ఎమ్మెల్యేలు వెల్లడించారు. దీంతో పాటు రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులకు కూడా పెద్దఎత్తున కేటాయింపులు చేశారని స్పష్టం చేశారు. గతంలో గ్రామ పంచాయితీల నిధులను కూడా కాజేశారని ప్రస్తుతం జాతీయ పండుగలకు వెచ్చించే మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని ఎమ్మెల్యేలు అన్నారు. ధ్వంసమైన రహదారులకు కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి సంక్రాంతిలోగా వాటిని మరమ్మతులు చేసేలా కార్యాచరణ చేపట్టడం సంతోషదాయకమని ఎమ్మెల్యేలు వెల్లడించారు.

గత ప్రభుత్వం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని అందరినీ మోసం చేస్తే, కూటమి ప్రభుత్వం బీసీలు, గిరిజనలు, దళితులు, మైనారిటీలకు రూ.69 వేల కోట్లు కేటాయించటం వారికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని అన్నారు. ఈ బడ్జెట్ బడుగు బలహీన వర్గాల బడ్జెట్ అని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. మరోవైపు సామాజికంగా ఆర్ధికంగా, రాజకీయంగా నిమ్న వర్గాలను ఆదుకునేలా పీ4 విధానాన్ని ప్రవేశపెట్టి దీనికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో సంక్షేమ అభివృద్ధి పథకాలను చేపట్టటంతో పాటు పారిశ్రామికంగానూ రాష్ట్రాన్ని పరుగులు పెట్టించేలా బడ్జెట్ ఉందని పేర్కొన్నారు.

పెండింగ్‌ పోస్టులన్నీ భర్తీ చేస్తాం - రెండేళ్లలో సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ పూర్తి : లోకేశ్

"అప్పులు పంచుకుంటున్నారు - ఆస్తులు లేవంటున్నారు"

ABOUT THE AUTHOR

...view details