Minister Roja Cheating :మున్సిపల్ చైర్మన్ పదవిని బేరానికి పెట్టేశారు. అన్ని అర్హతలు ఉన్న వ్యక్తికి అధికారం ఇవ్వకుండా డబ్బులు దండుకుని మోసం చేశారు. ఆలస్యంగా తేరుకున్న బాధితులు మీడియా ఎదుట తమకు జరిగిన అన్యాయాన్ని మొర పెట్టుకున్నారు. పర్యటక మంత్రి రోజా నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన వివరాలు బాధితులు తెలిపారు.
నగరి అసెంబ్లీ సీటు ఎవరికిచ్చినా నో ప్రాబ్లం - జగన్ కోసం నా ప్రాణాలైనా ఇస్తా : మంత్రి రోజా
పుత్తూరు మున్సిపాలిటీలో 22 వార్డులు ఉన్నాయి. 17వ వార్డులో భువనేశ్వరి కౌన్సిలర్‌గా ఏకగ్రీవమయ్యారు. రిజర్వేషన్ కావడంతో చైర్మన్ పదవి తనకే వస్తుందని ధీమాతో ఉన్నారు. కానీ, అక్కడే మంత్రి రోజా చక్రం తిప్పారు. తప్పకుండా పదవి వరిస్తుందని ఊరించారు. అన్నను కలువు అంటూ కుమారస్వామి అనే నాయకుడు పేరు చెప్పారు. దీంతో కుమారస్వామి 40 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. తాము దళితులమని, చైర్మన్ పదవి రిజర్వేషన్ ఉంది కదా అని ప్రశ్నిస్తే, డబ్బులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. చివరకు వేరే వ్యక్తులకు పదవి అప్పగించాడు. పదవి పోతే పోయింది, డబ్బులైనా తిరిగి ఇవ్వమని కోరితే రేపు, మాపు అంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో బాధిత మహిళా మీడియా ముందుకొచ్చి తనకు జరిగిన అన్యాయంపై జగనన్న స్పందించి న్యాయం చేయాలని కోరారు.
అక్కాచెల్లెళ్ల ఆందోళన పట్టించుకోని మంత్రి రోజా - ప్లేట్లు, గ్లాసులు చూపిస్తూ అంగన్వాడీల నిరసన
పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి 40 లక్షల రూపాయలు తీసుకుని మంత్రి రోజా మోసం చేశారని వైఎస్సార్సీపీ మున్సిపల్ కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించారు. పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో 17వ వార్డు నుంచి దళిత మహిళ అయిన తాను ఎకగ్రీవంగా ఎన్నికైనట్లు భువనేశ్వరి తెలిపారు. చైర్మన్ పదవి ఇస్తామని మూడు విడతలుగా 40 లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్తూ అందుకు సంబంధించిన వీడియో సాక్ష్యాన్ని ఆమె బయటపెట్టారు. పదవి మాత్రం ఇవ్వలేదని డబ్బులు అడిగితే అదిగో, ఇదిగో అని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని దళిత మహిళ కోరారు.
మంత్రి రోజాపై మున్సిపల్ కౌన్సిలర్ సంచలన ఆరోపణలు - 40 లక్షలు మోసపోయానని ఆవేదన 22 వార్డుల్లో మాది 17వ వార్డు. ఏకగ్రీవం కావడంతో చైర్మన్ పదవి వస్తుందని చెప్పారు. మంత్రి రోజాను కలిస్తే అన్నను కలువు అని చెప్పారు. మంత్రి చెప్పినట్లుగా కుమారస్వామిని కలిస్తే డబ్బులు డిమాండ్ చేశారు. వారంలో 3 విడతలుగా 40లక్షలు అప్పజెప్పాం. మా దగ్గర డబ్బు లేకున్నా అప్పు తీసుకొచ్చి మరీ ఇచ్చాం. కానీ, ఎన్నికలయ్యాక చైర్మన్ క్యాండేట్‌ను మార్చారు. రెండోసారి చైర్మన్ ఇస్తామన్నారు. రెండున్నర సంవత్సరాల తర్వాత చేస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేదు. చివరికి టైం అయిపోయింది కదా అని నిలదీస్తే రెండు నెలల సమయం ఇవ్వండి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామన్నారు. ఆఖరికి 29లక్షలు ఇస్తామనడంతో సరే అన్నాం కానీ, మంత్రి కూడా స్పందించకపోవడంతో మీడియా ముందుకొచ్చాం. - భువనేశ్వరి, పుత్తూరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్
మినిస్టర్ రోజా మీ శాఖ మీకు గుర్తుందా - మంత్రిగా కాకపోయినా ఓ నేతగానైనా?!