ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

20లక్షల ఉద్యోగాల హామీకి కట్టుబడి ఉన్నాం: లోకేశ్ - LOKESH speech on jobs - LOKESH SPEECH ON JOBS

Minister Lokesh on University Recruitment: నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో బోధన, బోధనేతర పోస్టుల భర్తీపై శాసన మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.

Minister_Lokesh_on_University_Recruitment
Minister_Lokesh_on_University_Recruitment (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 26, 2024, 2:28 PM IST

Minister Lokesh on University Recruitment: కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో బోధన, బోధనేతర ఉద్యోగుల భర్తీపై శాసన మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేశ్ సమాధానాలిచ్చారు. యూనివర్సిటీలో సమస్యలు, ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి గవర్నర్​తో చర్చించామన్నారు. విద్యారంగ సమస్యలపై విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న త్రిబుల్ ఐటీలను బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని, దానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్​కి కావాల్సింది ఫ్యాన్సీ కంపెనీలు కాదని, యువతకు ఉద్యోలు ఇచ్చే కంపెనీలు కావాలని లోకేశ్ చెప్పారు. ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కాలేజ్​లో 4,600 పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో 2,127 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. విశ్వ విద్యాలయాల్లో 5వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఆగస్టు 5 నాటికి డిగ్రీ అడ్మిషన్లు పూర్తి చేస్తామని, అకడమిక్, అడ్మిషన్స్ క్యాలెండర్ త్వరలోనే విడుదల చేస్తామన్నారు. ఇంటర్నల్ షిప్ ద్వారానే విద్యార్థుల్లో క్రమశిక్షణ వస్తుందని అభిప్రాయపడ్డారు. తాను కూడా అమెరికాలో చదువుకున్న టైంలో ఇంటర్న్ షిప్ చేశానని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details