Krishna District SP Gangadhar Responded On Perni Nani Ration Rice Case : మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యం కేసు విచారణపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ స్పందించారు. బియ్యం మాయం కేసులో వివరాలు ఉంటే ఇవ్వాలని పేర్ని నానికి నోటీసులు ఇచ్చామని స్పందించకపోవడంతో మరోసారి నోటీసులు ఇస్తామని వెల్లడించారు. రేషన్ బియ్యం మిస్సింగ్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు. విచారణ త్వరగా పూర్తి చేసి కేసును కొలిక్కి తెస్తామని స్పష్టం చేశారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని కుటుంబానికి చెందిన గిడ్డంగిలో రేషన్ బియ్యం మాయంపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గోదాములోని రేషన్ బియ్యాన్ని మచిలీపట్నంలోని మార్కెట్ యార్డుకు తరలించారు. వాటిని. పొట్లపాలెంలో పేర్ని నాని తన భార్య జయసుధ పేరుతో గోదాము నిర్మించి పౌరసరఫరాల శాఖకు లీజుకు ఇచ్చారు.
సదరు గోదాములో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమవడంతో పేర్ని నాని సతీమణి జయసుధపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారులు సంబంధిత గోదాములోని మిగిలిన రేషన్ బియ్యం నిల్వలను మచిలీపట్నం మార్కెట్ యార్డుకు తరలించారు. స్టాక్ మొత్తం ఖాళీ చేశాక ఆ గోడౌన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టమని అధికారులు తెలిపారు.
అజ్ఞాతంలో పేర్ని నాని కుటుంబం! - ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు
వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం కుంభకోణంపై విచారణకు సిట్ ఏర్పాటు చేసేందుకు సిఫార్సు చేస్తానని మంత్రి కొల్లు రవీంద్ర ఇప్పటికే తెలిపారు. పేర్ని నాని పేదల బియ్యం మాయం చేసింది వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. గోదాములో బియ్యం నిల్వలు తగ్గాయని స్వయంగా ఆయనే ఒప్పుకున్నారని చెప్పారు. తప్పు చేయనపుడు దొంగలా తప్పించుకొని తిరగడం ఎందుకని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ కేసు విచారణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కోర్టుకు పేర్ని నాని: హైకోర్టులో మాజీమంత్రి పేర్ని నాని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రేషన్ బియ్యం కేసులో విచారణకు రావాలని పేర్ని నాని, కిట్టుకు నోటీసులు ఇవ్వడంతో కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. రేషన్ బియ్యం కేసులో ఏ1గా పేర్ని నాని భార్య జయసుధ ఉన్నారు. పేర్ని జయసుధ ముందస్తు బెయిల్‌పై మంగళవారం జిల్లా కోర్టులో విచారణ జరగనుంది. రేషన్ బియ్యం కేసులో ఏ2గా ఉన్న గిడ్డంగి మేనేజర్ మానసతేజ క్వాష్ పిటిషన్‌పైనా మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది.
గోదాములో పీడీఎస్ రైస్ మాయం! - మాజీ మంత్రి పేర్నినాని భార్యపై కేసు