Kotamreddy allegations on Vijayasai Reddy and Anilkumar:రానున్న ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోతుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్ధిగా విజయసాయిరెడ్డి (Vijaysai Reddy) 3లక్షల ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. సీఎం తరువాత రెండో స్ధానంలో ఉన్న ఆయన నెల్లూరు జిల్లాకు చేసింది సున్నా అని చెప్పారు. అలానే మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil kumar yadav) తీరుపై కోటంరెడ్డి విరుచుకుపడ్డారు. అనిల్ దగ్గర మాటలు ఫుల్, మ్యాటర్ నిల్ అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
సీఎం సభకు బస్సులు తరలింపు- నానా అవస్థలు పడుతున్న విద్యార్థులు, మహిళలు
నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకుల తీరుపై కోటంరెడ్డి విరుచుకుపడ్డారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు ఆయన గురించి మాట్లాడలేదు. వైసీపీ నుంచి బయటకు రాగానే ఆయనపై ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి స్వాగత ర్యాలీ అట్టర్ ప్లాప్ అయ్యిందని ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డి నామినేషన్ వేసే ముందు తమ ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలని కోటంరెడ్డి ప్రశ్నించారు.
సిద్ధం సభకు 2 వేల 500 బస్సులు! - ఇంటర్ విద్యార్థుల పరిస్థితి ఏంటి - ప్రజలు ఎలా పోయినా పర్లేదా?
ఎనిమిదేళ్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి నెల్లూరు జిల్లాకు ఏం చేశారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఉచ్చనీచాలు మరిచి మాట్లాడారు. ఆయన డూపుల సంఘాలకి అధ్యక్షుడు. మమ్మల్ని ద్రోహులు అంటున్నావు. కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోయావా ?2009లో అనిల్‌కు ఆనం వివేకానందరెడ్డి టికెట్ ఇప్పించి రాజకీయ బిక్షపెట్టాడు కానీ ఎన్నికలు ముగియకముందే వివేకానందరెడ్డిపై తిరగబడ్డాడు. విశ్వాసం లేకుండా ఆయన్ని బెదిరించాడు. ఇంతటి మాయ మోసగాడైన అనిల్ నీతులు చెప్తున్నాడు.-కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత
విశాఖలోనే ప్రమాణస్వీకారం- అవకాశమిస్తే మరో పదేళ్లు ఊడ్చేయడానికి సిద్ధం: చెప్పకనే చెప్పిన సీఎం
పార్టీలు మారడం ద్రోహం అంటే మరి వైఎస్సార్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి సోనియాగాంధీ ఇచ్చారని, జగన్‌కి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్సార్ మరణం తర్వాత నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ రక్తం అని సోనియాను కన్నతల్లి అంటూ జగన్ అన్నారు కానీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని అదే సోనియాను ఇటలీ బొమ్మ అన్నది జగన్ కాదా అని కోటంరెడ్డి ప్రశ్నించారు. నేను మాత్రమే ఓరిజనల్ మిగతా అందరూ డూప్ అన్నావు. నీ సంగతి, నువ్వు ఏంటో నాకు తెలిసినంత ఎవ్వరికీ తెలీదని అన్నారు. అనిల్ యాదవ్ నరసరావుపేట ఎంపీగా చిత్తుచిత్తుగా ఓడిపోతాడని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన గెలిచి ప్రభుత్వం స్థాపిస్తుందని కోటంరెడ్డి అన్నారు