ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

మే 13న ఓటుతో కొడితే వైఎస్సార్సీపీ కుంభస్థలం బద్దలవ్వాలి: పవన్‌ కల్యాణ్‌ - Pawan Kalyan Election Campaign

Pawan Kalyan Election Campaign: అభివృద్ధి చేయడం చేతకాని, ఉపాధి అవకాశాలు కల్పించని జగన్‌ను సాగనంపాలని జనసేన అధినేత పవన్‌ పిలుపునిచ్చారు. మే 13న ఓటుతో కొడితే వైఎస్సార్సీపీ కుంభస్థలం బద్ధలవ్వాలంటూ ప్రజల్ని ఉత్సాహపరిచారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, గణపవరంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభల్లో పవన్‌ పాల్గొన్నారు.

Pawan Kalyan Election Campaign
Pawan Kalyan Election Campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 9:30 AM IST

మే 13న ఓటుతో కొడితే వైఎస్సార్సీపీ కుంభస్థలం బద్దలవ్వాలి:పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan Election Campaign :అరాచకం తప్ప అభివృద్ధి చేయని జగన్‌కు పొలిటికల్‌ హాలిడే ఇచ్చేద్దామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. మే 13న ఓటుతో కొడితే వైఎస్సార్సీపీ కుంభస్థలం బద్ధలవ్వాలంటూ ప్రజల్ని ఉత్సాహపరిచారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, గణపవరంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభల్లో పవన్‌ పాల్గొన్నారు.

అభివృద్ధి చేయడం చేతకాని, ఉపాధి అవకాశాలు కల్పించని జగన్‌ను సాగనంపాలని జనసేన అధినేత పవన్‌ పిలుపునిచ్చారు. గణపవరంలో సభలో పాల్గొన్న పవన్‌ ప్రజల భూములు దోచుకోవడానికి జగన్‌ ప్రమాదరకమైన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం తీసుకొస్తున్నారన్నారు. దీని ప్రకారం ఆస్తుల ఒరిజినల్‌ పత్రాలు జగన్‌ దగ్గర పెట్టుకుని యజమానులకు జిరాక్సులు మాత్రమే ఇచ్చి ఆస్తుల వివరాలన్నీ హైదరాబాద్‌ నానక్‌రామగూడలోని వైసీపీ ప్రైవేటు స్థావరంలో దాచిపెడుతున్నారని ఆరోపించారు. ఈసారి వైసీపీకు ఓటేస్తే మీ ఆస్తులను మీరే పెట్రోల్‌ పోసి తగలపెట్టుకున్నట్టేనని హెచ్చరించారు. కేంద్రం ఇచ్చే పాస్‌పోర్టుపై కూడా ప్రధాని చిత్రం ఉండదని. దేశ రాజముద్ర మాత్రమే ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజల భూమి పత్రాలపై జగన్‌ ఫొటో ఎందుకు? అని ప్రశ్నించారు. మీ పిల్లల భవిష్యత్తు కోసమే నేను ఇప్పుడు పోరాడుతున్నానని యువతతో చెప్పారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే సీపీఎస్‌ సమస్యపై అసెంబ్లీలో బలమైన చర్చ జరిపి, పరిష్కారం కోసం పోరాడతామని హామీ ఇచ్చారు.

ల్యాండ్ టైటిల్ యాక్ట్​తో జగన్ ప్రజల ఆస్తుల్ని కాజేస్తారు: పవన్ కల్యాణ్ - Pawan Kalyan fired on CM Jagan

తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ కొట్టు కట్టేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పవన్‌ చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తాడేపల్లిగూడేన్ని ఎడ్యుకేషన్, మార్కెట్‌ హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమనిధిని జగన్‌ దోచుకున్నారని పవన్‌ ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని సంక్షేమనిధికి వ్యక్తిగతంగా కోటి విరాళం ప్రకటించారు.

వైఎస్సార్సీపీకి ఓటమి ఖాయం - కూటమిదే అధికారం : పవన్ కల్యాణ్ - Pawan Kalyan Election campaign

ఆక్వా రంగాన్ని జగన్‌ నిండా ముంచారని, టీడీపీ ప్రభుత్వం యూనిట్‌ విద్యుత్తు రూ.1.5కే అందిస్తే జగన్‌ రూ.5కి పెంచారని పవన్ ఆరోపించార. గతంలో రూ.1600 ఉన్న మేత జగన్‌ ప్రభుత్వంలో రూ.2,750కి పెరిగిందని, గిట్టుబాటు ధర లేక ఆక్వా రైతు కిలో రొయ్యకు రూ.50 వరకు నష్టపోతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆక్వా రైతును ఆదుకుంటామన భరోసా ఇచ్చారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏలూరు కాలువ పూడిక కూడా తీయలేకపోయిందని, నీటి సమస్య ఉన్న గ్రామాలకు పోలవరం కాలువ నుంచి నీరు సరఫరా చేస్తామని, ఆపరేషన్‌ కొల్లేరులో ధ్వంసమై, పరిహారం రాని జిరాయితీ భూములకు పరిహారం అందేలా చూస్తాని హామీ ఇచ్చారు.

తుని రైలు దహనం వైఎస్సార్సీపీ కుట్రే: పవన్​ కల్యాణ్​ - Pawan kalyan Election Campaign

ABOUT THE AUTHOR

...view details