Huge Crowd Attend Janasena-TDP Public Meeting:తెలుగుదేశం- జనసేన పార్టీలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఈ సభకు కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఇరు పార్టీల నేతలు స్టేజ్ పంచుకోవడం కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సభకు సుమారు 7 లక్షల మంది హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలుగు తమ్ముళ్లు, జనసైనికులతో సభా ప్రాంగణం కిటకిటలాడింది. సభా ప్రాంగణం పూర్తిగా నిండిపోవటంతో వేలాదిమంది అభిమానులు జాతీయ రహదారిపై నుంచే వీక్షిస్తున్నారు. తాడేపల్లిగూడెం - తణుకు మధ్య జాతీయ రహదారి స్తంభించిపోయింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నాగబాబులు తాడేపల్లిగూడెం చేరుకున్నారు.
తెలుగు జన విజయకేతనం నినాదంతో జెండా పేరిట నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభలో ఇరు పార్టీల శ్రేణులు కలిసి కదనరంగంలోకి దూకేలా ఇరు పార్టీల అధినేతలు దిశానిర్దేశం చేయనున్నారు. 99 మంది అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత ఎన్నికల ప్రచారం కోసం నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభకు టీడీపీ, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రేణుల వాహనాల్ని 2 కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు ఆపేస్తున్నప్పటికీ అడ్డంకుల్ని ఛేదించుకుని సభాస్థలికి చేరుకున్నారు. వేదికపై దాదాపు 500 మంది ఆశీనులయ్యేలా ఏర్పాట్లు చేశారు. కూర్చుని సభ తిలకేంచేందుకు వీలుగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన ఉమ్మడి బహిరంగ సభ
Huge Rally from Rajahendravaram:తెలుగుదేశం-జనసేన బహిరంగ సభకు రాజహేంద్రవరం నుంచి ఇరు పార్టీల శ్రేణులు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. వీఎల్పురం పాత లారీ స్టాండ్ వద్ద నుంచి బైక్లు కార్లులో భారీగా వెళ్లారు. రాజమహేంద్రవరం టీడీపీ అభ్యర్ధి ఆదిరెడ్డి వాసు, జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ర్యాలీ ప్రారంభించారు. జగన్ పతనం ప్రారంభమైందని వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన విజయం ఖాయమని నాయకులు అభిప్రాయపడ్డారు.