Congress Leader V Hanumanth Rao on CM Revanth Governance :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు (వీహెచ్) అభిప్రాయపడ్డారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఎలాంటి పదవి లేకుండా ఉన్నానన్న హనుమంతరావు, సికింద్రాబాద్ ఎంపీ టికెట్ తనకు ఇచ్చి ఉంటే గెలిచేవాడినని వ్యాఖ్యానించారు. తెలంగాణ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన వీహెచ్, టికెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న కురియన్ కమిటీ తొలుత ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలును కలవాలన్నారు.
"ఎనిమిదేళ్లుగా నాకేమైనా పదవి ఉందా? కానీ కాంగ్రెస్ గెలుపు కోసం ఎక్కడికైనా వెళ్తా, ఏమైనా చేస్తాను. ఈ క్రమంలోనే గత అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం అన్నిచోట్ల తిరిగాను. పదేళ్లపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నట్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, అందుకు నా నుంచి ఏవైనా సలహాలు అడిగితే తప్పకుండా చెబుతాను." -వి.హనుమంతరావు, పీసీసీ మాజీ అధ్యక్షుడు
Former PCC Chief VH On Sports :టీ-20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియా టీమ్‌కు వీహెచ్ శుభాకాంక్షలు తెలిపారు. టీమ్‌లో సభ్యుడైన సిరాజ్ హైదరాబాద్ నివాసి అని, ఆయనకు సీఎం ఫ్లాట్, ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారని వివరించారు. గతంలో అతని ప్రతిభను చూసి సీఎఫ్ఐ ఛైర్మన్‌గా తాను సన్మానించినట్లు పేర్కొన్న హనుమంతురావు, దేశంలో క్రికెట్‌కు మంచి క్రేజ్ ఉందని అభిప్రాయపడ్డారు.