Delhi Liquor Scam MLC Kavitha Bail Petition Update: దిల్లీ మద్యం కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు వాదనలను సోమవారానికి వాయిదా వేసింది. దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కవిత న్యాయవాది కోర్టుకు వివరించారు. దిల్లీ హైకోర్టు కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా కౌంటర్ కాపీ ఇవ్వాలని దర్యాప్తు సంస్థకు ఆదేశించింది. ఆదివారం సాయంత్రంలోపు కౌంటర్ కాపీ ఇవ్వాలని తెలిపింది. సోమవారం రెండు కేసుల్లో కవిత వాదనలు పూర్తి చేయాలని కోర్టు సూచించింది. మంగళవారం ఈడీ, సీబీఐ వాదనలు వింటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు - కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు వాయిదా - KAVITHA BAIL PETITION NEWS LATEST - KAVITHA BAIL PETITION NEWS LATEST
MLC Kavitha Bail Petition Update: దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు సోమవారానికి వాయిదా పడ్డాయి.
MLC_Kavitha_Bail_Petition_Update (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 24, 2024, 2:38 PM IST
|Updated : May 24, 2024, 4:31 PM IST
Last Updated : May 24, 2024, 4:31 PM IST