ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆంధ్రప్రదేశ్ అప్పులు 14లక్షల కోట్లు!- ఆర్థికశాఖ శ్వేతపత్రంపై సీఎం చంద్రబాబు సమీక్ష - CBN review ON financial condition

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 10, 2024, 3:36 PM IST

Updated : Jul 10, 2024, 7:17 PM IST

CBN review ON financial condition : ఆర్థిక శాఖపై విడుదల చేయాల్సిన శ్వేతపత్రంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రానికి ఉన్న అప్పులు, ఆదాయాలపై ఆరా తీశారు. మొత్తం అప్పులు లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్థికశాఖ అంచనా వేసింది. పెండింగ్ బిల్లులపై ఆర్థికశాఖ ఇప్పటికే శాఖల వారీగా వివరాలు అడిగింది. ఇదిలా ఉండగా పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ పెట్టాలని ఆర్థిక శాఖ సూచించగా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టే అంశంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

cbn_review_on_financial_condition
cbn_review_on_financial_condition (ETV Bharat)

CBN review ON financial condition : వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవస్థలను ఏవిధంగా విధ్వంసం చేసిందో వివరిస్తూ సీఎం చంద్రబాబు వరుస శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్‌రంగంపై శ్వేతపత్రాలు విడుదల చేసిన సీఎం... అదే వరుసలో ఈనెల 18న రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, అప్పులపై సమగ్ర నివేదిక ప్రజల ముందు ఉంచనున్నారు. సచివాలయంలో ఆర్థిక అంశాలు, బడ్జెట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై ముఖ్యమంత్రి ప్రధానంగా ఆరా తీశారు. మరోవైపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగించేందుకు ఆర్డినెన్సు జారీపైనా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మూడు శాఖల పనితీరుపై సీఎం సమీక్ష- ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై దృష్టి - CM Chandrababu Review on Roads

వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన ఇబ్బడిముబ్బడి రుణాలతో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. రాష్ట్రానికి ఉన్న అప్పులు, ఆర్థిక అంశాలపై ఈనెల 18న ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. సచివాలయంలో అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు ఆర్థిక అంశాలు- రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై ఆరా తీశారు. రాష్ట్రానికి ఏమేరకు అప్పులు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. 2019 -24 మధ్య కాలంలో ప్రభుత్వం చేసిన రుణాలు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ తో పాటు కార్పొరేషన్ల పేరిట తీసుకున్న రుణాలపై సీఎం ఆరా తీశారు. ఇప్పటి వరకూ అన్ని రకాల అప్పులు కలిపి మొత్తంగా 14.49 లక్షల రూపాయల మేర ఉన్నట్టు ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినట్టు తెలుస్తోంది. మరోవైపు పెండింగ్ బిల్లులు ఏమేరకు ఉన్నాయనే అంశంపైనా చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. వివిధ శాఖల నుంచి ఇంకా వివరాలు అందాల్సి ఉందని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు.

రాష్ట్రానికి వస్తున్న రెవెన్యూ, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ నిధుల కేటాయింపులపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఇటీవల దిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర పెద్దలను కలిసి రాష్ట్రానికి సాయం చేయాల్సిందిగా కోరిన సీఎం నిరంతరం కేంద్ర మంత్రిత్వశాఖలతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల రాష్ట్రం ఏవిధంగా దెబ్బతిందో ప్రజలకు సవివరంగా తెలియజేసేలా శ్వేతపత్రం రూపొందించాలని ఆర్థికశాఖ అధికారులకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. మరోవైపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగించేలా ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకురానున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. దీనిపై కేబినెట్ సమావేశంలోనూ ప్రభుత్వం తీర్మానం చేయనుంది.

విద్యుత్​శాఖపై రూ. 1.20 లక్షల కోట్ల రుణభారం - వైఎస్సార్సీపీ ప్రభుత్వ తీరే కారణమన్న అధికారులు - Chandrababu Review on Power Sector

పోలవరంపై సీఎం చంద్రబాబు సమీక్ష - ప్రాజె్క్టు పరిస్థితిపై ఆరా.. - Chandrababu meeting in Secretariat

Last Updated : Jul 10, 2024, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details