ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

రూ.10 వేల కోట్ల పెట్టుబడి లక్ష్యం - నూతన టెక్స్‌టైల్ పాలసీ: సీఎం చంద్రబాబు - CM CBN REVIEW ON NEW TEXTILE POLICY

రాష్ట్రంలో నూతన టెక్స్‌టైల్‌ పాలసీ తెచ్చే అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష - వస్త్ర పరిశ్రమల్లో మహిళలకు పెద్దఎత్తున ఉపాధి కల్పించాలని నిర్ణయం

cm_cbn_review_on_new_textile_policy
cm_cbn_review_on_new_textile_policy (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2024, 9:43 PM IST

CM Chandrababu Review on New Textile Policy:10 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో నూతన టెక్స్ టైల్ పాలసీ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గార్మెంట్ ఫ్యాక్టరీల ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నూతన పాలసీ ప్రకటించాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. కొత్తగా టెక్స్ టైల్ పాలసీని తీసుకువచ్చేందుకు నిర్ణయించింది. దీనిలో భాగంగా నూతన టెక్స్ టైల్ పాలసీపై సీఎం చంద్రబాబు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రూ.10 వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా నూతన టెక్స్ టైల్ పాలసీ రూపకల్పన చేశారు. దీని ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. కొత్త పాలసీలో ప్రోత్సాహకాలు ఇచ్చి వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ యూనిట్స్​కు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త పాలసీలో భాగంగా కేపిటల్ సబ్సిడీ పెంచనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు మహిళలకు అదనంగా ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంపై ప్రతిపాదించారు.

2018-23 పాలసీ కంటే మరింత మెరుగ్గా ఈ పాలసీ ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ రంగంలో వచ్చే పెట్టుబడుల ద్వారా గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున మహిళలకు ఉపాధి కల్పించవచ్చని అన్నారు. కొత్త పాలసీ ద్వారా వస్త్ర తయారీలో పెట్టుబడులకు రాష్ట్రం ఉత్తమమైన వేదిక అవుతుందని చంద్రబాబు అన్నారు. పాలసీ డ్రాఫ్ట్​పై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం దీనికి ఆమోదం తలిపారు. రానున్న రోజుల్లో దీన్ని క్యాబినెట్ ముందుకు తీసుకురానున్నారు. టెక్స్ టైల్ పాలసీతో పాటు లెదర్ పాలసీపైనా సీఎం సమీక్ష చేశారు. మరింత కసరత్తు తరువాత లెదర్ పాలసీపై ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు.

పోలీసులను వారి పనులను చేసుకోనివ్వండి - నా పని నేను చేస్తా : దిల్లీలో పవన్ కల్యాణ్

ఏపీలోనూ "హైటెక్ సిటీ" నిర్మాణం - 2029 నాటికి 5లక్షల వర్క్​స్టేషన్లు : చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details