ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

గుడివాడలో 'అన్న క్యాంటీన్‌' పునః ప్రారంభం - పేదలతో కలిసి సీఎం చంద్రబాబు దంపతుల భోజనం - CM CBN Inaugurated Anna Canteen

CM CBN Inaugurated Anna Canteen : కృష్ణా జిల్లా గుడివాడలో 'అన్న క్యాంటీన్‌'ను సీఎం చంద్రబాబు పునః ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు దంపతులు పలువురికి భోజనం వడ్డించారు. అనంతరం పేదలతో కలిసి భోజనం చేశారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

CM CBN Inaugurated Anna Canteen
CM CBN Inaugurated Anna Canteen (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 15, 2024, 1:41 PM IST

Updated : Aug 15, 2024, 3:03 PM IST

CM CBN Inaugurated Anna Canteen : మూడు పూటలా పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పునః ప్రారంభించారు. కృష్ణా జిల్లా గుడివాడలో 'అన్న క్యాంటీన్‌'ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు పలువురికి భోజనం వడ్డించారు. పేదలతో కలిసి భోజనం చేశారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

2014 - 2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన అన్న క్యాంటీన్లను, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూసివేసి నిరుపేదలను రోడ్డున పడేసింది. అధికారంలోకి వచ్చాక తిరిగి అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎన్డీయే ప్రభుత్వం, తాజాగా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది. 203 అన్న క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని మొదట భావించినా భవన నిర్మాణ పనులు పూర్తి కానందున తొలి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. రెండు, మూడు విడతల్లో మిగిలిన క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.

పేదలకు ప్రభుత్వం పంద్రాగస్టు కానుకగా అన్నక్యాంటీన్లను సిద్ధం చేసింది. రోజూ లక్షా 5 వేల మంది పేదల ఆకలి తీరనుంది. ఒక్కొక్కరి నుంచి పూటకు 5 రూపాయల చొప్పున నామమాత్రపు ధరకు నాణ్యమైన ఆహారం అందించనున్నారు. మూడు పూటలా పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను నేడు చంద్రబాబు ప్రారంభించారు.

కృష్ణా జిల్లా గుడివాడలో మొదటి అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. మిగిలిన 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభిస్తారు. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి. అన్న క్యాంటీన్లలో సోమవారం నుంచి శనివారం వరకు రోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రికి భోజనం అందించనున్నారు.

Anna Canteen Menu: సోమవారం, గురువారం అల్పాహారంగా ఇడ్లీ, చట్నీ, పొడి, సాంబార్‌ అందిస్తారు. పూరీ, కుర్మా కూడా అందుబాటులో ఉంచుతారు. మంగళవారం, శుక్రవారం ఉప్మా, చట్నీ, బుధవారం, శనివారం పొంగల్‌, చట్నీ, మిక్చర్‌ వడ్డిస్తారు. ఇడ్లీ వద్దనుకునే వారు ప్రత్యామ్నాయంగా పూరీ, ఉప్మా, పొంగల్‌ తీసుకోవచ్చు. రోజూ మధ్యాహ్నం, రాత్రి అన్నంతోపాటు కూర, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి అందిస్తారు.

అల్పాహారంలో మూడు ఇడ్లీ లేదా మూడు పూరీ ఇస్తారు. ఉప్మా, పొంగల్‌ 250 గ్రాములు, అన్నం 400 గ్రాములు, పెరుగు 75 గ్రాములు ఉంటుంది. వారానికోసారి ప్రత్యేక ఆహారం అందిస్తారు. క్యాంటీన్లలో తాగునీటి సౌకర్యం ఉంటుంది. అల్పాహార వేళల్ని ఉదయం ఏడున్నర నుంచి 10 గంటల వరకూ నిర్ణయించారు. మధ్యాహ్న భోజనం వేళల్ని పన్నెండున్నర నుంచి 3 గంటల వరకు, రాత్రి భోజన సమయాన్ని ఏడున్నర నుంచి 9 గంటలకు వరకూ ఖరారు చేశారు. ఆదివారం క్యాంటీన్లకు సెలవు ప్రకటించారు.

Last Updated : Aug 15, 2024, 3:03 PM IST

ABOUT THE AUTHOR

...view details