ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

వేంకటేశ్వరస్వామిపై నమ్మకం ఉందా లేదా? - డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత లేదా జగన్​?: సీఎం చంద్రబాబు - CM Chandrababu on YS Jagan - CM CHANDRABABU ON YS JAGAN

CM Chandrababu Comments on YS Jagan: గత వైఎస్సార్​సీపీ ప్రభుత్వంలో దేవాలయాల్లో జరిగిన ఘటనలపై నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్‌ దేవుడిని దర్శించుకోవచ్చని కానీ ఆయనకు వేంకటేశ్వరస్వామిపై నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యమన్నారు. తిరుమలలో డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన బాధ్యత జగన్‌కు లేదా అని సీఎం నిలదీశారు.

chandrababu_on_jagan
chandrababu_on_jagan (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2024, 3:34 PM IST

CM Chandrababu Comments on YS Jagan:అపచారం చేసి, అబద్ధాలను నిజాలుగా చేయాలని చూడటం దేవుడికి ద్రోహం చేయడమేనని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరు ఏ మతమైనా ఇతర మతాల్ని చులకనగా చూడటం సరికాదని హితవు పలికారు. వేంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అని జగన్‌ను ప్రశ్నించారు. నమ్మకం ఉంటే అన్యమతస్థులు టీటీడీ సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని అన్నారు. డిక్లరేషన్ సంప్రదాయాన్ని గౌరవించనప్పుడు తిరుమల ఎందుకు వెళ్లాలని సీఎం నిలదీశారు.

జగన్‌కు గతంలో ప్రజలు ముఖ్యమంత్రిగా పని చేయమని అవకాశం ఇచ్చారే గానీ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించమని కాదని స్పష్టం చేశారు. వైఎస్సార్​సీపీ పాలనలో దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు అవి బొమ్మలే కదా అంటూ నిష్టూరమాడి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని చంద్రబాబు దుయ్యబట్టారు. మనందరం ఉండి కూడా భగవంతుడికి అపరాధం జరిగిందనేదే బాధాకరమని, అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలని సీఎం వ్యాఖ్యానించారు.

రాములవారి రథానికి నిప్పు - పోలీసుల దర్యాప్తు ముమ్మరం - గ్రామ కక్షలే కారణమా? - Chariot Fire In Anantapur District

గతంలో ఆంజనేయస్వామి విగ్రహం చెయ్యి నరికేస్తే ఏమైంది బొమ్మే కదా అని జగన్ అన్నారని మండిపడ్డారు. హనుమంతుడు జగన్ దృష్టిలో బొమ్మా? వెంకటేశ్వరస్వామి కూడా బొమ్మా అని అన్నారు. రాములవారి తల తీసేస్తే ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా అని జగన్ అన్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్​సీపీ పాలనలో రథం కాలిపోతే తేనెటీగలు వచ్చాయని అన్నారని సీఎం తెలిపారు. నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఇక భగవంతుడే చూసుకుంటాడు అది వేరే విషయం అని అన్నారు. అబద్ధాలను నిజాలుగా చేయాలని చూడటం స్వామి ద్రోహమని సీఎం చంద్రబాబు అన్నారు.

వేంకటేశ్వరస్వామిపై జగన్‌కు నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యం. నమ్మకం ఉంటే అన్యమతస్థులు సంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యతను గౌరవించనప్పుడు తిరుమల ఎందుకు వెళ్లాలి. సంప్రదాయాలకు విరుద్ధంగా ఉండాలని నాడు ప్రజలు మీకు అధికారం ఇవ్వలేదు. రాములవారి తల తీసేస్తే ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా అని జగన్ అన్నారు. వైసీపీ పాలనలో రథం కాలిపోతే తేనెటీగలు వచ్చాయన్నారు. నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు.- చంద్రబాబు, సీఎం

సనాతన ధర్మం జోలికొస్తే ఊరుకునేది లేదు : పవన్ కల్యాణ్ - Pawan Kalyan Visits Indrakeeladri

పోస్టింగులు, రాజకీయ ప్రాపకం కోసం - ముంబై నటిపై ఫోర్జరీ పత్రంతో కేసు - Mumbai Actress Case

ABOUT THE AUTHOR

...view details