CM Chandrababu Chit Chat with Media: అధికారం అండతో గన్ను పెట్టి బలవంతంగా ఆస్తులు రాయించుకోవటం దేశ చరిత్రలోనే లేదని సీఎం చంద్రబాబు విస‌్మయం వ్యక్తం చేశారు. ఈ తరహా నేరాల పట్ల ఏం చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తున్నట్లు తెలిపారు. జగన్ హయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలపై ఏం చేయాలో అధ్యయనం చెయ్యాలని అధికారులకు సూచించారు. ఒకసారి కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేస్తే జరిమానా కట్టేలా చర్యలుండాలని చెప్పారు. అన్నివైపుల నుంచి ప్రజల కోణంలో మంచి ఏదనేది బేరీజు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ప్రజావేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి సీఎం వినతులు స్వీకరించారు. సమస్యలన్నింటినీ సావధానంగా విన్న చంద్రబాబు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం సీఎం మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు.
రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలు:ప్రజాసమస్యల పరిష్కారం దిశగా చేపడుతున్న కార్యక్రమాలను సీఎం పంచుకున్నారు. ప్రజలకు తక్కువ ధరకే ఇసుక అందాలనే ఉద్దేశంతో చాలా సమస్యలను పరిష్కరించామన్నారు. ఉచిత ఇసుక బోర్డు పెట్టి ఎన్ని టన్నులైనా రవాణా చేసుకునేలా వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. కృష్ణాజిల్లా పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లో రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకల అంశం సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించి రికార్డుల్లో తక్కువ చూపిస్తూ అధికారులు, మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వెంటనే సమస్యను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.
తిరుమల భక్తులకు గుడ్న్యూస్ - కావాల్సినన్ని లడ్డూలు - ఎప్పటినుంచో తెలుసా?