Chandrababu Speech at Prajagalam Public Meeting in Chittoor: సామాజిక న్యాయం పేరుతో జగన్ అందరినీ మోసం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. చిత్తూరు ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు జగన్‌పై నిప్పులు చెరిగారు. తిరుపతిలో జనసేన అభ్యర్థి గెలుస్తున్నారని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన సామాజిక న్యాయం పాటించాయని అన్నారు. కొన్ని కారణాల వల్ల రాజన్‌కు సీటు ఇవ్వలేకపోయినట్లు తెలిపారు. కానీ రాజన్‌కు సముచిత స్థానం ఇచ్చే బాధ్యత నాదని చంద్రబాబు అన్నారు.
దేశం మొత్తం కడపవైపే చూస్తోంది- పార్టీలకతీతంగా న్యాయాన్ని గెలిపించాలి : సునీత - Vote for Justice
తాను పుట్టిన జిల్లాలోనే చివరి మీటింగ్ పెట్టుకున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తనకు రాజకీయ జన్మ ఇచ్చిన జిల్లా చిత్తూరు జిల్లా అని కొనియాడారు. 45 ఏళ్లుగా తనను ఆదరించి ముందుకు నడిపించారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. చిత్తూరు జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టాలని జీవితాంతం పనిచేశాని అన్నారు. కుప్పంలో ఇంటికి కిలో బంగారం ఇచ్చినా మీకు ఓటు వేయరంటూ వైఎస్సార్సీపీని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్‌గా ఏర్పాటు చేశానని అంతే కాకుండా అపోలో నాలెడ్జ్ సిటీని నేనే తెచ్చానని చంద్రబాబు తెలిపారు.
అధికారంలోకి రాగానే రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపైనే: చంద్రబాబు - Chandrababu Prajagalam Meeting
జగన్ పాలనలో కరెంట్ ఛార్జీలు ఎన్నోసార్లు పెంచారని చంద్రబాబు తెలిపారు. మద్య నిషేధం పేరుతో ప్రజలను జగన్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఐఐటీ, ఐసర్ సంస్థలు ఏర్పాటు చేశామని హైవేల విస్తరణకు కృషి చేసిన పార్టీ మాదని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. 49 సీట్లు ఇచ్చిన రాయలసీమకు జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో పదవులన్నీ పెద్దిరెడ్డికే కావాలని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్సీపీ నాయకులు తిన్నదంతా వసూలు చేస్తామని అన్నారు. జగన్ ఎర్రచందనం స్మగ్లర్లకు సీట్లు ఇచ్చారని అన్నారు.
రండి! 'అమ్మ'కు ఓటేద్దాం- 'అన్నపూర్ణ'ను గెలిపిద్దాం! - Vote for Amaravati
వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. జగన్‌పై మహిళలు, యువత, చిరువ్యాపారులు అందరూ తిరగబడ్డారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల, జగన్ ఈ ఐదుగురే బాగుపడ్డారని మాత్రమే బాగుపడ్డారని దుయ్యబట్టారు. వైసీపీ దోపిడీకి అన్నివర్గాలూ బలయ్యారని తెలిపారు. పవన్ కల్యాణ్ నిజజీవితంలో కూడా హీరోనే అని చంద్రబాబు కొనియాడారు. మా కూటమి మా కోసం కాదు ప్రజల కోసమని రాష్ట్రం నిలబడాలి పిల్లల భవిష్యత్తు వెలగాలని చంద్రబాబు అన్నారు.