ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

'సీఎం పేరు మర్చిపోయినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా' - అల్లు అర్జున్ ఘటనపై కేటీఆర్ ఫైర్ - KTR FIRE ON CM REVANTH REDDY

స్కాములు, ఫార్మాలాలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని కేటీఆర్‌ డిమాండ్ - స్కాములపై అసెంబ్లీలోనే సమాధానం చెబుతానని వెల్లడి

ktr_fire_on_cm_revanth_reddy
ktr_fire_on_cm_revanth_reddy (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 17, 2024, 7:57 PM IST

BRS working president KTR fire on CM Revanth Reddy:స్కాములు, ఫార్ములా అంటున్న ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టాలని అక్కడే వాటికి సమాధానం చెప్తానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. నాలుగు గోడల మధ్య కేబినెట్​లో కాదని అసెంబ్లీలో చర్చిద్దామని అన్నారు. శాసనసభ సమావేశాలు 15 రోజుల పాటు పెట్టాలని మొదట ప్రజాసమస్యలపై చర్చిద్దామని కేటీఆర్ పేర్కొన్నారు. హీరో అల్లు అర్జున్ ఏం తప్పు చేశారని ప్రశ్నించారు. అంతే కాకుండా సీఎం పేరు మరచిపోయినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు.

రేవంత్ ప్రభుత్వంపై ఏడాదిలోపే వ్యతిరేకత: కొడంగల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్యనేతలతో తెలంగాణ భవన్​లో కేటీఆర్ సహా పలువురు నేతలు సమావేశమయ్యారు. రుణమాఫీ పూర్తి చేయని, రైతుబంధు ఇవ్వని సీఎం రేవంత్ రెడ్డికి సర్పంచు ఎన్నికల్లో రైతులు తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్ అన్నారు. కొడంగల్​లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ బాధ పడుతున్నారని తెలిపారు. ఎక్కడైనా ప్రభుత్వంపై మూడు, నాలుగేళ్లకు వ్యతిరేకత వస్తుంది కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఏడాదిలోపే వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. అన్నీ అనుకూలిస్తే పట్నం నరేందర్ రెడ్డి కేసులో రేపు తీర్పు వచ్చే అవకాశం ఉందని అలానే నరేందర్ రెడ్డికి, రైతులకు న్యాయం జరిగేలా అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని కేటీఆర్ చెప్పారు.

కొడంగల్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర:లగచర్ల అంశాన్ని రాజ్యసభలో కూడా ప్రస్తావిస్తామని కేటీఆర్ తెలిపారు. కొడంగల్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం కావాలని, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తరహాలో అందరం కదులుదామని నేతలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ కొడంగల్ వచ్చి అక్కడి రైతుల బాధలు తెలుసుకోవాలని, కాంగ్రెస్ పార్టీ ఇక ఎప్పటికీ కోలుకోదని వ్యాఖ్యానించారు. జమిలి ఎన్నికలు అంటున్నారు కాంగ్రెస్​ను పంపేందుకు 2028 వరకు వేచి చూడాల్సిన అవసరం కూడా రాదేమోనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

53 బార్ లైసెన్సులకు నోటిఫికేషన్ - ఈ నెల 22 వరకు దరఖాస్తుకు అవకాశం

రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసేవారికి జైలుశిక్ష తప్పదు : మంత్రి మనోహర్‌

ABOUT THE AUTHOR

...view details