BRS Leaders on RS Praveen Kumar Joining : బీఆర్ఎస్ అంటే బహుజన రాష్ట్ర సమితి అని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లాగా(RS Praveen Kumar) ఎంతో మంది మేధావులు బీఆర్ఎస్‌లో చేరబోతున్నారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో మాజీమంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ బీఆర్ఎస్ బహుజనుల పార్టీ గనుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రలోభాలకు లొంగకుండా బీఆర్‌ఎస్‌లోకి చేరారన్నారు.
Ex Minister Srinivas goud on Party Changing : బీఆర్ఎస్‌లో బహుజన నాయకత్వం బలంగా ఉందని, బీఆర్ఎస్(BRS) బహుజన నాయకులను కాంగ్రెస్ పార్టీ లోబరుచుకునే ప్రయత్నం చేస్తోందని వారు ఆరోపించారు. కాంగ్రెస్ కుట్రలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని, అంబేడ్కర్ సిద్ధాంతాలను తూచ తప్పకుండా అమలు చేస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టేనని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు లాభపడి, స్వార్థం కోసం ఇప్పుడు కొందరు పార్టీని వీడుతున్నారని, పార్టీని వీడి వెళ్లిన వారిని తిరిగి రానిచ్చేదిలేదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
Srinivas Goud fires on Congress : ఉద్యమంలో ద్రోహం చేసిన వాళ్లే మళ్లీ ఇప్పుడు ద్రోహం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను బీజేపీలోకి వెళ్తున్నట్టు వచ్చిన వార్తలను ఖండించిన మాజీ మంత్రి, గుడికి వెళ్తే ఆ పార్టీలో చేరుతున్నారని ప్రచారం చేయటం తగద్నారు. కేసీఆర్‌ను టార్గెట్ చేయడంలో భాగంగానే కవిత అరెస్టు(Kavitha Arrest) జరిగిందని, కవిత అరెస్టును ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రతి పక్షాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, కచ్చితంగా మరోసారి పెద్ద పోరాటం మొదలవుతుందన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం తెలుస్తోందన్నారు. రాబోయే ఐదేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్సే అని ఆయన స్పష్టం చేశారు.