MP Raghuramakrishnan Raju in the election ring : ఎంపీ రఘురామ కృష్ణ రాజు ఎన్నికల్లో పోటీ చేస్తారా? గత ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా గెలిచిన రఘురామ ఈ సారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన ఏ పార్టీ గుర్తుపై పోటీ చేస్తారు? ఎమ్మెల్యగా పోటీ చేస్తారా లేక ఎంపీగా బరిలో ఉంటారా? లేదంటే ఇప్పటికే కూటమి అభ్యర్థులు ఖరారైన తురుణంలో రఘురామ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్టేనా? ఆర్ఆర్ఆర్ అభిమానులను వేధిస్తున్న సందేహాలకు త్వరలోనే తెరపడనుంది.
రఘురామకృష్ణకు టికెట్ కేటాయించాలని అభిమానులు ర్యాలీ - జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
నరసాపురం ఎంపీ రఘు రామ కృష్ణమ రాజుని ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్డీఏ కూటమి లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. త్వరలో కూటమి ఈమేర నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రఘురామకృష్ణరాజు ఎన్నికల బరిలో ఉండటం ఖాయమని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. రఘురామకృష్ణ రాజు కి సీటు ఇవ్వడంపై మూడు పార్టీలు చర్చిస్తున్నాయి. అయితే రఘురామకృష్ణరాజు అసెంబ్లీ అభ్యర్థిగానా, లేదా ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతారా అనే సందిగ్ధత కొనసాగుతోంది. ఇప్పటికే మూడు పార్టీలు దాదాపుగా అన్ని స్థానాలకు అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన తరుణంలో రఘురామకృష్ణంరాజుకు ప్రకటించిన అభ్యర్థులలో నుంచి సీటు సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దుర్మార్గ పాలన అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి: రఘురామకృష్ణ రాజు
టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల నేపథ్యంలో ఒకట్రెండు స్థానాల్లో మార్పుల దిశగా కూటమిలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ, టీడీపీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించగా జనసేన పార్టీకి సంబంధించి ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచి ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై నిరంతరం పోరాడుతున్న ఎంపీ రఘురామ రాజు ఎన్నికల బరిలో నిలవడం ఖాయమని తెలుస్తోంది. పోటీపై త్వరలోనే దీనిపై తుది నిర్ణయం వెలువడనుండగా చంద్రబాబు తనకు ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వరని రఘురామ ధీమా వ్యక్తం చేశారు.
జగన్ కొత్త హెలికాఫ్టర్లపై సీఈసీకి ఎంపీ రఘురామ ఫిర్యాదు - త్వరలో వైసీపీకి గుడ్‌బై
ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. జగన్‌ని వాళ్లు నమ్మరు అనేది తన ప్రగాఢ నమ్మకమని, కూటమి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నాయని వెల్లడించారు. జగన్‌పై పోరాటంలో తాను జైలు పాలైనా, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా చంద్రబాబు చేసిన సాయం తాను మరువలేనని చెప్పారు. అంత సాయం చేసిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు అన్యాయం చేస్తారని పేర్కొన్నారు. తన పదవి పోకుండా కాపాడిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు అన్యాయం చేస్తారనే ఆలోచన కూడా తనకు లేదని రఘురామ స్పష్టం చేశారు.
తాను పోటీ చేయాలన్న ఆలోచన తనకన్నా నియోజకవర్గ ప్రజలకే కాదు, రాష్ట్రంలో జగన్‌ని ద్వేషించే ప్రతి ఒక్కరిలోనూ ఉందని రఘురామ చెప్పారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో తనకు పరిచయాలు, సన్నిహిత సంబంధాలు లేవని చెప్తూ.. అందువల్లే అంతరం వచ్చి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. పోటీ చేయడం ఖాయమని త్వరలోనే ఆ విషయం వెల్లడిస్తానని తెలిపారు. కూటమి నూటికి నూరుశాతం నాకు న్యాయం చేస్తుందని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
ఓటర్లను ప్రలోభ పెడుతున్న వైఎస్సార్సీపీ నేతలు - ఈసీకి ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ