ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం - 1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్‌ సమావేశం - సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రి వర్గం

AP_CABINET_MEETING_DECISIONS
AP_CABINET_MEETING_DECISIONS (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2024, 4:45 PM IST

Updated : Nov 6, 2024, 9:42 PM IST

AP Cabinet Meeting Decisions:రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా డ్రోన్ పాలసీ 2024-29ను డ్రోన్ కార్పొరేషన్ రూపొందించింది. డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పించనున్నారు. రూ.3 వేల కోట్ల రాబడి లక్ష్యమని అన్నారు. అలాగే డేటా సెంటర్ పాలసీకి కేబినెట్‌ ఆమోదం తెలిపిందని ఏపీ సెమీ కండక్టర్ ఫ్యాబ్ పాలసీకి సైతం పచ్చజెండా ఊపామన్నారు.

ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్​గా రాష్ట్రం ఉండనుంది. డ్రోన్ హబ్​గా ఓర్వకల్లు ఉండనుంది. 300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్​ అండ్ డీ ఫెసిలిటీ ఏర్పాటు చేయనున్నారు. 25వేల మందికి డ్రోన్ పైలెట్లుగా శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 20 రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కేంద్రాలు, 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు చేయనున్నారు. డ్రోన్ రంగంలో ప‌రిశోధ‌న‌లు చేప‌ట్టే విద్యా సంస్థల‌కు 20 ల‌క్షల ప్రోత్సాహం ఇవ్వనున్నారు. అలానే మిగిలిన ఉద్యోగుల మాదిరిగానే న్యాయ అధికారుల ఉద్యోగ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం - 1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యం (ETV Bharat)

2014-18 మధ్య నీరు చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపులు, పనుల ప్రారంభానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు ప్రోహిబిషన్ 2024కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే సమయంలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు 1982 రిపీల్ బిల్లును కూడా ఆమోదించింది. ఏపీ జీఎస్టీ 2024, ఎక్స్రైజ్​ చట్ట సవరణల ముసాయిదాకు ఆమోదం తెలిపింది. కుప్పం కేంద్రంగా కుప్పం ఏరియా డెవలప్​మెంట్ అథారిటీలో ఆర్ధికాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆమోదించింది.

అమిత్ షాతో పవన్ కల్యాణ్ కీలక సమావేశం - ఏం చర్చించారంటే?

అమరావతికి ఊపిరి:కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ ఊపిరిపోసుకున్న అమరావతికి మరింత దన్నుగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో సీఆర్డీఏ పరిధి విస్తరించి ఉన్న 8,352 చదరపు కిలోమీటర్లను యథాతథంగా పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. అమరావతిని నిర్వీర్యం చేసే ఉద్దేశంతో జగన్‌ సర్కార్‌ సీఆర్డీఏ పరిధిని కుదించింది. అమరావతి ఔటర్ రింగు రోడ్డును అన్ని జాతీయ రహదార్లకు అనుసంధానించేలా 1059 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 154 గ్రామాలను తిరిగి సీఆర్డీఏలో కలుపుతూ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

  • పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
  • సీఆర్డీఏ పరిధిని 8,352 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ కేబినెట్ ఆమోదం
  • పల్నాడు, బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీల నుంచి 11 మండలాల్లోని 154 గ్రామాలను సీఆర్డీఏ పరిధిలోకి తెస్తూ ఆమోదం
  • రాష్ట్రంలో జ్యూడిషియల్ అధికారుల ఉద్యోగ విరమణ వయస్సును 61కి పెంచుతూ ఆమోదం
  • 2024 నవంబరు 1 తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా చట్ట సవరణ బిల్లుకు ఆమోదం

రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన మద్యం సరఫరా - ఏమైందంటే !

"అతి మంచితనం చేతకానితనం కాకూడదు - అధికారుల హ్యాంగోవర్ వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు"

Last Updated : Nov 6, 2024, 9:42 PM IST

ABOUT THE AUTHOR

...view details