ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

LIVE UPDATES: వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా గల్లంతు - ప్రభుత్వ ఏర్పాటు - ప్రమాణ స్వీకారంపై చంద్రబాబు, పవన్‌ చర్చలు - AP ELECTION RESULTS 2024 - AP ELECTION RESULTS 2024

AP ELECTION RESULTS 2024 Live Updates
AP ELECTION RESULTS 2024 Live Updates (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 4, 2024, 6:31 AM IST

Updated : Jun 4, 2024, 8:00 PM IST

AP ELECTION RESULTS 2024 Live Updates:ఏపీలో గత ఐదు సంవత్సరాలుగా సాగించిన అరాచక పాలనకు వైఎస్సార్సీపీ మూల్యం చెల్లించుకుంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సునామీ సృష్టించింది. 165కి స్థానాలతో ప్రభంజనం సృష్టించింది. వైనాట్ 175 అంటూ విర్రవీగిన వైఎస్సార్సీపీ బొక్కబోర్లా పడింది. మూడుపార్టీలు మూకుమ్మడిగా ఫ్యాన్‌ రెక్కలు విరిగ్గొట్టి పక్కన పడేశాయి. సింహం సింగిల్‌గా వస్తుందంటూ సవాళ్లు చేసిన జగన్‌కు, ఆయన పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా గల్లంతు చేశారు. పేదల ముసుగేసుకున్న పెత్తందారీ జగన్‌ను తరిమికొట్టారు.

LIVE FEED

7:57 PM, 4 Jun 2024 (IST)

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

  • చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

7:51 PM, 4 Jun 2024 (IST)

ఓటమిపై అనుమానం వ్యక్తం చేసిన తెదేపా అభ్యర్థి వీరభద్ర గౌడ్

  • కర్నూలు: రీకౌంటింగ్‌ జరపాలన్న ఆలూరు తెదేపా అభ్యర్థి వీరభద్రగౌడ్
  • ఓటమిపై అనుమానం వ్యక్తం చేసిన తెదేపా అభ్యర్థి వీరభద్ర గౌడ్
  • అనుమానం ఉన్న 5 రౌండ్ల వీవీ పాట్లు లెక్కిస్తున్న అధికారులు

7:31 PM, 4 Jun 2024 (IST)

చంద్రబాబు-పవన్‌ చర్చలు

  • మంగళగిరి: జనసేన పార్టీ కార్యాలయంలో చంద్రబాబు, పవన్‌ భేటీ
  • ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారంపై చంద్రబాబు, పవన్‌ చర్చలు
  • ఎన్డీయే సమావేశానికి హాజరయ్యే అంశంపైనా ఇరువురి మధ్య చర్చ

7:26 PM, 4 Jun 2024 (IST)

ఇరురాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దాం: తెలంగాణ సీఎం రేవంత్‌

  • చంద్రబాబు, పవన్‌కు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు
  • ఇరురాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దాం: తెలంగాణ సీఎం రేవంత్‌
  • సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు సాగుదాం: రేవంత్‌

7:24 PM, 4 Jun 2024 (IST)

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన జగన్‌

  • ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన జగన్‌
  • ఈసీ డిక్లరేషన్‌ అనంతరం గవర్నర్‌కు రాజీనామా లేఖను పంపనున్న జగన్‌

7:21 PM, 4 Jun 2024 (IST)

చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు అభినందనలు తెలిపిన కేటీఆర్‌

  • చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు అభినందనలు తెలిపిన కేటీఆర్‌
  • ఏపీలో ఘన విజయం సాధించినందుకు అభినందనలు: కేటీఆర్‌
  • ఏపీ ప్రజలకు విజయవంతంగా సేవలందించాలి: కేటీఆర్‌

7:18 PM, 4 Jun 2024 (IST)

వైకాపా ఓటమితో రాజీనామా చేసిన భూమన కరుణాకర్‌రెడ్డి

  • తితిదే ఛైర్మన్‌ పదవికి భూమన కరుణాకర్‌రెడ్డి రాజీనామా
  • గతేడాది ఆగస్టులో తితిదే ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన భూమన
  • వైకాపా ఓటమితో రాజీనామా చేసిన భూమన కరుణాకర్‌రెడ్డి

7:18 PM, 4 Jun 2024 (IST)

తెలుగుదేశం నాయకుడు వర్మకు ప్రత్యేక కృతజ్ఞతలు: పవన్‌

  • కదం తొక్కిన జనసైనికులకు పేరుపేరునా కృతజ్ఞతలు: పవన్‌
  • తెలుగుదేశం నాయకుడు వర్మకు ప్రత్యేక కృతజ్ఞతలు: పవన్‌
  • ప్రజలు ఆకాశమంత విజయమిచ్చారు: పవన్‌కల్యాణ్‌
  • ప్రజలు ఇచ్చిన విజయాన్ని గుండెల్లో పెట్టుకుంటాం: పవన్‌
  • కష్టాల్లో మీ ఇంట్లో ఒకడిగా ఉంటా: పవన్‌కల్యాణ్‌
  • ప్రభుత్వం ఎలా ఉండాలో చేసి చూపిస్తాం: పవన్‌కల్యాణ్‌

7:12 PM, 4 Jun 2024 (IST)

వైకాపా నేతలు మాకు వ్యక్తిగత శత్రువులు కాదు: పవన్‌

  • 2019లో ఓడినప్పుడు నా మానసిక పరిస్థితి ఎలా ఉందో.. ఇప్పుడూ అలానే ఉంది: పవన్‌
  • గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది.. అహంకారం కాదు: పవన్‌కల్యాణ్‌
  • ఇల్లు అలకగానే పండగ కాదని నాకు తెలుసు: పవన్‌కల్యాణ్‌
  • ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం: పవన్‌
  • ఇది ఎంతో చరిత్రాత్మకమైన రోజు: పవన్‌కల్యాణ్‌
  • ఐదు కోట్లమంది ప్రజల కోసం పనిచేస్తాం: పవన్‌
  • వైకాపా నేతలు మాకు వ్యక్తిగత శత్రువులు కాదు: పవన్‌
  • వైకాపాపై కక్ష సాధింపులు ఉండవు: పవన్‌కల్యాణ్‌
  • రాష్ట్ర భవిష్యత్తుకు పునాది వేసే సమయమిది: పవన్
  • సీపీఎస్‌ అంశంపై ఉద్యోగులకు న్యాయం చేస్తాం: పవన్‌
  • మెగా డీఎస్సీ విడుదల చేసే బాధ్యత నేను తీసుకుంటా: పవన్‌
  • ఉద్యోగాలు లేక యువత విలవిల్లాడుతున్నారు: పవన్‌కల్యాణ్‌
  • ప్రజలు నాకు పెద్ద బాధ్యత ఇచ్చారు: పవన్‌కల్యాణ్‌
  • నూటికి నూరుశాతం స్థానాల్లో గెలిచాం: పవన్‌కల్యాణ్‌
  • పోటీచేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించాం: పవన్‌
  • వైకాపావాళ్లు అరాచకం చేశారు: పవన్‌కల్యాణ్‌
  • శాంతిభద్రతలు బలంగా ఉంటాయని మాట ఇస్తున్నా: పవన్‌
  • కూటమి ప్రభుత్వం రైతులను అక్కున చేర్చుకుంటుంది: పవన్‌
  • నాకు రాజకీయాల్లో డబ్బులు అవసరం లేదు: పవన్‌కల్యాణ్‌
  • డబ్బు కోసమో, పేరు కోసమో రాజకీయాల్లోకి రాలేదు: పవన్‌
  • సగటు మనిషి కష్టాలు చూసినవాణ్ని: పవన్‌కల్యాణ్‌

7:11 PM, 4 Jun 2024 (IST)

ఎన్డీయే ఘన విజయం

  • నరసాపురం లోక్‌సభ భాజపా అభ్యర్థి శ్రీనివాసవర్మ 2.76 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం
  • శ్రీకాకుళం లోక్‌సభ తెదేపా అభ్యర్థి రామ్మోహన్‌ 3.07 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం
  • అనకాపల్లి లోక్‌సభ భాజపా అభ్యర్థి సి.ఎం.రమేష్‌ విజయం
  • గుంటూరు లోక్‌సభ తెదేపా అభ్యర్థి పెమ్మసాని విజయం
  • హిందూపురం లోక్‌సభ తెదేపా అభ్యర్థి పార్థసారథి విజయం
  • కడప లోక్‌సభ వైకాపా అభ్యర్థి అవినాష్‌రెడ్డి 69,050 ఓట్ల ఆధిక్యంతో విజయం
  • నెల్లూరు లోక్‌సభ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి విజయం
  • విజయవాడ లోక్‌సభ తెదేపా అభ్యర్థి కేశినేని చిన్ని విజయం
  • మచిలీపట్నం లోక్‌సభ జనసేన అభ్యర్థి బాలశౌరి విజయం
  • విశాఖ లోక్‌సభ తెదేపా అభ్యర్థి శ్రీభరత్‌ విజయం
  • అమలాపురం లోక్‌సభ తెదేపా అభ్యర్థి గంటి హరీష్‌ విజయం
  • బాపట్ల లోక్‌సభ తెదేపా అభ్యర్థి కృష్ణప్రసాద్‌ విజయం
  • నరసరావుపేట లోక్‌సభ తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు విజయం
  • విజయనగరం లోక్‌సభ తెదేపా అభ్యర్థి అప్పలనాయుడు విజయం

6:08 PM, 4 Jun 2024 (IST)

అక్కచెల్లెమ్మల ఓట్లు ఎటు పోయాయో అర్థం కావడం లేదు: జగన్‌

  • ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి: జగన్‌
  • ఇలాంటి ఫలితాలు ఊహించలేదు: జగన్‌
  • అక్కచెల్లెమ్మల ఓట్లు ఎటు పోయాయో అర్థం కావడం లేదు: జగన్‌
  • పింఛన్లు అందుకున్న అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో అర్థం కావడం లేదు: జగన్‌
  • ఎన్నో పథకాలతో ప్రజలకు అండగా ఉన్నా: జగన్‌
  • పథకాలు అందుకున్న వారి ఆప్యాయత ఏమైందో తెలియదు: జగన్‌
  • ప్రజలకు మంచి చేసినా ఓటమి పాలయ్యాం: జగన్‌
  • 54 లక్షలమంది రైతులకు పెట్టుబడి సాయం చేశాం: జగన్‌
  • రైతన్నలను అన్నిరకాలుగా ఆదుకున్నాం: జగన్‌
  • అరకోటి రైతన్నల ప్రేమ ఏమైందో అర్థం కావడం లేదు: జగన్‌
  • ఆటో డ్రైవర్లు, గీత కార్మికులు, మత్స్యకారులకు అండగా ఉన్నా: జగన్‌
  • వారందరి ప్రేమ ఏమైందో అర్థం కావడం లేదు: జగన్‌
  • ఇన్ని కోట్ల మందికి ఎంతో మేలు చేసినా ఓడిపోయాం: జగన్‌
  • మ్యానిఫెస్టో హామీలను 99 శాతం అమలు చేశాం: జగన్‌
  • పేదపిల్లల చదువుల కోసం ఎంతో సాయం చేశాం: జగన్‌
  • గ్రామాల్లో ఎన్నడూ చూడని సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశాం: జగన్‌

6:00 PM, 4 Jun 2024 (IST)

అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్‌ రేట్‌తో జనసేన అద్భుత ప్రదర్శన

  • రాష్ట్రంలో 10 స్థానాల్లో పోటీచేసి 8 చోట్ల గెలిచిన భాజపా
  • అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అఖండ విజయం
  • పోటీచేసిన 21 స్థానాల్లోనూ జనసేన జయభేరి
  • అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్‌ రేట్‌తో జనసేన అద్భుత ప్రదర్శన

5:42 PM, 4 Jun 2024 (IST)

చంద్రబాబు రేపు దిల్లీ వెళ్లే అవకాశం

  • చంద్రబాబు రేపు దిల్లీ వెళ్లే అవకాశం
  • ఎన్డీయే భేటీలో రేపు చంద్రబాబు పాల్గొనే అవకాశం

5:37 PM, 4 Jun 2024 (IST)

పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు

  • పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు
  • అభిమానుల జయజయధ్వానాలతో కోలాహలంగా ఎన్టీఆర్‌ భవన్‌

5:21 PM, 4 Jun 2024 (IST)

ఎన్డీయే ఘన విజయం

  • కడప లోక్‌సభ వైకాపా అభ్యర్థి అవినాష్‌రెడ్డి 69,050 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం
  • నరసాపురం లోక్‌సభ భాజపా అభ్యర్థి శ్రీనివాసవర్మ 2.76 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం
  • శ్రీకాకుళం లోక్‌సభ తెదేపా అభ్యర్థి రామ్మోహన్‌నాయుడు 3.07 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం
  • రాయచోటిలో తెదేపా అభ్యర్థి రాంప్రసాద్‌రెడ్డి 2,471 ఓట్ల ఆధిక్యంతో గెలుపు
  • గురజాలలో తెదేపా అభ్యర్థి యరపతినేని 29,100 ఓట్ల ఆధిక్యంతో విజయం
  • పాతపట్నం తెదేపా అభ్యర్థి మామిడి గోవిందరావు 24,350 ఓట్ల ఆధిక్యంతో విజయం
  • ఒంగోలు తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్ 34,100 ఓట్ల మెజార్టీతో విజయం

5:13 PM, 4 Jun 2024 (IST)

9 ఉమ్మడి జిల్లాల్లో ఖాతా తెరవని వైకాపా

  • హలో ఏపీ.. బైబై వైసీపీ అంటున్న ఓటరు తీర్పు
  • జిల్లాలకు జిల్లాలే స్వీప్‌ చేసిన కూటమి
  • సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతున్న వైకాపా స్కోరు
  • 9 ఉమ్మడి జిల్లాల్లో వైకాపా డకౌట్‌
  • 9 ఉమ్మడి జిల్లాల్లో ఖాతా తెరవని వైకాపా
  • విజయనగరం, శ్రీకాకుళం, ఉమ్మడి గోదావరి జిల్లాలను స్వీప్‌ చేసిన కూటమి
  • కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాలను స్వీప్‌ చేసిన కూటమి
  • జగన్‌, పెద్దిరెడ్డి మినహా ఓడిన మంత్రులు, మాజీ మంత్రులు

5:05 PM, 4 Jun 2024 (IST)

సీల్‌ లేకుండా వచ్చిన 4 బూత్‌లోని ఈవీఎంలు

  • చిత్తూరు: పుంగనూరులో ఆగిన ఓట్ల లెక్కింపు
  • ఇప్పటివరకు పూర్తయిన 17 రౌండ్ల కౌంటింగ్‌
  • ఇంకా లెక్కించాల్సి ఉన్న 32 వేల ఓట్లు
  • ఈవీఎంలకు సీల్‌ లేకుండా రావడంతో తెదేపా అభ్యర్థి అభ్యంతరం
  • సీల్‌ లేకుండా వచ్చిన 4 బూత్‌లోని ఈవీఎంలు

5:04 PM, 4 Jun 2024 (IST)

గన్నవరం నుంచి కుటుంబంతో హైదరాబాద్ బయలుదేరిన వంశీ

  • గన్నవరం వీడిన వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ
  • గన్నవరం నుంచి కుటుంబంతో హైదరాబాద్ బయలుదేరిన వంశీ

4:56 PM, 4 Jun 2024 (IST)

పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు బయలుదేరిన చంద్రబాబు

  • అభిమానుల కోలాహలం మధ్య ఉండవల్లి నుంచి బయలుదేరిన చంద్రబాబు
  • పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు బయలుదేరిన చంద్రబాబు
  • చంద్రబాబు రాక కోసం నేతలు, కార్యకర్తలు, అభిమానుల నిరీక్షణ

4:41 PM, 4 Jun 2024 (IST)

పవన్‌ను చూస్తుంటే అన్నయ్యగా గర్వంగా ఉంది: చిరంజీవి

  • పవన్ కల్యాణ్‌కు అభినందనలు తెలిపిన చిరంజీవి
  • పవన్‌ను చూస్తుంటే అన్నయ్యగా గర్వంగా ఉంది: చిరంజీవి
  • ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి.. పవన్‌: చిరంజీవి
  • తాను తగ్గినా ప్రజలను నెగ్గించేందుకే అని పవన్‌ నిరూపించారు: చిరంజీవి
  • పవన్‌ గేమ్ ఛేంజర్ మాత్రమే కాదు.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ అంటున్నారు: చిరంజీవి
  • పవన్‌ను అందరూ పొగుడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది: చిరంజీవి
  • పవన్‌ కృషి, త్యాగం, ధ్యేయం, సత్యం.. జనం కోసమే..: చిరంజీవి
  • నీ లక్ష్యాలను నిజం చేసే దిశలో ఈ ప్రజా తీర్పు నిన్ను నడిపిస్తోంది: చిరంజీవి
  • నువ్వు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలి: చిరంజీవి

4:41 PM, 4 Jun 2024 (IST)

మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి బయల్దేరిన పవన్‌

  • గన్నవరం విమానాశ్రయం చేరుకున్న పవన్‌కల్యాణ్‌
  • హైదరాబాద్‌ నుంచి విజయవాడ చేరుకున్న పవన్‌కల్యాణ్‌
  • మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి బయల్దేరిన పవన్‌

4:40 PM, 4 Jun 2024 (IST)

అవినాష్‌రెడ్డి విజయం

  • కడప లోక్‌సభ వైకాపా అభ్యర్థి అవినాష్‌రెడ్డి 60 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం

4:24 PM, 4 Jun 2024 (IST)

ఆధిక్యం దిశగా నారా లోకేష్‌

  • మంగళగిరిలో భారీ ఆధిక్యం దిశగా నారా లోకేష్‌
  • 15 రౌండ్లు ముగిసేసరికి 70 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో నారా లోకేష్‌

4:24 PM, 4 Jun 2024 (IST)

ఎన్డీయే అభ్యర్థుల ఘన విజయం

  • పెనుకొండలో తెదేపా అభ్యర్థి సవిత 33,629 ఓట్ల ఆధిక్యంతో విజయం
  • జమ్మలమడుగులో భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి గెలుపు
  • పూతలపట్టులో తెదేపా అభ్యర్థి మురళీమోహన్‌ 14,948 ఓట్ల ఆధిక్యంతో విజయం
  • ఆళ్లగడ్డలో తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియ విజయం

4:04 PM, 4 Jun 2024 (IST)

ఎన్డీయే ఘన విజయం

  • ఎలమంచిలిలో జనసేన అభ్యర్థి విజయ్‌కుమార్‌ విజయం
  • గజపతినగరంలో తెదేపా అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు 24,302 ఓట్ల ఆధిక్యంతో గెలుపు
  • కడపలో తెదేపా అభ్యర్థి మాధవిరెడ్డి 22,852 ఓట్ల ఆధిక్యంతో విజయం

3:58 PM, 4 Jun 2024 (IST)

బాలకృష్ణ హ్యాట్రిక్‌ విజయం

  • హిందూపురం నుంచి బాలకృష్ణ హ్యాట్రిక్‌ విజయం
  • తణుకులో తెదేపా అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ 71 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం
  • తాడిపత్రిలో తెదేపా అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి 29 వేల ఓట్లతో విజయం
  • బొబ్బిలి తెదేపా అభ్యర్థి బేబీనాయన 45,200 ఓట్ల ఆధిక్యంతో విజయం
  • ఉంగుటూరులో జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు 44,107 ఓట్ల మెజారిటీతో గెలుపు
  • నరసాపురంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయికర్‌ 49,738 మెజారిటీతో విజయం
  • మాచర్లలో తెదేపా అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి 32,324 ఓట్ల తేడాతో విజయం

3:42 PM, 4 Jun 2024 (IST)

మీ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి: సీఎం స్టాలిన్‌

  • చంద్రబాబుకు తమిళనాడు సీఎం స్టాలిన్‌ శుభాకాంక్షలు
  • అఖండ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు: స్టాలిన్‌
  • మీ నాయకత్వంలో ఏపీ ప్రగతిపథంలో పయనించాలి: స్టాలిన్‌
  • మీ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి: సీఎం స్టాలిన్‌

3:41 PM, 4 Jun 2024 (IST)

తణుకులో మంత్రి కారుమూరిపై గెలిచిన ఆరిమిల్లి రాధాకృష్ణ

  • తణుకులో తెదేపా చరిత్రలో అత్యధిక మెజారిటీ 71వేల ఓట్లు
  • తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దారుణ ఓటమి
  • తణుకులో మంత్రి కారుమూరిపై గెలిచిన ఆరిమిల్లి రాధాకృష్ణ

2:58 PM, 4 Jun 2024 (IST)

39 ఏళ్ల తర్వాత మంగళగిరిలో విజయం దిశగా తెలుగుదేశం

  • మంగళగిరిలో భారీ ఆధిక్యం దిశగా నారా లోకేష్
  • 39 ఏళ్ల తర్వాత మంగళగిరిలో విజయం దిశగా తెలుగుదేశం
  • 1985లో తెదేపా తరఫున మంగళగిరిలో గెలిచిన కోటేశ్వరరావు
  • 12వ రౌండ్ ముగిసేసరికి లోకేష్‌కు 51 వేలకు పైగా ఓట్ల మెజార్టీ
  • ఇంకా లెక్కించాల్సి ఉన్న 10 రౌండ్ల ఓట్లు
  • ఇప్పటివరకు మంగళగిరిలో అత్యధిక మెజారిటీ 17,265 ఓట్లు
  • సీపీఐ అభ్యర్థి పేరిట నమోదైన మంగళగిరి అత్యధిక మెజార్టీ
  • పాత మెజార్టీ రికార్డుల్ని తిరగరాస్తున్న లోకేష్

2:51 PM, 4 Jun 2024 (IST)

ఎన్డీయే అభ్యర్థుల ఘన విజయం

  • గంగాధరనెల్లూరు అసెంబ్లీలో తెదేపా అభ్యర్థి థామస్‌ విజయం
  • శ్రీకాకుళం అసెంబ్లీలో తెదేపా అభ్యర్థి గొండు శంకర్‌ విజయం
  • ఆమదాలవలస అసెంబ్లీలో తెదేపా అభ్యర్థి కూన రవికుమార్‌ విజయం
  • తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ విజయం
  • చిలకలూరిపేటలో తెదేపా అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు విజయం

2:45 PM, 4 Jun 2024 (IST)

పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌ 69,169 ఓట్ల ఆధిక్యంతో విజయం

  • పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌ 69,169 ఓట్ల ఆధిక్యంతో విజయం
  • మాచర్లలో తెదేపా అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి విజయం
  • హలో ఏపీ.. బైబై వైసీపీ అంటున్న ఓటరు తీర్పు
  • జిల్లాలకు జిల్లాలే స్వీప్‌ చేసిన కూటమి
  • 8 ఉమ్మడి జిల్లాల్లో వైకాపా డకౌట్‌
  • 8 ఉమ్మడి జిల్లాల్లో ఖాతా తెరవని వైకాపా
  • విజయనగరం, శ్రీకాకుళం, ఉమ్మడి గోదావరి జిల్లాలను స్వీప్‌ చేసిన కూటమి
  • కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను స్వీప్‌ చేసిన కూటమి

2:43 PM, 4 Jun 2024 (IST)

పాలకొల్లులో తెదేపా అభ్యర్థి నిమ్మల 69 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం

  • రాజానగరంలో జనసేన అభ్యర్థి బత్తుల రామకృష్ణ 34,049 ఓట్ల ఆధిక్యంతో విజయం
  • మైదుకూరులో తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ 20,937 ఓట్ల ఆధిక్యంతో విజయం
  • తాడేపల్లిగూడెంలో 66,039 ఓట్లతో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ విజయం
  • పాలకొల్లులో తెదేపా అభ్యర్థి నిమ్మల 69 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం
  • పార్వతీపురంలో తెదేపా అభ్యర్థి బోనెల విజయ్‌ 23,650 ఓట్ల ఆధిక్యంతో విజయం
  • బాపట్లలో తెదేపా అభ్యర్థి వేగేశ్న నరేంద్రవర్మ 26,800 ఓట్ల ఆధిక్యంతో విజయం
  • ఉండిలో తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణరాజు 56,777 ఓట్ల ఆధిక్యంతో విజయం
  • రాజమండ్రి గ్రామీణంలో బుచ్చయ్యచౌదరి 64,090 ఓట్ల ఆధిక్యంతో విజయం
  • డోన్‌ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి 6450 ఓట్ల ఆధిక్యంతో విజయం

1:45 PM, 4 Jun 2024 (IST)

ప్రధాని మోదీ, అమిత్ షాకు ఫోన్ చేసిన చంద్రబాబు

  • ప్రధాని మోదీ, అమిత్ షాకు ఫోన్ చేసిన చంద్రబాబు
  • మోదీ, అమిత్‌షాకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
  • చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, అమిత్‌షా
  • ఏపీలో కూటమి ఘన విజయంపై మోదీ, అమిత్‌షా అభినందనలు

1:34 PM, 4 Jun 2024 (IST)

మంగళగిరిలో విజయం దిశగా నారా లోకేశ్

  • రాజమండ్రి గ్రామీణంలో బుచ్చయ్యచౌదరి ఘనవిజయం
  • రాజమహేంద్రవరం నగరంలో తెదేపా అభ్యర్థి ఆదిరెడ్డి వాసు విజయం
  • కొవ్వూరులో తెదేపా అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం
  • గాజువాకలో తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విజయం
  • పాలకొల్లులో తెదేపా అభ్యర్థి నిమ్మల 69 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం
  • అనపర్తిలో భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం
  • ఉరవకొండలో తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ విజయం
  • ప్రొద్దుటూరులో తెదేపా అభ్యర్థి వరదరాజుల రెడ్డి విజయం
  • ప్రత్తిపాడులో తెదేపా అభ్యర్థి సత్యప్రభ విజయం
  • రాజానగరంలో జనసేన అభ్యర్థి బత్తుల రామకృష్ణ విజయం
  • తణుకులో తెదేపా అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ విజయం
  • చింతలపూడిలో తెదేపా అభ్యర్థి రోషన్‌ కుమార్‌ విజయం
  • భీమవరంలో జనసేన అభ్యర్థి రామాంజనేయులు విజయం
  • ఆచంటలో తెదేపా అభ్యర్థి పితాని సత్యనారాయణ విజయం
  • పార్వతీపురంలో తెదేపా అభ్యర్థి బోనెల విజయ్‌ విజయం

12:49 PM, 4 Jun 2024 (IST)

విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థులు

  • రాజమండ్రి గ్రామీణంలో తెదేపా అభ్యర్థి బుచ్చయ్యచౌదరి ఘనవిజయం
  • రాజమహేంద్రవరం నగరంలో తెదేపా అభ్యర్థి ఆదిరెడ్డి వాసు విజయం
  • కొవ్వూరులో తెదేపా అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం
  • గాజువాకలో తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విజయం
  • పాలకొల్లులో తెదేపా అభ్యర్థి నిమ్మల రామానాయుడు విజయం
  • అనపర్తిలో భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం

12:44 PM, 4 Jun 2024 (IST)

ఆధిక్యంలో ఎన్డీయో అభ్యర్థులు

  • శ్రీకాకుళం లోక్‌సభ తెదేపా అభ్యర్థి రామ్మోహన్‌నాయుడుకు
  • 1,43,700 ఓట్ల ఆధిక్యం
  • ఒంగోలు లోక్‌సభ తెదేపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డికి 10,115 ఓట్ల ఆధిక్యం
  • విజయవాడ లోక్‌సభ స్థానంలో లక్షకు పైగా మెజారిటీలో కేశినేని చిన్ని
  • మాచర్లలో 13 రౌండ్లు ముగిసేసరికి తెదేపా అభ్యర్థి బ్రహ్మారెడ్డికి 23,407 ఓట్ల ఆధిక్యం
  • నరసరావుపేట లోక్‌సభ తెదేపా అభ్యర్థి లావు కృష్ణదేవరాయలుకు 53,092 ఓట్ల ఆధిక్యం
  • ప్రత్తిపాడులో 9 రౌండ్లు ముగిసేసరికి తెదేపా అభ్యర్థి రామాంజనేయులుకు 23,502 ఓట్ల ఆధిక్యం
  • తెనాలిలో 11 రౌండ్లు ముగిసేసరికి నాదెండ్ల మనోహర్‌కు 29,621 ఓట్ల ఆధిక్యం

12:43 PM, 4 Jun 2024 (IST)

భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం

  • అనపర్తిలో భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం
  • రాజమండ్రి గ్రామీణంలో బుచ్చయ్యచౌదరి ఘనవిజయం
  • రాజమహేంద్రవరం నగరంలో తెదేపా అభ్యర్థి ఆదిరెడ్డి వాసు విజయం

12:33 PM, 4 Jun 2024 (IST)

ఆధిక్యంలో ఎన్డీయో అభ్యర్థులు

  • బాపట్ల లోక్‌సభ తెదేపా అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్‌కు 31,973 ఓట్ల ఆధిక్యం
  • మార్కాపురంలో తెదేపా అభ్యర్థి నారాయణరెడ్డికి 10,300 ఓట్ల ఆధిక్యం
  • పెదకూరపాడులో తెదేపా అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌కు 9 రౌండ్లలో 9100 ఓట్ల ఆధిక్యం
  • సంతనూతలపాడులో 11 రౌండ్లలో తెదేపా అభ్యర్థి విజయ్‌కుమార్‌కు 17,800 ఓట్ల ఆధిక్యం
  • ఒంగోలు లోక్‌సభ తెదేపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డికి 7,983 ఓట్ల ఆధిక్యం
  • నరసరావుపేట లోక్‌సభ తెదేపా అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలుకు 52,182 ఓట్ల ఆధిక్యం
  • మాచర్లలో 10 రౌండ్లలో తెదేపా అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డికి 19,242 ఓట్ల ఆధిక్యం
  • బాపట్లలో 11 రౌండ్లలో తెదేపా అభ్యర్థి నరేంద్ర వర్మకు 20,644 ఓట్ల ఆధిక్యం
  • వినుకొండలో 6 రౌండ్లలో తెదేపా అభ్యర్థి జీవీ ఆంజనేయులు 4304 ఓట్ల ఆధిక్యం
  • విజయవాడ పశ్చిమలో 5 రౌండ్లలో భాజపా అభ్యర్థి సుజనాచౌదరికి 11,212 ఓట్ల ఆధిక్యం

12:12 PM, 4 Jun 2024 (IST)

ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఖాతా తెరవని వైకాపా

  • హలో ఏపీ.. బైబై వైసీపీ అంటున్న ఓటరు తీర్పు
  • ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఖాతా తెరవని వైకాపా
  • ఉమ్మడి గోదావరి, విజయనగరం, కృష్ణా, కర్నూలు జిల్లాలను స్వీప్‌ చేసిన కూటమి
  • కౌంటింగ్‌ కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్న వైకాపా అభ్యర్థులు
  • విజయం దిశగా చంద్రబాబు, పవన్‌, బాలకృష్ణ, లోకేష్‌
  • నరసరావుపేట లోక్‌సభ తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుకు 44,980 ఓట్ల ఆధిక్యం

12:11 PM, 4 Jun 2024 (IST)

సుజనాచౌదరికి 11,212 ఓట్ల ఆధిక్యం

  • బాపట్లలో 11 రౌండ్లలో తెదేపా అభ్యర్థి నరేంద్ర వర్మకు 20,644 ఓట్ల ఆధిక్యం
  • వినుకొండలో 6 రౌండ్లలో తెదేపా అభ్యర్థి జీవీ ఆంజనేయులు 4304 ఓట్ల ఆధిక్యం
  • విజయవాడ పశ్చిమలో 5 రౌండ్లలో భాజపా అభ్యర్థి సుజనాచౌదరికి 11,212 ఓట్ల ఆధిక్యం

11:58 AM, 4 Jun 2024 (IST)

తెదేపా అభ్యర్థి ఆదిరెడ్డి వాసు విజయం

  • కుప్పంలో చంద్రబాబుకు 5 రౌండ్లు ముగిసేసరికి 9,088 ఓట్ల ఆధిక్యం
  • రాజమహేంద్రవరం నగరంలో తెదేపా అభ్యర్థి ఆదిరెడ్డి వాసు విజయం
  • 55 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన ఆదిరెడ్డి వాసు

11:51 AM, 4 Jun 2024 (IST)

నగరిలో మంత్రి రోజా వెనుకంజ

  • భీమవరంలో 9 రౌండ్లలో జనసేన అభ్యర్థి పులపర్తికి 38వేల ఓట్ల ఆధిక్యం
  • విజయవాడ సెంట్రల్‌లో 5 రౌండ్లలో తెదేపా అభ్యర్థి బోండా ఉమాకు 16,115ఓట్ల ఆధిక్యం
  • ఉండిలో 7 రౌండ్లలో తెదేపా అభ్యర్థి రఘురామకు 23,090 ఓట్ల ఆధిక్యం
  • పెదకూరపాడులో తెదేపా అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌కు 5 రౌండ్లలో 957 ఓట్ల ఆధిక్యం
  • విజయనగరం అసెంబ్లీలో 5 రౌండ్లలో తెదేపా అభ్యర్థి అదితికి 15,518 ఓట్ల ఆధిక్యం
  • నగరిలో మంత్రి రోజా వెనుకంజ
  • నగరిలో 5 రౌండ్లలో 15,218 ఓట్ల ఆధిక్యంలో గాలి భానుప్రకాశ్‌
  • విజయనగరం కూటమి ఎంపీ అభ్యర్థి అప్పలనాయుడుకు 45,006 ఓట్ల ఆధిక్యం
  • తాడికొండలో నాలుగో రౌండ్‌లో తెదేపా అభ్యర్థి శ్రావణ్‌కు 22 వేల ఓట్ల ఆధిక్యం
  • బాపట్లలో తొమ్మిదో రౌండ్‌ ముగిసేసరికి తెదేపా అభ్యర్థి నరేంద్ర వర్మకు 16,397ఓట్ల ఆధిక్యత
  • తెనాలిలో ఏడో రౌండ్‌లో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కు 20,240 ఓట్ల ఆధిక్యం
  • సత్తెనపల్లిలో ఎనిమిదో రౌండ్‌లో తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు 16,417 ఓట్ల ఆధిక్యం
  • పొన్నూరులో ఆరో రౌండ్‌లో తెదేపా అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకు 12,205 ఓట్ల ఆధిక్యం
  • మాచర్లలో ఎనిమిదో రౌండ్‌లో తెదేపా అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డికి 18,737 ఓట్ల ఆధిక్యం

11:51 AM, 4 Jun 2024 (IST)

వెలవెలబోయిన తాడేపల్లి ప్యాలెస్‌

  • ఎన్నికల ఫలితాలతో వెలవెలబోయిన తాడేపల్లి ప్యాలెస్‌
  • జగన్‌ అరాచక పాలనకు ఓటుతో బుద్ధి చెప్పిన ఆంధ్రా ఓటర్లు
  • భారీ ఆధిక్యాలతో దూసుకెళ్తున్న కూటమి అభ్యర్థులు
  • అణచిపెట్టుకున్న ఆక్రోశాన్ని ఓటుతో వెల్లడించిన ఓటర్లు
  • జగన్‌ నియంతృత్వ ధోరణికి ఓటుతో అడ్డుకట్ట వేసిన ఓటర్లు
  • జగన్‌ నిరంకుశ పాలనకు ఓటుతో చరమగీతం పాడిన ఆంధ్రులు
  • జగన్‌ రివర్స్‌ పాలనకు ఓటుతో రీకాల్‌ చేసిన ఆంధ్రా ప్రజలు
  • జగన్‌ విధ్వంస పాలనను ఓటుతో అంతం చేసిన ఆంధ్రులు

11:40 AM, 4 Jun 2024 (IST)

తెదేపాకు తొలి విజయం

  • అసెంబ్లీ ఫలితాల్లో తెదేపాకు తొలి విజయం
  • రాజమండ్రి గ్రామీణంలో బుచ్చయ్యచౌదరి ఘనవిజయం
  • 50 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో బుచ్చయ్యచౌదరి
  • మరింత పెరగనున్న బుచ్చయ్యచౌదరి మెజారిటీ

11:39 AM, 4 Jun 2024 (IST)

వైకాపాకు ప్రతిపక్ష హోదా దక్కడంపై అనుమానం

  • తాడికొండలో నాలుగో రౌండ్‌లో తెదేపా అభ్యర్థి శ్రావణ్‌కు 22 వేల ఓట్ల ఆధిక్యం
  • బాపట్లలో తొమ్మిదో రౌండ్‌ ముగిసేసరికి తెదేపా అభ్యర్థి నరేంద్ర వర్మకు 16,397ఓట్ల ఆధిక్యత
  • తెనాలిలో ఏడో రౌండ్‌లో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కు 20,240 ఓట్ల ఆధిక్యం
  • సత్తెనపల్లిలో ఎనిమిదో రౌండ్‌లో తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు 16,417 ఓట్ల ఆధిక్యం
  • పొన్నూరులో ఆరో రౌండ్‌లో తెదేపా అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకు 12,205 ఓట్ల ఆధిక్యం
  • మాచర్లలో ఎనిమిదో రౌండ్‌లో తెదేపా అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డికి 18,737 ఓట్ల ఆధిక్యం
  • మంగళగిరి నాలుగో రౌండ్‌లో 15,114 ఓట్ల ఆధిక్యంలో నారా లోకేష్
  • వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా దక్కడంపై అనుమానమే?
  • ప్రతిపక్ష హోదాకు కావాల్సిన స్థానాలు - 18
  • 18 కంటే తక్కువ స్థానాల్లో ఆధిక్యంలో వైకాపా

11:24 AM, 4 Jun 2024 (IST)

లోకేష్‌కు 15,114 ఓట్ల ఆధిక్యం

  • కుప్పంలో మూడో రౌండ్‌ ముగిసేసరికి చంద్రబాబుకు 4,683 ఓట్ల ఆధిక్యం
  • మంగళగిరిలో నాలుగో రౌండ్‌ పూర్తయ్యేసరికి లోకేష్‌కు 15,114 ఓట్ల ఆధిక్యం
  • విజయనగరం లోక్‌సభ తెదేపా అభ్యర్థి అప్పలనాయుడికి 35,116 ఓట్ల ఆధిక్యం
  • రాజమండ్రి గ్రామీణంలో బుచ్చయ్యచౌదరికి 50 వేలకు పైగా ఓట్ల మెజారిటీ
  • 15 రౌండ్లు పూర్తయ్యేసరికి బుచ్చయ్యకు 50,958 ఓట్ల ఆధిక్యం

10:52 AM, 4 Jun 2024 (IST)

విజయం దిశగా చంద్రబాబు, పవన్‌, బాలకృష్ణ, లోకేశ్

విజయం దిశగా చంద్రబాబు, పవన్‌, బాలకృష్ణ, లోకేశ్

10:44 AM, 4 Jun 2024 (IST)

ఓటమి బాటలో మంత్రులు

  • ఓటమి బాటలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు
  • ఓటమి బాటలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, అంజాద్‌ బాషా
  • ఓటమి బాటలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా
  • ఓటమి బాటలో మంత్రులు ఉష శ్రీచరణ్‌, పీడిక రాజన్నదొర
  • ఓటమి బాటలో మంత్రులు కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్‌
  • ఓటమి బాటలో మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, దాడిశెట్టి రాజా
  • ఓటమి బాటలో మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని
  • ఓటమి బాటలో మంత్రులు ఆదిమూలపు సురేష్‌, మేరుగు నాగార్జున

10:40 AM, 4 Jun 2024 (IST)

హలో ఏపీ.. బైబై వైసీపీ అంటున్న ఓటరు తీర్పు

  • హలో ఏపీ.. బైబై వైసీపీ అంటున్న ఓటరు తీర్పు
  • తూ.గో. జిల్లాలోని అన్ని స్థానాల్లో కూటమిదే ఆధిక్యం
  • చిత్తూరు జిల్లాలోని అన్ని స్థానాల్లో కూటమిదే ఆధిక్యం
  • కౌంటింగ్‌ కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్న వైకాపా అభ్యర్థులు
  • ఓటమి బాటలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు
  • ఓటమి బాటలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, అంజాద్‌ బాషా
  • ఓటమి బాటలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా

10:32 AM, 4 Jun 2024 (IST)

కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు పోతున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులు

మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ కేంద్రం నుండి పామర్రు వైకాపా అభ్యర్థి కైలే అనిల్ కుమార్ బయటికి వెళ్లిపోయారు.

10:27 AM, 4 Jun 2024 (IST)

కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు పోతున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులు

మచిలీపట్నం కౌంటింగ్ కేంద్రం నుంచి గుడివాడ వైకాపా అభ్యర్థి కొడాలి నాని, గన్నవరం అభ్యర్థి వల్లభనేని వంశీ బయటికి వెళ్లిపోయారు

10:09 AM, 4 Jun 2024 (IST)

కడప మినహా అన్ని జిల్లాల్లోనూ కూటమి హవా

  • ఉత్తరాంధ్రను ఊడ్చేస్తున్న కూటమి
  • ఉత్తరాంధ్రలో ఒక్కచోటా ఆధిక్యం ప్రదర్శించని వైకాపా
  • రాయలసీమలోనూ కూటమి జోరు
  • కడప మినహా అన్ని జిల్లాల్లోనూ కూటమి హవా
  • రాజధాని పరిసర ప్రాంతాల్లోనూ కూటమి జోరు

9:53 AM, 4 Jun 2024 (IST)

ఆధిక్యాల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసిన కూటమి

  • ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సునామీ
  • భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోన్న కూటమి అభ్యర్థులు
  • కూటమి ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఫ్యాన్‌
  • జగన్‌, బొత్స మినహా ఓటమి బాటలో మంత్రులు
  • ఆధిక్యాల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసిన కూటమి
  • జిల్లాలకు జిల్లాలే స్వీప్‌ చేస్తున్న కూటమి
  • వెనుకంజలో పెద్దిరెడ్డి, రోజా, బుగ్గన, కొడాలి నాని
  • వెనుకంజలో వల్లభనేని వంశీ, అంబటి, గుడివాడ అమర్నాథ్‌

9:48 AM, 4 Jun 2024 (IST)

వెనుకంజలో మంత్రులు

  • వెనుకంజలో మంత్రులు రోజా, చెల్లుబోయిన, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  • వెనుకంజలో మంత్రులు గుడివాడ అమర్నాథ్‌, అంబటి రాంబాబు
  • మడకశిరలో తొలి రౌండ్‌లో తెదేపా అభ్యర్థి ఎం.ఎస్‌.రాజుకు 5236 ఓట్ల ఆధిక్యం
  • ఉండిలో తొలి రౌండ్ ముగిసేసరికి రఘురామకు 2,559 ఓట్ల ఆధిక్యం
  • కడపలో మూడోరౌండ్‌లో తెదేపా అభ్యర్థి మాధవిరెడ్డికి 3919 ఓట్ల ఆధిక్యం

9:45 AM, 4 Jun 2024 (IST)

వెనుకంజలో మంత్రులు రోజా, చెల్లుబోయిన, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

  • వెనుకంజలో మంత్రులు రోజా, చెల్లుబోయిన, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  • ఉండిలో తొలి రౌండ్ ముగిసేసరికి రఘురామకు 2,559 ఓట్ల ఆధిక్యం
  • కడపలో మూడోరౌండ్‌లో తెదేపా అభ్యర్థి మాధవిరెడ్డికి 3919 ఓట్ల ఆధిక్యం

9:41 AM, 4 Jun 2024 (IST)

మంగళగిరిలో రెండో రౌండ్ ముగిసేసరికి లోకేష్‌కు 12,121 ఓట్ల ఆధిక్యం

  • మంగళగిరిలో రెండో రౌండ్ ముగిసేసరికి లోకేష్‌కు 12,121 ఓట్ల ఆధిక్యం
  • పుంగనూరులో 236 ఓట్ల ఆధిక్యంలో తెదేపా అభ్యర్థి రామచంద్రారెడ్డి
  • చంద్రగిరిలో తెదేపా అభ్యర్థి పులివర్తి నానికి 1950 ఓట్ల ఆధిక్యం
  • నగరిలో వైకాపా అభ్యర్థి మంత్రి రోజా వెనుకంజ
  • నగరిలో తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాశ్‌కు 936 ఓట్ల ఆధిక్యం
  • పుంగనూరులో 136 ఓట్ల ఆధిక్యంలో తెదేపా అభ్యర్థి రామచంద్రారెడ్డి
  • ఉండిలో తొలి రౌండ్ ముగిసేసరికి రఘురామకు 2,559 ఓట్ల ఆధిక్యం
  • బాపట్లలో తొలి రౌండ్‌ ముగిసేసరికి తెదేపా అభ్యర్థి వేగేశ్న నరేంద్రకుమార్‌కు 870 ఓట్ల ఆధిక్యం
  • కడపలో మూడోరౌండ్‌లో తెదేపా అభ్యర్థి మాధవిరెడ్డికి 3919 ఓట్ల ఆధిక్యం

9:37 AM, 4 Jun 2024 (IST)

బైరెడ్డి శబరికి తొలిరౌండ్‌లో 2,385 ఓట్ల ఆధిక్యం

  • విజయవాడ లోక్‌సభ తెదేపా అభ్యర్థి కేశినేని చిన్నికి తొలి రౌండ్‌లో 4 వేల ఓట్ల ఆధిక్యం
  • నంద్యాల లోక్‌సభ తెదేపా అభ్యర్థి బైరెడ్డి శబరికి తొలిరౌండ్‌లో 2,385 ఓట్ల ఆధిక్యం
  • అమలాపురం లోక్‌సభ తెదేపా అభ్యర్థి గంటి హరీష్‌ మాధుర్‌కు తొలి ముందంజ
  • గుంటూరు లోక్‌సభ తెదేపా అభ్యర్థి పెమ్మసాని ముందంజ

9:37 AM, 4 Jun 2024 (IST)

నారా లోకేష్‌కు 4,389 ఓట్ల ఆధిక్యం

  • బాపట్లలో తొలి రౌండ్‌ ముగిసేసరికి తెదేపా అభ్యర్థి వేగేశ్న నరేంద్రకుమార్‌కు 870 ఓట్ల ఆధిక్యం
  • మంగళగిరిలో తొలి రౌండ్ ముగిసేసరికి నారా లోకేష్‌కు 4,389 ఓట్ల ఆధిక్యం
  • పొన్నూరులో తొలి రౌండ్‌ ముగిసేసరికి తెదేపా అభ్యర్థి నరేంద్రకు 6,445 ఓట్ల ఆధిక్యం
  • గురజాలలో తొలి రౌండ్‌ ముగిసేసరికి తెదేపా అభ్యర్థి యరపతినేనికి 1,311 ఓట్ల ఆధిక్యం
  • బాపట్లలో తొలి రౌండ్‌ ముగిసేసరికి తెదేపా అభ్యర్థి నరేంద్ర వర్మకు 1,394 ఓట్ల ఆధిక్యం
  • మైలవరం తెదేపా అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ తొలి రౌండ్‌లో 1,034 ఓట్ల ఆధిక్యం

9:33 AM, 4 Jun 2024 (IST)

తెదేపా అభ్యర్థి నరేంద్రకు 6,445 ఓట్ల ఆధిక్యం

  • పొన్నూరులో తొలి రౌండ్‌ ముగిసేసరికి తెదేపా అభ్యర్థి నరేంద్రకు 6,445 ఓట్ల ఆధిక్యం
  • గురజాలలో తొలి రౌండ్‌ ముగిసేసరికి తెదేపా అభ్యర్థి యరపతినేనికి 1,311 ఓట్ల ఆధిక్యం
  • బాపట్లలో తొలి రౌండ్‌ ముగిసేసరికి తెదేపా అభ్యర్థి నరేంద్ర వర్మకు 1,394 ఓట్ల ఆధిక్యం
  • మైలవరం తెదేపా అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ తొలి రౌండ్‌లో 1,034 ఓట్ల ఆధిక్యం

9:26 AM, 4 Jun 2024 (IST)

నాదెండ్ల మనోహర్‌కు 7,885 ఓట్ల ఆధిక్యం

  • మాచర్ల తెదేపా అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డికి 1,000 ఓట్ల ఆధిక్యం
  • రెండో రౌండ్‌ ముగిసేసరికి తెనాలిలో నాదెండ్ల మనోహర్‌కు 7,885 ఓట్ల ఆధిక్యం
  • పెదకూరపాడు తెదేపా అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌కు తొలిరౌండ్‌లో 1,500 ఓట్ల ఆధిక్యం
  • విజయవాడ పశ్చిమలో భాజపా అభ్యర్థి సృజనాచౌదరికి 2 వేల ఓట్ల ఆధిక్యం

9:22 AM, 4 Jun 2024 (IST)

ముందంజలో తెదేపా అభ్యర్థులు

  • మంగళగిరిలో మొదటి రౌండ్‌ ముగిసేసరికి 4349 ఓట్ల ఆధిక్యంలో లోకేశ్
  • పాణ్యం తెదేపా అభ్యర్థి గౌరు చరితకు తొలిరౌండ్‌లో 2,365 ఓట్ల ఆధిక్యం
  • జీడీనెల్లూరు తెదేపా అభ్యర్థి థామస్‌కు తొలిరౌండ్‌లో 857 ఓట్ల ఆధిక్యం
  • పులివెందులలో తొలిరౌండ్‌లో సీఎం జగన్‌కు 1,888 ఓట్ల ఆధిక్యం
  • పెనుకొండ తెదేపా అభ్యర్థి సవితకు తొలిరౌండ్‌లో వెయ్యి ఓట్ల ఆధిక్యం
  • కడప తెదేపా అభ్యర్థి మాధవిరెడ్డికి తొలిరౌండ్‌లో 665 ఓట్ల ఆధిక్యం
  • నంద్యాల లోక్‌సభ తెదేపా అభ్యర్థి బైరెడ్డి శబరికి తొలిరౌండ్‌లో 2,385 ఓట్ల ఆధిక్యం
  • నందిగామలో 461 ఓట్ల ఆధిక్యంలో తెదేపా అభ్యర్థి తంగిరాల సౌమ్య

9:19 AM, 4 Jun 2024 (IST)

4349 ఓట్ల ఆధిక్యంలో లోకేశ్

  • మంగళగిరిలో మొదటి రౌండ్‌ ముగిసేసరికి 4349 ఓట్ల ఆధిక్యంలో లోకేశ్
  • నందిగామలో 461 ఓట్ల ఆధిక్యంలో తెదేపా అభ్యర్థి తంగిరాల సౌమ్య

9:14 AM, 4 Jun 2024 (IST)

ముందంజలో తెదేపా అభ్యర్థులు

  • విజయవాడ పశ్చిమలో 2 వేల ఓట్ల ఆధిక్యంలో సుజనాచౌదరి
  • పులివెందులలో జగన్‌మోహన్‌రెడ్డి ముందంజ
  • గురజాలలో 1311 ఓట్ల ఆధిక్యంలో తెదేపా అభ్యర్థి యరపతినేని
  • ఉండిలో తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణరాజు ముందంజ
  • తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థి శ్రీనివాస్‌ ముందంజ
  • పాలకొల్లులో తెదేపా అభ్యర్థి నిమ్మల రామానాయుడు ముందంజ
  • సంతనూతలపాడు తెదేపా అభ్యర్థి విజయ్‌కుమార్‌ ముందంజ
  • భీమవరం జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ఆధిక్యం
  • గుడివాడలో తెదేపా అభ్యర్థి వెనిగండ్ల రాము ముందంజ

9:02 AM, 4 Jun 2024 (IST)

రామ్మోహన్‌నాయుడు ఆధిక్యం

  • శ్రీకాకుళం లోక్‌సభ తెదేపా అభ్యర్థి రామ్మోహన్‌నాయుడు ఆధిక్యం
  • కడప లోక్‌సభ వైకాపా అభ్యర్థి వై.ఎస్‌. అవినాష్‌రెడ్డి ఆధిక్యం

8:58 AM, 4 Jun 2024 (IST)

ఆధిక్యంలో ఎన్డీయే అభ్యర్థులు

  • తిరుపతి లోక్‌సభ భాజపా అభ్యర్థి వరప్రసాద్‌ ఆధిక్యం
  • అనకాపల్లి లోక్‌సభ భాజపా అభ్యర్థి సి.ఎం.రమేష్‌ ఆధిక్యం

8:48 AM, 4 Jun 2024 (IST)

ఆధిక్యంలో ఎన్డీయే అభ్యర్థులు

  • నరసరావుపేటలో ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ముందంజ
  • రాజమండ్రిలో భాజపా అభ్యర్థి పురందేశ్వరి ముందంజ
  • విజయవాడలో కేశినేని చిన్ని ముందంజ
  • చిత్తూరులో తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్‌ ముందంజ
  • తిరువూరులో తెదేపా అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్‌ ముందంజ
  • పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌ ముందంజ
  • రాజమండ్రి సిటీలో తెదేపా అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ముందంజ
  • జగ్గంపేటలో తెదేపా అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ముందంజ
  • తెనాలిలో నాదెండ్ల మనోహర్‌ ముందంజ
  • మంగళగిరిలో నారా లోకేష్‌ ముందంజ
  • పూతలపట్టులో తెదేపా అభ్యర్థి మురళీమోహన్‌ ముందంజ
  • రాజమండ్రి గ్రామీణంలో తెదేపా అభ్యర్థి బుచ్చయ్యచౌదరి ముందంజ
  • రెండో రౌండ్‌ ముగిసేసరికి బుచ్చయ్యకు 2870 ఓట్ల ఆధిక్యం
  • కుప్పంలో చంద్రబాబు ఆధిక్యం
  • విజయవాడ పశ్చిమలో భాజపా అభ్యర్థి సుజనాచౌదరి ముందంజ

8:32 AM, 4 Jun 2024 (IST)

కుప్పంలో చంద్రబాబు ఆధిక్యం

  • కుప్పంలో చంద్రబాబు ఆధిక్యం

8:27 AM, 4 Jun 2024 (IST)

ఆధిక్యంలో బుచ్చయ్యచౌదరి

రాజమండ్రి గ్రామీణంలో 910 ఓట్ల ఆధిక్యంలో బుచ్చయ్యచౌదరి

8:25 AM, 4 Jun 2024 (IST)

మోదీ, రాహుల్‌గాంధీ ఆధిక్యం

  • వారణాసిలో ఆధిక్యంలో నరేంద్ర మోదీ
  • కేరళలోని వయనాడ్‌లో రాహుల్‌ గాంధీ ఆధిక్యం
  • గాంధీనగర్‌లో అమిత్‌షా ఆధిక్యం
  • మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో ఆధిక్యంలో నితిన్‌ గడ్కరీ
  • హమీర్‌పుర్‌లో అనురాగ్‌ ఠాకూర్‌ ఆధిక్యం
  • కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ ఆధిక్యం
  • విదిశాలో మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ ఆధిక్యం
  • కర్ణాటక మాండ్యలో ఆధిక్యంలో మాజీ సీఎం కుమారస్వామి
  • హిమాచల్‌ప్రదేశ్‌ మండిలో కంగనా రనౌత్‌ ఆధిక్యం
  • మహారాష్ట్ర బారామతిలో సుప్రియా సూలే ఆధిక్యం
  • ఉత్తర్‌ప్రదేశ్‌లో మైన్‌పూరిలో అఖిలేష్‌ సతీమణి డింపుల్‌ యాదవ్ ఆధిక్యం
  • ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో నటుడు రవికిషన్‌ ఆధిక్యం
  • బంగాల్‌ డైమండ్‌ హార్బర్‌లో మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ ఆధిక్యం

8:00 AM, 4 Jun 2024 (IST)

ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు

  • అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
  • రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపు
  • పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లు
  • ఉ. 8.30కు ప్రారంభం కానున్న ఈవీఎంల ఓట్ల లెక్కింపు
  • రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు
  • కౌంటింగ్ ప్రక్రియ పరిశీలనకు 119 మంది అబ్జర్వర్లు
  • అమలాపురం ఎంపీ స్థానంలో 27 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
  • రాజమండ్రి, నరసాపురం ఎంపీ స్థానాల్లో 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
  • భీమిలి, పాణ్యం అసెంబ్లీ స్థానాల్లో 26 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
  • కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ స్థానాల్లో 5 గంటల్లోనే ఫలితాలు
  • ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు

7:59 AM, 4 Jun 2024 (IST)

ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు

  • దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • దేశవ్యాప్తంగా ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
  • పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత ఈవీఎంల్లో పోలైన ఓట్లు లెక్కింపు
  • కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసుల మోహరింపు
  • కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు
  • ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే డ్రా ద్వారా విజేత నిర్ణయం

7:40 AM, 4 Jun 2024 (IST)

ఏజెంట్‌కు గుండెనొప్పి

  • పల్నాడు జిల్లా: కాకాని జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రం వద్ద ఏజెంట్‌కు గుండెనొప్పి
  • చిలకలూరిపేట నియోజకవర్గ కౌంటింగ్ ఆరో టేబుల్ వద్ద ఉన్న తెదేపా ఏజెంట్ రమేష్
  • రమేష్‌కు గుండెనొప్పి రావడంతో వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలింపు

7:04 AM, 4 Jun 2024 (IST)

చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

  • కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
  • టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న పురందేశ్వరి, మనోహర్, 3 పార్టీల అభ్యర్థులు
  • కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలి: చంద్రబాబు
  • లెక్కింపులో ఏ అనుమానం ఉన్నా ఆర్వోకు ఫిర్యాదు చేయాలి: చంద్రబాబు
  • ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని నిలబడ్డాం: చంద్రబాబు
  • కూటమి కౌంటింగ్ ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దు: చంద్రబాబు

6:21 AM, 4 Jun 2024 (IST)

ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం

  • ఇవాళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
  • ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభం
  • ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు
  • పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లు
  • ఎంపీ స్థానాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు
  • అసెంబ్లీ స్థానాలకు 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు
  • కౌంటింగ్ ప్రక్రియ పరిశీలనకు 119 మంది అబ్జర్వర్లు
  • అమలాపురం ఎంపీ స్థానంలో 27 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
  • రాజమండ్రి, నరసాపురం ఎంపీ స్థానాల్లో 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
  • భీమిలి, పాణ్యం అసెంబ్లీ స్థానాల్లో 26 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
  • కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ స్థానాల్లో 5 గంటల్లోనే ఫలితాలు
  • ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు

6:19 AM, 4 Jun 2024 (IST)

రాష్ట్రంలో ఓటుహక్కు వినియోగించుకున్న 3.33 కోట్లమంది ఓటర్లు

  • రాష్ట్రంలో ఓటుహక్కు వినియోగించుకున్న 3.33 కోట్లమంది ఓటర్లు
  • రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన 4.61 లక్షల మంది ఓటర్లు
  • రాష్ట్రంలో హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు వేసిన 26,473 మంది ఓటర్లు
  • రాష్ట్రంలో ఎలక్ట్రానిక్‌ విధానంలో ఓటు వేసిన 26,721 మంది సర్వీసు ఓటర్లు
Last Updated : Jun 4, 2024, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details