Anakapalli Lok Sabha Seat Political War: అనకాపల్లి జిల్లా భౌగోళికంగా 4292 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. రెండు రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు ఉన్నాయి. జిల్లాలో 12.73 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 6.20 లక్షల పురుషులు, 6.53 లక్షల మహిళలు. 1962లో ఏర్పాటైన ఈ పార్లమెంట్ స్ధానానికి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. తొమ్మిదిసార్లు కాంగ్రెస్, ఐదుసార్లు తెలుగుదేశం, ఒకసారి వైఎస్సార్సీపీ ఇక్కడ విజయం సాధించింది.
ప్రస్తుతం అనకాపల్లి లోక్ సభ స్థానానికి కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ బరిలో ఉన్నారు. ఈయనకు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. వైఎస్సార్ జిల్లాకు చెందిన సీఎం రమేష్, జాతీయ పార్టీ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి లోక్ సభలో అడుగుపెట్టాలని వ్యూహాత్మకంగానే అనకాపల్లి స్థానాన్ని ఎంచుకుని అందుకు అనుగుణంగా అడుగులు వేశారు. ఈ జిల్లాలో తన సామాజికవర్గానికి ఉన్న పట్టుతో, రాజకీయ చతురతతో అన్ని నియోజకవర్గాల్లో అందరినీ కలుపుకొంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా సీఎం రమేష్ కోసం ప్రచారం చేశారు. ఇక ప్రస్తుత ఎంపీ డాక్టర్ సత్యవతికి వైఎస్సార్సీపీ ఈసారి టికెట్ నిరాకరించింది.
వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడిను బరిలోకి దింపింది. తొలుత ఇక్కడ గుడివాడ అమర్ నాథ్ ను రంగంలోకి దింపాలని చూసినా, కూటమి అభ్యర్ధి రాకతో వైఎస్సార్సీపీ తన వ్యూహన్ని మార్చుకోవాల్సి వచ్చింది. మాడుగులలో ఎమ్మెల్యేగా పనిచేసిన ముత్యాల నాయుడు ఈసారి తనను లోక్‌సభకు పంపాలంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కనీస మరమ్మతులు లేని రోడ్లు, నిర్వహణలోపం, విద్య, వైద్య కళాశాల నిర్మాణం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తేవడంలో విఫలం కావడం వంటివి వైఎస్సార్సీపీకి ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. మరోవైపు ప్రజలు అవకాశం ఇస్తే అనకాపల్లి జిల్లాను అభివృద్ధి బాటలో తీసుకెళ్లే దిశగా కృషి చేస్తానని సీఎం రమేష్ చెబుతున్నారు.
రాజంపేట బరిలో మాజీ సీఎం - అన్న ఎంపీ, తమ్ముడు ఎమ్మెల్యే! - Rajampet LOK SABHA ELECTIONS
Anakapalli Assembly constituency: అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా చూస్తే అనకాపల్లి శాసనసభ బరిలో జనసేన అభ్యర్థిగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పోటీ చేస్తున్నారు. గతంలో కొణతాల రాజకీయ జీవితంతో పాటు రైవాడ ఉద్యమం, ప్రజాప్రతినిధిగా చేసిన అభివృద్ధి అంశాలు సానుకూలంగా ఉన్నాయి. చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న దాడి వీరభద్రరావు, కొణతాల ఒకే తాటిపైకి వచ్చి పని చేయడం రాజకీయంగా కొత్త సమీకరణలకు ఊతమిచ్చింది. ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ను బదిలీ చేసిన వైఎస్సార్సీపీ రాజకీయ నేపథ్యం ఉన్న మలసాల భరత్‌ను బరిలోకి దింపింది. ప్రభుత్వ పథకాలే తనకు కలిసి వస్తాయన్నది వైఎస్సార్సీపీ అభ్యర్థి భరత్ అంచనా.
Pendurthi assembly constituency: జీవీఎంసీ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానం పెందుర్తి. ఇక్కడ జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు పోటీ చేస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం, కూటమి పార్టీల బలం ఆయనకు అనుకూల అంశం. టిక్కెట్టు కేటాయించక ముందు నుంచి ఇక్కడి ఓటర్లను ఆకట్టుకునేలా చేసిన కార్యక్రమాలు రమేష్ బాబు విజయావకాశాలను మెరుగ్గా ఉంచాయి. వైఎస్సార్సీపీ నుంచి రెండోసారి అదీప్‌రాజ్ బరిలో నిలిచారు. అవినీతి ఆరోపణలు, సొంత పార్టీలోనే వ్యతిరేకతలు ఈయనకు ప్రతికూలంగా ఉన్నాయి.
ప్రకృతి అందాలకు నెలవు అమలాపురం - స్పీకర్ బాలయోగి సేవలు చిరస్మరణీయం - Amalapuram LOK SABHA ELECTIONS
Narsipatnam Assembly constituency:ఏజెన్సీ ముఖద్వారంగా పిలిచే నర్సీపట్నం అసెంబ్లీ బరిలో తెలుగుదేశం నుంచి పదోసారి చింతకాయల అయ్యన్నపాత్రుడు పోటీ చేస్తున్నారు. మంత్రిగా వివిధశాఖలు నిర్వహించిన ఈయన అనుభవం నర్సీపట్నం అభివృద్దికి తోడ్పడింది. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశానికి వీరవిధేయంగా ఈయన కుటుంబం ఉండడం అయ్యనపాత్రుడికి ఈ ప్రాంతంలో ప్రత్యేకతనే తెచ్చిపెట్టింది. కక్షసాధింపుగా జగన్ ఈ ఐదేళ్లలో అయ్యన్నపై ప్రవర్తించిన తీరును ఆయన స్థిరంగా ఎదుర్కొనేలా చేసింది ఇక్కడి ప్రజల మద్దతే.
పాలిటెక్నిక్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, ఏరియా ఆసుపత్రి, జాతీయ రహదారి అనుసంధాన రహదారి నిర్మాణం ఈయన హయాంలోనే జరగడం వంటివి కలిసొచ్చే అంశాలు. వైఎస్సార్సీపీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ రెండోసారి బరిలో నిలిచారు. సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌కు గణేష్ సోదరుడు. ఐదేళ్లలో చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమీ చేయకపోవటం ఈయనకు ప్రతికూలాంశంగా ఉంది. నర్సీపట్నంలో వైద్యకళాశాల నిర్మాణం, ఏరియా ఆస్పత్రి విస్తరణ, నర్సీపట్నం పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ ఏర్పాటు చేయలేకపోవటంపై ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.