ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

అసెంబ్లీ లాబీలో పవన్​ను కలిసిన అమరావతి రైతు కూలీలు- పరిహారం ఎత్తివేతపై వినతిపత్రం - AMARAVATI WOMEN problems PROBLEMS - AMARAVATI WOMEN PROBLEMS PROBLEMS

Amaravati Women Farmer Laborers Meet Pawan: అసెంబ్లీ లాబీలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను మహిళా రైతు కూలీలు కలిశారు. గత ప్రభుత్వం రైతు కూలీలకు ఇచ్చే పరిహారం ఎత్తివేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ వినతిపత్రం ఇచ్చారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని రైతు కూలీలకు పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు.

Amaravati_Women_Farmer_Laborers_Meet_Pawan
Amaravati_Women_Farmer_Laborers_Meet_Pawan (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 26, 2024, 10:28 AM IST

Amaravati Women Farmer Laborers Meet Pawan: అమరావతి ప్రాంత మహిళా రైతు కూలీలు అసెంబ్లీ లాబీలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్​ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అసెంబ్లీలో కాంట్రాక్టు ప్రాతిపదికన హౌస్ కీపింగ్ విధులు నిర్వర్తిస్తున్నామనే వంకతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమరావతి రైతు కూలీలకు ఇచ్చే పరిహారం ఎత్తి వేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. తమకు అన్యాయం చేస్తూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎత్తివేయాలని ఉప ముఖ్యమంత్రిని హౌస్ కీపింగ్ మహిళా సిబ్బంది కోరారు. హౌస్ కీపింగ్ సిబ్బందిని తన ఛాంబర్​లోకి తీసుకెళ్లిన పవన్ సమస్యను సావదానంగా విన్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని పవన్‌ కల్యాణ్‌ వారికి హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details